సిడ్నీ: వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టుపై ఆసీస్ దిగ్గజం ఇయాన్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. ప్రధానంగా భారత బౌలింగ్ యూనిట్‌ను చాపెల్ కొనియాడాడు. తమ బౌలింగ్ వనరులను సక్రమంగా ఉపయోగించుకునేందుకు కోహ్లి నేతృత్వంలోని టీమిండియాకు అనేక అవకాశాలు ఉన్నాయన్నాడు. ‘ భారత జట్టు అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా పటిష్టంగానే ఉంది. వరుస విరామాల్లో వికెట్లు సాధించే సత్తా భారత్‌కు ఉంది. ప్రత్యేకంగా మధ్య ఓవర్లలో భారత్ బౌలింగ్ యూనిట్ అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అది భారత జట్టు వరల్డ్‌కప్ సాధించడానికి దోహద పడుతుందనే నేను భావిస్తున్నా. ప్రస్తుత క్రికెట్‌లో భారీ స్కోర్లు వస్తున్నాయి. వన్డేల్లో భారీ స్కోర్లు చేయడం అనేది తరచు చూస్తున్నాం.
వరల్డ్‌కప్‌లో కూడా భారీ స్కోర్లు రావడం ఖాయం. అయితే ఇక్కడ ఎటాకింగ్ బౌలింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లతో పోలిస్తే భారత్ పేస్ దళం కాస్త వెనుకంజలో ఉంది. అయినప్పటికీ ఇంగ్లండ్ పిచ్‌లపై భారత్ పేస్ త్రయం(బుమ్రా, భువనేశ్వర్, షమీ)లు అత్యంత ప్రభావం చూపుతారనే నేను విశ్వసిస్తున్నా. ఇక పిచ్‌లు పొడిబారిన సమయంలో కుల్దీప్ యాదవ్, చహల్‌లతో చాలా ప్రమాదకరంగా మారతారు. మరొకవైపు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉండనే ఉన్నాడు. ఇలా భారత్‌కు బౌలింగ్ విభాగంలో అనేక అవకాశాలు ఉన్నాయి’ అని చాపెల్ విశ్లేషించాడు.
Comments
Please login to add a commentAdd a comment