PC: IPL.com
ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు భారీ షాక్ తగిలింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాహుల్ పై రూ.12 లక్షల జరిమానా ఐపీఎల్ నిర్వహకులు విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. "ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు రాహుల్‌పై రూ.12 లక్షలు జరిమానా విధించబడింది" అని ఐపిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. 60 బంతుల్లో 103 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో తాను ఆడుతున్న వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు.
చదవండి: IPL 2022: కోహ్లి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. అనుష్క శర్మ వైపు చూస్తూ.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment