‘మా బౌలర్లను మోకరిల్లేలా చేశాడు’ | Pujara frustrated Aussie attack to the point of submission, Ian Chappell | Sakshi
Sakshi News home page

‘మా బౌలర్లను మోకరిల్లేలా చేశాడు’

Published Mon, Jan 7 2019 4:47 PM | Last Updated on Mon, Jan 7 2019 4:49 PM

Pujara frustrated Aussie attack to the point of submission, Ian Chappell - Sakshi

సిడ్నీ:  టీమిండియా ఆటగాడు చతేశ్వర్‌ పుజారా అద్భుతమైన ఆట తీరుతో తమ బౌలర్లను మోకరిల్లేలా చేశాడని ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు ఇయాన్‌ చాపెల్‌ పేర్కొన్నాడు. కోహ్లి కింగ్‌డమ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో పుజారా ఆకట్టుకున్నాడంటూ చాపెల్‌ ప్రశంసించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుని ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా చాపెల్ మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్‌లో ఇప్పుడు విరాట్ కోహ్లి రాజు కావొచ్చు. కానీ.. ఆ రాజ్యంలో పుజారా కూడా ఎన్నో గౌరవాలకి అర్హుడని నిరూపించాడు. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఎంతో మంచి జరిగింది. సిరీస్‌ చేజిక్కించుకోడమే కాదు.. పుజారాలోని పట్టుదల, క్రమశిక్షణ, ఓపిక విలువ తెలిసింది’ అని కొనియాడాడు.

‘పుజారా అద్భుత బ్యాటింగ్‌ నుంచి మా జట్టు చాలా నేర్చుకుని ఉంటుంది. సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచిన పుజారా.. భీకరమైన ఆస్ట్రేలియా బౌలర్లని సైతం అసహనంతో మోకాళ్లపై కూలబడేలా చేశాడు. ఆస్ట్రేలియాలో మూడు సెంచరీలు చేసిన అతడు సునీల్‌ గావస‍్కర్‌ రికార్డును సమం చేశాడు. ఆసీస్‌ గడ్డపై ఏడు ఇన‍్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించి 521 పరుగులు చేయడం అంటే సాధారణ విషయం కాదు. పటిష్టమైన మా బౌలింగ్‌ లైనప్‌ను కకావికలం చేసి మరీ శతకాలపై శతకాలు సాధించాడు’ అని చాపెల్‌ ప్రశంసలు కురిపించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement