
India Fined For Slow Over-rate 1st Test Vs South Africa.. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయాన్ని ఆస్వాధిస్తున్న టీమిండియాకు స్లో ఓవర్ రేట్ పేరుతో ఐసీసీ గట్టిషాక్ ఇచ్చింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ కారణంతో టీమిండియా జట్టుకు 20 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. తాజాగా విధించిన జరిమానాతో టీమిండియాకు డబ్య్లూటీసీ 2022-23 పాయింట్స్‌లో ఒక పాయింట్ కోత పడనుంది.
చదవండి: Virat Kohli: 'చరిత్రను తిరగరాశాం.. ప్రపంచ ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో షమీ ఒకడు'
ఆర్టికల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయలేకపోయింది. స్టో ఓవర్ రేటు నమోదు చేసిన కారణంగా టీమిండియా జట్టుతో పాటు సహాయకి సిబ్బందికి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కింది. దీంతోపాటు ఆర్టికల్ 16.11 ప్రకారం.. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు ఐసీసీ వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ 2022-23లో ఒక పాయింట్ కోత పడింది. ప్రస్తుతం డబ్య్లూటీసీ పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. ఇక తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా.. జనవరి 3 నుంచి జోహెన్నెస్‌బర్గ్ వేదికగా రెండో టెస్టు ఆడనుంది.
చదవండి: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా రాసింది ఒక చరిత్ర..
Comments
Please login to add a commentAdd a comment