'అన్ని దేశాలకు ఒకే పద్ధతి ఉండాలి' | ICC must apply DRS to every Test match, says Ian Chappell | Sakshi
Sakshi News home page

'అన్ని దేశాలకు ఒకే పద్ధతి ఉండాలి'

Published Sun, Oct 30 2016 1:35 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

ICC must apply DRS to every Test match, says Ian Chappell

సిడ్నీ:ఇక నుంచి అంపైర్ నిర్ణయ పునః సమీక్ష(డీఆర్ఎస్) పద్ధతిని ప్రతీ టెస్టులోనూ అమలు చేసే విధంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు, వ్యాఖ్యాత ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. దీన్ని కొంతవరకే పరిమితం చేయకుండా మొత్తం ఐసీసీ నిర్వహించే అన్ని టెస్టుల్లోనూ చేపడితేనే ఆశించిన ఫలితాలు వస్తాయన్నాడు.

గతంలో డీఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని చాపెల్ పరోక్షంగా తప్పుబట్టాడు. ఈ పద్ధతిని కేవలం ఒక దేశం మాత్రమే వ్యతిరేకించడం నిజంగా దురదృష్టకరమన్నాడు. అయితే ఒకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేటప్పుడు అన్ని క్రికెట్ దేశాలను ఒకే కోవలో చూడకపోవడం సరైన చర్యకాదన్నాడు. కొన్ని ధనిక దేశాలకు ఒకలాగా, బీద దేశాలకు ఒక విధంగా టెక్నాలజీని ఉపయోగిస్తే ప్రపంచంలోని పలు దేశాలకు పలు రకాల చట్టాలను అవలంభించాల్సి వస్తుందన్నాడు. ఇక నుంచి ఐసీసీలో నిర్వహించే అన్ని మ్యాచ్లకూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఒకే విధమైన టెక్నాలజీని ఉపయోగించాలని చాపెల్ సూచించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement