యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి చూసిన ఇంగ్లండ్ రెండో టెస్టులోనూ అదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బ్రిస్బేన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఇంగ్లండ్‌కు డబ్ల్యూటీసీ నుంచి 8 పాయింట్లు కోత విధించింది. ఈ దెబ్బతో ఇంగ్లండ్ డబ్య్లూటీసీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.
అయితే తొలి టెస్టు ముగిసిన వెంటనే స్లో ఓవర్ రేట్ పేరుతో ఐసీసీ అప్పుడే ఇంగ్లండ్ జట్టు నుంచి 5 పాయింట్లు కోత విధిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా దీనికి క్లారిటీ ఇస్తూ శుక్రవారం ఐసీసీ వివరణ ఇచ్చుకుంది. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు నాలుగురోజుల్లోనే ముగిసింది. అయితే ఆట ముగిసేసమయానికి బౌలింగ్‌లో ఇంగ్లండ్ 8 ఓవర్లు వెనుకబడినట్లు తేలింది. ఆర్టికల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆటగాళ్లు, సిబ్బంది నుంచి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. దీంతో 8 ఓవర్ల స్లో ఓవర్ రేటు కారణంగా ఐదు పాయింట్లకు బదులు ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున 8 పాయింట్లు ఇంగ్లండ్ జట్టు నుంచి కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.
ఐసీసీ ప్లేయింగ్ రూల్స్ క్లాజ్ 16.1.2 ప్రకారమే ఇంగ్లండ్ జట్టు నుంచి ఈ కోత విధిస్తున్నట్లు ఐసీసీ వివరించింది. ఇక ఇంగ్లండ్ తాజాగా 8 పాయింట్లు కోల్పోవడంతో ఓవరాల్‌గా 10 పాయింట్లు కోల్పోయి 6 మ్యాచ్‌ల్లో 1 విజయం.. మూడు ఓటములు.. ఇక డ్రాతో 10 పర్సంటేజీ పాయింట్లతో డబ్ల్యూటీసీ 2021-23 పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రూల్ ప్రకారం మ్యాచ్ గెలిచిన జట్టుకు 12 పాయింట్లు, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు, టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు.
Here is how the WTC points table looks like after England are penalised 8 points for slow over-rate in the first Ashes Test 📈#Australia #England #AUSvENG #Ashes pic.twitter.com/hwRq2u4MCP
— Sportskeeda (@Sportskeeda) December 17, 2021
Comments
Please login to add a commentAdd a comment