
దుబాయ్: దుబాయ్: టీమిండియా, ఇంగ్లండ్‌లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. నాటింగ్‌హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ల జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(2021-23)కు సంబంధించి ఇరు జట్ల నుంచి రెండు పాయింట్లు కోత విధించింది. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది.
ఇక తొలి టెస్ట్ విషయానికి వస్తే.. వరుణుడు అడ్డం పడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 183 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా 95 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 303 పరుగులకు ఆలౌట్ అయింది. 208 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఆట ఆఖరిరోజు పూర్తిగా వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్ల మధ్య గురువారం(ఆగస్టు 12) నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment