centurion
-
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్‌కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్‌తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్‌కు దిగలేదు. దీంతో అతను కేప్‌టౌన్‌లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్‌టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. అక్కడ ఎవరికీ సాధ్యం కాలేదు!
South Africa vs India, 1st Test- Centurion: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. సహచరులంతా ప్రొటిస్ పేస్ దళానికి బెంబేలెత్తిన వేళ జట్టును ఆదుకునేందుకు తానున్నానంటూ ముందుకు వచ్చి సత్తా చాటాడు. తొలి రోజు ఆట సందర్భంగా అర్ధ శతకం పూర్తి చేసి ఆలౌట్ గండం నుంచి తప్పించిన ఈ కర్ణాటక బ్యాటర్.. సెంచూరియన్ వేదికగా బుధవారం శతకం సాధించాడు. అప్పుడు 123... భారత ఇన్నింగ్స్‌లో 65.6వ ఓవర్ వద్ద గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో సిక్సర్‌తో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సెంచూరియన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీమిండియా 2021/22 టూర్ సందర్భంగా సెంచూరియన్‌లో 123(260 బంతుల్లో) పరుగులు సాధించిన రాహుల్.. తాజాగా 101(133 బంతులు) చేశాడు. ఇక రాహుల్ అద్భుత సెంచరీ కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేయగలిగింది. .@klrahul has come out with a positive mindset! What are your predictions for the total? 🤔 Tune-in to Day 2 of the #SAvIND 1st Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/yDdVCX4TBD — Star Sports (@StarSportsIndia) December 27, 2023 సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా కేఎల్ రాహుల్ సాధించిన ఘనతలు 1. సెంచూరియన్‌లో అత్యధిక శతకాలు బాదిన పర్యాటక జట్టు ఏకైక బ్యాటర్ 2. సౌతాఫ్రికా గడ్డ మీద అత్యధిక సెంచరీలు చేసిన ఆసియా బ్యాటర్ల జాబితాలో చోటు(సచిన్ టెండుల్కర్ 5, అజర్ మహ్మూద్, టి సమరవీర, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్-2) ఇక టెస్టుల్లో రాహుల్‌కు ఇది ఎనిమిదో సెంచరీ. విదేశీ గడ్డపై అత్యుత్తమ శతకం అని చెప్పొచ్చు. ఇక సెంచూరియన్ మ్యాచ్‌లో రాహుల్ నాండ్రీ బర్గర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. చదవండి: న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ సంచలన విజయం.. కివీస్ గడ్డపై తొలి గెలుపు -
రబాడ బౌన్సర్ల వర్షం.. అయినా గానీ! శెభాష్ రాహుల్
టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై రాహుల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్.. సఫారీ పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఓ వైపు దక్షిణాఫ్రికా బౌలర్లు బౌన్సర్ల వర్షం కురిపిస్తునప్పటికీ రాహుల్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ 105 బంతుల్లో 70 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. భారత్ స్కోర్ 200 పరుగుల మార్క్ దాటడంలో రాహుల్‌ది కీలక పాత్ర. సౌతాఫ్రికాపై రాహుల్‌కు ఇది 2వ హాఫ్ సెంచరీ. ఓవరాల్‌గా 14వ ఆర్ధ సెంచరీ కావడం గమానార్హం. ఈ ఇన్నింగ్స్ మాత్రం రాహుల్‌కు తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతడి ఇన్నింగ్స్‌లో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వర్షం అంతరాయం.. ఈ తొలి రోజు మూడో సెషన్లో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మొదటి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో పాటు వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(70), మహ్మద్ సిరాజ్ ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు. చదవండి: IND vs SA 1st Test: టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ A fifty to remember in the Test career. 🔥 - Take a bow, KL Rahul. pic.twitter.com/P9pCEa7Dqm — Johns. (@CricCrazyJohns) December 26, 2023 -
Ind vs SA Test: ‘సెంచూరియన్’ పేసర్లకు అనుకూలం!
సెంచూరియన్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్టు పేస్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే అవకాశం ఉంది. ఈ నెల 26నుంచి మ్యాచ్ జరిగే సూపర్ స్పోర్ట్ పార్క్ పిచ్ పేసర్లకు బాగా కలిసొస్తుందని పిచ్ క్యురేటర్ బ్రయాన్ బ్లాయ్ స్వయంగా వెల్లడించాడు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ టెస్టుకు వాన అంతరాయం కలిగించవచ్చు. మ్యాచ్ మొదటి రోజు పూర్తిగా వాన బారిన పడవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో పిచ్‌పై క్యురేటర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘మొదటి రోజు గనుక ఆట వాన బారినపడితే తర్వాతి రోజుల్లో పేసర్లకు మంచి అవకాశముంది. పిచ్‌పై కవర్లు ఎక్కువ సమయం ఉంచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయడం చాలా కఠినంగా మారిపోతుంది. దాదాపు 20 డిగ్రీలకు పడిపోయే చల్లటి వాతావరణంలో పేస్ బౌలర్లకే మేలు జరుగుతుంది. ఆపై కూడా మ్యాచ్‌లో స్పిన్నర్ల పాత్ర నామమాత్రంగా మారిపోతుంది. పిచ్‌పై ప్రస్తుతం పచ్చిక ఉంది. మ్యాచ్ సమయానికి కూడా దీనిని కొనసాగిస్తాం. నాలుగు రోజుల్లోనే టెస్టు ముగిసినా ఆశ్చర్యం లేదు’ అని బ్లాయ్ వ్యాఖ్యానించాడు. 2021 సిరీస్‌లో సెంచూరియన్‌లోనే జరిగిన టెస్టులో భారత్ విజయం సాధించింది. -
తొలి టెస్టు విజయం.. టీమిండియాకు ఐసీసీ షాక్
India Fined For Slow Over-rate 1st Test Vs South Africa.. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయాన్ని ఆస్వాధిస్తున్న టీమిండియాకు స్లో ఓవర్ రేట్ పేరుతో ఐసీసీ గట్టిషాక్ ఇచ్చింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ కారణంతో టీమిండియా జట్టుకు 20 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. తాజాగా విధించిన జరిమానాతో టీమిండియాకు డబ్య్లూటీసీ 2022-23 పాయింట్స్‌లో ఒక పాయింట్ కోత పడనుంది. చదవండి: Virat Kohli: 'చరిత్రను తిరగరాశాం.. ప్రపంచ ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో షమీ ఒకడు' ఆర్టికల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయలేకపోయింది. స్టో ఓవర్ రేటు నమోదు చేసిన కారణంగా టీమిండియా జట్టుతో పాటు సహాయకి సిబ్బందికి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కింది. దీంతోపాటు ఆర్టికల్ 16.11 ప్రకారం.. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు ఐసీసీ వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ 2022-23లో ఒక పాయింట్ కోత పడింది. ప్రస్తుతం డబ్య్లూటీసీ పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. ఇక తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా.. జనవరి 3 నుంచి జోహెన్నెస్‌బర్గ్ వేదికగా రెండో టెస్టు ఆడనుంది. చదవండి: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా రాసింది ఒక చరిత్ర.. -
సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
-
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా రాసింది ఒక చరిత్ర..
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవని టీమిండియా ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రయత్నంలోనే తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసింది. తొలి రోజు నుంచే మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిక్యం చూపించిన టీమిండియా ఏ దశలోనూ సౌతాఫ్రికాకు అవకాశం ఇవ్వలేదు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ సూపర్ శతకంతో రాణించగా.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్థ శతకం.. రహానే 48 పరుగుల కీలక ఇన్నింగ్స్ వెరసి తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లతో దుమ్మురేపడం.. అతనికి బుమ్రా, సిరాజ్, శార్దూల్ నుంచి సహకారం అందడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు 131 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ తడబడడంతో 174 పరుగులకే కుప్పకూలింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా ఎదుట 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. అయితే సెంచూరియన్ మైదానంలో 200 కంటే ఎక్కువ పరుగులు చేధించిన సందర్భాలు లేవు. దీనిని టీమిండియా చక్కగా వినియోగించుకుంది. భారత పేసర్లు షమీ, బుమ్రా, సిరాజ్‌లు చెలరేగడం.. చివర్లో అశ్విన్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో టీమిండియా ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా సౌతాఫ్రికా గడ్డపై పలు రికార్డులు అందుకుంది. ►సెంచూరియన్ వేదికగా జరిగిన గత 11 టెస్టు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క ఆసియన్ జట్టు విజయం సాధించకపోగా, సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా కొత్త చరిత్ర లిఖించింది. మరొకవైపు సెంచూరియన్‌లో గెలిచిన తొలి ఆసియన్ జట్టుగా టీమిండియా నయా రికార్డు నెలకొల్పింది. ►టీమిండియాకు సౌతాఫ్రికా గడ్డపై ఇది నాలుగో విజయం. 2001-02లో జోహెన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 123 పరుగుల తేడాతో తొలిసారి విజయాన్ని అందుకుంది. ఇక రెండోసారి డర్బన్ వేదికగా 2010-11లో 87 పరుగుల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. ఇక 2017-18లో జోహెన్నెస్‌బర్గ్ వేదికగా 63 పరుగుల తేడాతో ముచ్చటగా మూడో విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా 113 పరుగుల తేడాతో నాలుగో విజయాన్ని అందుకుంది. ►2021లో టీమిండియా(ఆసియా కాకుండా) విదేశీ గడ్డపై నాలుగు విజయాలు సాధించింది. అందులో బ్రిస్బేన్(ఆస్ట్రేలియా), లార్డ్స్, ఓవల్(ఇంగ్లండ్), తాజాగా సెంచూరియన్(సౌతాఫ్రికా) ఉన్నాయి. కాగా టీమిండియా క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 2018లో జోహెన్నెస్‌బర్గ్(సౌతాఫ్రికా), నాటింగ్హమ్(ఇంగ్లండ్), అడిలైడ్, మెల్బోర్న్(ఆస్ట్రేలియా) ఇదే తరహాలో నాలుగు విజయాలు సాధించింది. ►ఇక సౌతాఫ్రికా సొంతగడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ 200లోపూ ఆలౌట్ కావడం ఇది మూడోసారి. ఇంతకముందు 2001-02లో ఆస్ట్రేలియాపై(159&133) జోహెన్నెస్‌బర్గ్ వేదికగా , 2017-18లో టీమిండియాపై (194&177) జోహెన్నెస్‌బర్గ్ వేదికగా, 2021-22లో టీమిండియాపై సెంచూరియన్ వేదికగా (197&191) -
Ind Vs Sa Test Series: ప్రొటిస్ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
Ind Vs Sa Test Series: భారత్‌తో జరుగుతున్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడి భార్య త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో పితృత్వ సెలవు తీసుకోనున్నాడు. ఈ క్రమంలో టీమిండియాతో జరుగనున్న రెండో, మూడో టెస్టుకు డికాక్ అందుబాటులో ఉండటం లేదు. తొలుత రెండో టెస్టు ఆడాలని భావించిన డికాక్... తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. గర్భవతి అయిన భార్యకు ఎక్కువ సమయం కేటాయించాలని అతడు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో తొలి టెస్టు పూర్తైన వెంటనే జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా డికాక్ వంటి స్టార్ బ్యాటర్ దూరం కావడం ప్రొటిస్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. ఇక అతడి స్థానంలో వికెట్ కీపర్లు కైల్ వెరెన్నె లేదంటే... రియాన్ రికెల్టన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కోహ్లి సేనతో సెంచూరియన్ వేదికగా తొలి టెస్టులో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో డికాక్ 33 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, రహానే, శార్దూల్, షమీ వికెట్లు కూల్చడంలో భాగమయ్యాడు ఈ వికెట్ కీపర్. నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. చదవండి: ODI Series Cancelled: కరోనా కలకలం.. వన్డే సిరీస్ రద్దు Quinton De Kock: ఎంత ఔటైతే మాత్రం ఇంత కోపం అవసరమా డికాక్.. pic.twitter.com/DsqwN8BHZ5 — Addicric (@addicric) December 28, 2021 -
Ind vs Sa: చెట్టినాడ్ చికెన్, బ్రకోలీ సూప్.. ఫొటో వైరల్! ఏంటయ్యా నీ తిండి గోల!
Ind vs Sa 1st Test: Indian Players Lunch Menu On Day 2 Photo Goes Viral: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో రోజు టీమిండియా బ్యాటర్ల మెరుపులు చూడాలని భావించిన అభిమానులకు నిరాశ మిగిలిన సంగతి తెలిసిందే. లంచ్ బ్రేక్ తర్వాత అయినా మ్యాచ్ మొదలవుతుందని ఎదురుచూసిన వాళ్ల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఈ క్రమంలో వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే సోమవారం నాటి ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో టీవీల ముందు కూర్చున్న వీరాభిమానులకు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో కామెంట్లు చేశారు . ‘‘ప్చ్.. మనోళ్లు మంచిగా ఆడుతున్నారని వరుణుడు పగపట్టాడేమో! పదే పదే ఆటంకం కలిగించాడు. రాహుల్ క్లాసిక్ ఇన్నింగ్స్ కొనసాగుతుందా లేదా చూడాలంటే.. మరుసటి రోజు దాకా వెయిట్ చేయాల్సిందే’’అంటూ ఉసూరుమన్నారు. ఇదిలా ఉంటే.. మఫద్దాల్ వోహ్రా అనే వ్యక్తి.. ఓ ఆసక్తికర పోస్టుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. రెండో రోజు టీమిండియా లంచ్ మెనూకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ఇక ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆట వర్షార్పణమైందని మేము బాధపడుతుంటే.. నీ గోల ఏంటయ్యా. వాళ్లేం తిన్నారు... ఎలా తిన్నారు.. ఇదంతా అవసరమా’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ టీమిండియా ఆటగాళ్ల మెనూలో ఉన్న ఆహారపదార్థాలు ఏమిటంటే.. చెట్టినాడ్ చికెన్, బ్రకోలీ సూప్, వెజిటబుల్ కడాయి, పనీర్ టిక్కా తదితరాలు. కాగా తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ క్లాసిక్ సెంచరీతో ఆకట్టుకోగా.. రహానే అర్ధ సెంచరీకి చేరువగా ఉన్నాడు. మంగళవారం కూడా వర్షం పడినట్లయితే... మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చదవండి: KL Rahul: భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్! Day 2 Lunch menu for team India. pic.twitter.com/lXFuVTd1oT — Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2021 Unfortunately, due to the large volume of rain today at Centurion, play has been called off for the day. #SAvIND pic.twitter.com/NQ5Jbc8MlJ — BCCI (@BCCI) December 27, 2021 -
పిచ్‌ను చూసి షాక్‌కు గురైన శ్రేయాస్.. ప్రాక్టీస్‌లో నిమగ్నం కావాలన్న ద్రవిడ్
సెంచూరియన్: మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా.. తొలి టెస్ట్ వేదిక అయిన సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో అడుగుపెట్టింది. మ్యాచ్ ప్రారంభానికి మరో ఆరు రోజులే మిగిలి ఉండడంతో ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. పిచ్ పరిశీలిన నిమిత్తం మైదానంలోకి వెళ్లిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పిచ్‌పై ఉన్న పచ్చికను చూసి షాక్‌కు గురయ్యానంటూ వ్యాఖ్యానించాడు. పిచ్‌పై చాలా గడ్డి ఉందని, ఇలాంటి వికెట్‌పై బ్యాటింగ్ చేయడం బ్యాటర్‌కు సవాలుగా ఉంటుందని పేర్కొన్నాడు. #TeamIndia had an intense nets session 💪🏻 at SuperSport Park 🏟️ in the build up to the first #SAvIND Test. Here's @28anand taking you closer to all the action from Centurion. 👍 👍 Watch this special feature 🎥 🔽https://t.co/Dm6hVDz71w pic.twitter.com/qjxnBszmDa — BCCI (@BCCI) December 20, 2021 ఈ విషయమై సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మను సంప్రదించగా.. అతను కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని తెలిపాడు. వికెట్ చాలా తడిగా ఉందని, ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్ చాలా కష్టమవుతుందని ఇషాంత్ అభిప్రాయపడినట్లు వెల్లడించాడు. వికెట్‌ను పరిశీలించిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. పచ్చికను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ప్రాక్టీస్ చేయాలని ఆటగాళ్లకు సూచించాడు. ప్రత్యర్థి జట్టులో రబాడ, నోర్జే లాంటి భీకరమైన ఫాస్ట్ బౌలర్లున్నారని, ఇలాంటి వికెట్‌పై వారిని ఎదుర్కోవాలంటే కఠోరమైన ప్రాక్టీస్ చేయడమే పరిష్కారమని అభిప్రాయపడ్డాడు. కాగా, సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. A new day and a fresh new start 👍🏻 We're back at it 💪🏻#TeamIndia 🇮🇳 | #SAvIND pic.twitter.com/xceSqZ8z6v — BCCI (@BCCI) December 20, 2021 చదవండి: తనపై లైంగిక దాడి జరగలేదు.. మాట మార్చిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి -
మ్యాచ్ ఫిక్సింగ్‌ల్లో ఇది వేరయా...
సరదాగా గల్లీ క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు చీకటి పడిపోతుందనుకుంటే ఆటగాళ్లంతా అన్ని నిబంధనలు పక్కన పెట్టేస్తారు. ఎవరూ బాధపడకూడదు కాబట్టి అందరికీ బ్యాటింగ్ వచ్చేలా చేద్దాం, గెలుపోటములను పక్కన పెట్టి అందరం తలా కొద్దిసేపు ఆడుకుందాం, బాగా ఆడినా ఆడకపోయినా అదో తృప్తి..! ఇలా అనుకుంటూ చేతులు కలుపుకోవడం మామూలే. కానీ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగితే? సరిగ్గా ఇలాగే కాకపోయినా దాదాపు ఇదే తరహాలో ఇరు జట్లు ఒప్పందపు టెస్టు ఆడాయి. చివరకు అది మ్యాచ్ ఫిక్సింగ్‌గా తేలింది. ఇదంతా 2000లో సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ గురించే. మ్యాచ్ ఫిక్సింగ్‌లో దోషిగా నిలిచిన హాన్సీ క్రానేయే ఈ మొత్తం వ్యవహారానికి కేంద్రంగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం కొత్త కాదు. అనేక మంది ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడటం... ఆపై నిషేధాలు ఎదుర్కోవడం, శిక్షకు గురికావడం జరిగాయి. అయితే 2000లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫిక్స్ అయిన ఒక మ్యాచ్ మాత్రం అనూహ్యం. ‘కొత్త తరహా, ఆసక్తికర వ్యూహం’ పేరుతో సాగిన ఈ వ్యవహారం అసలురంగు కొద్ది రోజుల తర్వాత బయటపడటంతో క్రికెట్ ప్రపంచం విస్తుపోయింది. ఏం జరిగింది... ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2000 జనవరి 14న దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు ప్రారంభమైంది. అప్పటికే సఫారీలు 2–0తో సిరీస్ సొంతం చేసుకున్నారు. తొలి రోజు దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 155 పరుగులు చేసిన దశలో భారీ వర్షం వచ్చింది. వాన తగ్గకపోవడంతో వరుసగా మూడు రోజులపాటు ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో ‘డ్రా’ ఖాయమనుకొని చివరి రోజు ఏదో మొక్కుబడిగా మైదానంలోకి దిగేందుకు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. క్రానే ప్రతిపాదన... ఈ దశలో దక్షిణాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రానే తన ప్రత్యర్థి, ఇంగ్లండ్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ముందు ఒక అనూహ్య ప్రతిపాదన ఉంచాడు. ప్రేక్షకులను నిరాశపర్చడం ఎందుకు? మనం ఏదైనా కొత్తగా చేసి వారికి అందించవచ్చు కదా! నా వద్ద ఒక ఆలోచన ఉంది అంటూ వివరించాడు. ముందు హుస్సేన్ షాక్‌కు గురైనా... సహచరులతో చర్చించి ఓకే అన్నాడు. దీని ప్రకారం చివరి రోజు సఫారీలు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క బంతి కూడా ఆడదు. ఆపై దక్షిణాఫ్రికా కూడా రెండో ఇన్నింగ్స్‌ను అస్సలు ఆడకుండా ఫోర్ఫీట్ చేస్తుంది. ఇంగ్లండ్ ముందు ఊరించే లక్ష్యాన్ని విధిస్తుంది (ఇది కూడా ఇంగ్లండ్‌కు అనుకూలంగానే సాగింది). దీని ప్రకారం చర్చోపచర్చల తర్వాత దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 248 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఇంగ్లండ్ లక్ష్యం 76 ఓవర్లలో 249గా మారింది. చివరకు ఆ రోజు మరో ఐదు బంతులు మిగిలి ఉండగా 75.1 ఓవర్లలో 8 వికెట్లకు 251 పరుగులు చేసి 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. మొత్తానికి ఈ పర్యటనలో ఓ మ్యాచ్‌లో నెగ్గామని హుస్సేన్ బృందం సంబరపడింది. అసలు విషయమిది... ఆ సమయంలో క్రానేకు అద్భుతమైన కెప్టెన్‌గా గుర్తింపు ఉంది. అతని వ్యూహాలు, ప్రణాళికలు కొత్తగా ఉంటాయి కాబట్టి అదే కోవలో దీనిని చేర్చి అంతా ప్రశంసించారు. తాను టెస్టు క్రికెట్‌ను బతికించేందుకే ఇలా చేశానని అతను కూడా చెప్పుకున్నాడు. అయితే సరిగ్గా మూడు నెలల తర్వాత ఏప్రిల్‌లో భారత్‌తో సిరీస్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో క్రానే పేరు బయటకు వచ్చిన తర్వాత ఈ మ్యాచ్ కూడా ఫిక్స్ అయినట్లు తేలింది. నిజానికి నాలుగో రోజు సాయంత్రమే క్రానేను ఒక బుకీ కలిశాడు. మ్యాచ్ ‘డ్రా’ అయితే తాను భారీగా నష్టపోతానని, ఎలాగైనా ఫలితం రావాలని అతను కోరాడు. దాంతో క్రానే ‘డిక్లరేషన్’ ఎత్తుగడతో ముందుకు వచ్చాడు. హుస్సేన్ అంగీకరించిన తర్వాతే మ్యాచ్ జరుగుతోందని బుకీకి మెసేజ్ పంపించాడు. మ్యాచ్ ముగిశాక క్రానేకు బుకీ 5 వేల బ్రిటిష్ పౌండ్లు, ఒక లెదర్ జాకెట్ బహుమతిగా ఇచ్చాడు (నిజానికి ఇది ఈ మ్యాచ్ కోసం కాదు. భవిష్యత్తులోనూ సహకారం కోరుకుంటూ చిన్న గిఫ్ట్ అంటూ జాకెట్లో డబ్బులు పెట్టి ఇచ్చాడు). నిజం బయటపడిన రోజు ప్రపంచమంతా విస్తుపోయింది. ఈ మ్యాచ్‌లో భాగంగా ఉన్న ఆటగాళ్లంతా షాక్‌కు గురయ్యారు. నిజానికి సిరీస్ ఫలితం తేలిపోయింది కాబట్టి క్రానే దృష్టిలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకపోయింది. ఎవరు గెలిచినా ఫలితం రావడం ముఖ్యం కాబట్టి దక్షిణాఫ్రికా చివరి వరకు గెలిచేందుకు ప్రయత్నించిందే తప్ప కావాలని ఓడిపోకపోవడం గమనార్హం. అయితే కారణమేదైనా చరిత్రలో ఒక చేదు ఘటనగా ఈ టెస్టు మిగిలిపోయింది. -
సఫారీలకు సంతోషం
సెంచూరియన్: సొంతగడ్డపైనే శ్రీలంకలాంటి జట్టు చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి. భారత్‌లో ఆడిన సిరీస్‌లో 0–3తో చిత్తయితే ఇందులో రెండు ఇన్నింగ్స్ పరాజయాలు. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం, తప్పుకున్న టీమ్ ప్రధాన స్పాన్సర్. ఇలా వేగంగా పతనమైపోతూ వచ్చిన దక్షిణాఫ్రికా క్రికెట్‌కు కాస్త ఊరట! దిగ్గజ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్, జాక్వస్ కలిస్ టీమ్ డైరెక్టర్, కోచ్, సలహాదారుల పాత్రలోకి వచి్చన తర్వాత బరిలోకి దిగిన మొదటి పోరులోనే ఆ జట్టు విజయాన్ని రుచి చూసింది. ఆదివారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 376 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 121/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఒక దశలో 204/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 64 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది. రోరీ బర్న్స్ (154 బంతుల్లో 84; 11 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ జో రూట్ (48) మాత్రమే కొద్దిగా పోరాడాడు. సఫారీ పేస్ బౌలర్లు రబడ 4, నోర్జే 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలో నిలవగా... జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో రెండో టెస్టు జరుగుతుంది. తాజా విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ పాయింట్ల పట్టికలో కూడా డు ప్లెసిస్ సేన ఖాతా తెరిచింది. ఈ గెలుపు అనం తరం దక్షిణాఫ్రికాకు 30 పాయింట్లు లభించాయి. -
ఇంగ్లండ్ లక్ష్యం 376
సెంచూరియన్: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. 376 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ శనివారం ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో వికెట్ నష్టపోయి 121 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి మరో 255 పరుగులు కావాలి. ఇటు దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే మాత్రం మిగిలిన 9 వికెట్లను కూల్చాల్సిన పరిస్థితి. ఇంకో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం బర్న్స్ (77 బ్యాటింగ్; 11 ఫోర్లు), డెన్లీ (10 బ్యాటింగ్, ఫోర్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 72/4తో మూడో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా 61.4 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌటైంది. డస్సెన్ (51; 5 ఫోర్లు), ఫిలాండర్ (46; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జోఫ్రా ఆర్చర్ (5/102)తో ఆకట్టుకున్నాడు. -
దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా సఫారీ జట్టుకు 103 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో జో డెన్లీ (50), స్టోక్స్ (35), రూట్ (29) మాత్రమే కొద్దిగా ప్రతిఘటించగలిగారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వెర్నాల్ ఫిలాండర్ 4 వికెట్లతో చెలరేగగా, రబడకు 3 వికెట్లు దక్కాయి. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్ తమ బౌలర్ల ప్రతిభతో ప్రత్యర్థిని కట్టడి చేయగలిగింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 72 పరుగులు చేసింది. అండర్సన్ మరో సారి తొలి ఓవర్లోనే మార్క్రమ్ (2)ను అవుట్ చేయగా, ఎల్గర్ (22), హమ్జా (4), డు ప్లెసిస్ (20) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం వాన్‌డర్ డసెన్ (17), నోర్జే (4) క్రీజ్‌లో ఉండగా...ఓవరాల్‌గా ఆతిథ్య జట్టు 175 పరుగులు ముందంజలో ఉంది. -
నేడు ‘బాక్సింగ్ డే’ టెస్టుల షురూ
మెల్బోర్న్: ఆ్రస్టేలియా టాపార్డర్ బ్యాట్స్‌మన్ లబ్ షేన్ ను అరుదైన సెంచరీ చాన్స్ ఊరిస్తోంది. అతను గత మూడు టెస్టుల్లోనూ శతకం సాధించాడు. ఇప్పుడు ఇక్కడా శతక్కొడితే... వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేసిన ఆరో ఆ్రస్టేలియన్గా నిలుస్తాడు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్ మూడుసార్లు ఈ ఘనతకెక్కాడు. తర్వాత ఫింగ్లెటన్, హార్వీ, హేడెన్, స్మిత్ వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేశారు. మరోవైపు తొలి టెస్టు పరాజయంతో సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్ ‘బాక్సింగ్ డే’ టెస్టులో ప్రతాపం చూపాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే కివీస్‌కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) ఎప్పుడూ కలిసి రాలేదు. ఇక్కడ మూడు మ్యాచ్‌లాడిన న్యూజిలాండ్ రెండు ఓడి, ఒకదాంట్లో ‘డ్రా’ చేసుకుంది. కానీ ఈసారి ఆ రికార్డును మార్చేపనిలో ఉంటామని న్యూజిలాండ్ కెపె్టన్ విలియమ్సన్ అన్నాడు. ఆతిథ్య జట్టేమో ఈ మ్యాచ్ కూడా గెలిచి... మరోటి మిగిలుండగానే మూడు టెస్టుల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. మెల్‌బోర్న్‌లాంటి బౌన్సీ వికెట్ పిచ్‌లపై ఐదుగురు బౌలర్లను బరిలోకి దించాలని యోచిస్తోంది. హాజెల్‌వుడ్ స్థానంలో ప్యాటిన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. కమిన్స్, స్టార్క్, లయన్లతో ఐదో బౌలర్‌గా మైకెల్ నెసెర్‌ను తీసుకునే అవకాశముందని కోచ్ లాంగర్ చెప్పాడు. సెంచూరియన్: గాయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్... ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తొలిటెస్టుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ‘బాక్సింగ్ డే’ పోరు జరగనుంది. పేస్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, స్పిన్నర్ జాక్ లీచ్... ఇలా కీలక ఆటగాళ్లు ‘ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్నారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఆడేది అనుమానంగా మారింది. ఇది ఇంగ్లిష్ జట్టు కూర్పునకు పెను సమస్యగా మారింది. అయితే అందుబాటులో ఉన్న ఆటగాళ్లు సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారని కెపె్టన్ జో రూట్ తమ జట్టులో స్థైర్యాన్ని పెంచే ప్రకటన చేశాడు. రూట్, డుప్లెసిస్ మరోవైపు సొంతగడ్డపై బలంగా కనబడుతున్న దక్షిణాఫ్రికా జట్టు మొదటి రోజు నుంచే ‘దెబ్బ’తిన్న ఇంగ్లండ్‌పై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెస్టుతో తమ బ్యాట్స్‌మన్ రస్సీ వాన్‌డెర్ డస్సెన్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. అలాగే ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ కూడా అరంగేట్రం చేసే అవకాశముందని చెప్పాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగమైన ఈ సిరీస్‌లో ఇరు జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడతాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 56 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా... దక్షిణాఫ్రికా ఇంకా ఖాతానే తెరువకపోవడంతో అట్టడుగున 9వ స్థానంలో ఉంది. -
మణికట్టు...ఆటకట్టు
పేస్ ఇబ్బంది పెట్టలేదు... బౌన్స్ పెద్దగా కనిపించలేదు... కానీ స్పిన్ మాత్రం సఫారీ బ్యాట్స్‌మెన్‌తో సొంతగడ్డపైనే చిందులు వేయించింది. మణికట్టును వీడిన బంతులు మిసైల్స్‌లా దూసుకొస్తుంటే ఆడుతోంది భారత్‌లోనా లేక తమ దేశంలోనా అని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో సంశయం... ఆ సందేహం తీరేలోపే అంతా ముగిసిపోయింది... ఒకరి వెంట మరొకరు... ఒకే స్కోరు వద్ద ముగ్గురు... కలిసికట్టుగా, సమష్టిగా పెవిలియన్ చేరిపోయారు... 42 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీసిన మన స్పిన్ మంత్రం మళ్లీ పని చేసింది. ఫలితంగా దక్షిణాఫ్రికా 118 ఆలౌట్...ఆ తర్వాత వరుసగా రెండో మ్యాచ్‌లో భారత్ అలవోక ఛేదన. దాదాపు మూడు వారాల క్రితం ఇక్కడే రెండో టెస్టులో ఇది భారత్ పిచ్‌లాగానే ఉందని అందరూ అన్నారు. దానిని ఉపయోగించు కోలేకపోయిందంటూ పరాజయం తర్వాత వ్యాఖ్యలూ వినిపించాయి. అయితే ఈసారి కూడా వికెట్ సరిగ్గా భారత్‌లోలాగే స్పందించింది. ఇప్పుడు మనోళ్లు దానిని పూర్తిగా వాడుకున్నారు. యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో కోహ్లి సేన అతి సునా యాసంగా రెండో వన్డేను తమ ఖాతాలో వేసుకుంది. లెగ్ స్పిన్నర్ చహల్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టగా... చైనామన్ కుల్దీప్ 3 వికెట్లతో అండగా నిలిచాడు. ఫలితంగా స్వదేశంలో అతి తక్కువ స్కోరుకు ఆలౌటైన చెత్త రికార్డుతో సఫారీలు మ్యాచ్‌ను సమర్పించుకున్నారు. సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఆదివారం ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్‌లో పూర్తి ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. డుమిని (25), జోండో (25)లదే అత్యధిక స్కోరు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ (5/22), కుల్దీప్ యాదవ్ (3/20) ప్రత్యర్థి పని పట్టారు. అనంతరం భారత్ 20.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ధావన్ (56 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు), కోహ్లి (50 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు అభేద్యంగా 93 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఈ ఫలితంతో భారత్ ఆరు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే బుధవారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది. టపటపా... ఒక దశలో 26 బంతుల వ్యవధిలో 12 పరుగులకే 4 వికెట్లు... కొంత పోరాటం తర్వాత చివర్లో 36 బంతుల వ్యవధిలో 19 పరుగులకే 6 వికెట్లు... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ రెండు దశల్లో ఈ రకంగా కుప్పకూలింది! ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయలేకపోగా, ఆరుగురు ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనే అందుకు కారణం. మొదట్లో భువీ, బుమ్రా... ఆ తర్వాత చహల్, కుల్దీప్ సఫారీల పని పట్టడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. డివిలియర్స్, డు ప్లెసిస్ లేని బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్‌లో మరీ పేలవంగా కనిపించింది. ఓపెనర్లు ఆమ్లా (23; 4 ఫోర్లు), డి కాక్ (20; 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను అతి జాగ్రత్తగా ప్రారంభించారు. టెస్టు సిరీస్ నుంచి వరుసగా విఫలమవుతున్న డి కాక్‌ను బుమ్రా ఒక ఆటాడుకున్నాడు. అతని తొలి ఓవర్లో మొదటి బంతినే డి కాక్ దాదాపు వికెట్లపైకి ఆడుకున్నాడు. అదృష్టవశాత్తూ బెయిల్స్ పడలేదు. రెండో బంతి బౌన్సర్‌ను అతి కష్టమ్మీద తప్పించుకున్న డి కాక్, మూడో బంతికి వేలికి గాయం చేసుకున్నాడు. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఆమ్లాను భువీ అవుట్ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత డి కాక్‌ను అవుట్ చేసి చహల్ తన జోరు మొదలు పెట్టాడు. కుల్దీప్ వేసిన మరుసటి ఓవర్లోనే కెప్టెన్ మార్క్రమ్ (8), మిల్లర్ (0) అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కష్టాలు పెరిగాయి. 51 పరుగుల స్కోరు వద్దే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. ఈ దశలో డుమిని, తొలి వన్డే ఆడుతున్న జోండో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. భారత బౌలింగ్‌ను కొద్ది సేపు నిరోధించగలిగిన వీరిద్దరు 12.4 ఓవర్లలో ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే మళ్లీ చహల్ మాయ మొదలైంది. భారీ షాట్ ఆడబోయిన జోండో మిడ్ వికెట్లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. చహల్ తన వరుస ఓవర్లలో డుమిని, మోర్కెల్ (1)ల పని పట్టగా...మధ్యలో రబడ (1)ను కుల్దీప్ వెనక్కి పంపించాడు. తాహిర్ (0)ను బుమ్రా బౌల్డ్ చేయగా...మోరిస్ (14)ను అవుట్ చేసి చహల్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలవోకగా... అతి సునాయాస లక్ష్యాన్ని భారత్ ఏమాత్రం తడబాటు లేకుండా చేరుకుంది. అయితే రోహిత్ శర్మ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు, ఒక సిక్స్) మాత్రం మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. మూడో బంతికి సిక్సర్ బాది దూకుడుగా ఆటను ప్రారంభించిన రోహిత్... రబడ బౌన్సర్‌ను హుక్ చేయబోయి మోర్కెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత ధావన్, కోహ్లి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ చకచకా పరుగులు రాబట్టారు. ఇదే జోరులో ధావన్ 49 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత తొమ్మిదో బంతిని స్క్వేర్‌లెగ్ దిశగా ఆడి కోహ్లి రెండు పరుగులు తీయడంతో భారత్ విజయం ఖాయమైంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) ధోని (బి) భువనేశ్వర్ 23; డి కాక్ (సి) పాండ్యా (బి) చహల్ 20; మార్క్రమ్ (సి) భువనేశ్వర్ (బి) కుల్దీప్ 8; డుమిని (ఎల్బీ) (బి) చహల్ 25; మిల్లర్ (సి) రహానే (బి) కుల్దీప్ 0; జోండో (సి) పాండ్యా (బి) చహల్ 25; మోరిస్ (సి) భువనేశ్వర్ (బి) చహల్ 14; రబడ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; మోర్కెల్ (ఎల్బీ) (బి) చహల్ 1; తాహిర్ (బి) బుమ్రా 0; షమ్సీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (32.2 ఓవర్లలో ఆలౌట్) 118 వికెట్ల పతనం: 1–39; 2–51; 3–51; 4–51; 5–99; 6–107; 7–110; 8–117; 9–118; 10–118. బౌలింగ్: భువనేశ్వర్ 5–1–19–1; బుమ్రా 5–1–12–1; పాండ్యా 5–0–34–0; చహల్ 8.2–1–22–5; కుల్దీప్ 6–0–20–3; జాదవ్ 3–0–11–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మోర్కెల్ (బి) రబడ 15; ధావన్ (నాటౌట్) 51; కోహ్లి (నాటౌట్) 46; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119 వికెట్ల పతనం: 1–26. బౌలింగ్: మోర్కెల్ 4–0–30–0; రబడ 5–0–24–1; మోరిస్ 3–0–16–0; తాహిర్ 5.3–0–30–0; షమ్సీ 3–1–18–0. -
‘ఆస్థానంలో బ్యాటింగ్ చేసి ఎంతో పరిణితి చెందా’
సెంచూరియన్ : నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో ఎంతో పరిణితి చెందానని టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో రహానే(79) అద్బుత ఇన్నింగ్స్‌తో భారత్ ఆరు వన్డేల సిరీస్‌ను గెలుపుతో ఆరంభించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా భారత్ మిడిలార్డర్ బలహీనంగా ఉండటంతో నాలుగో స్థానంలో ఎవరిని దింపాలని టీమిండియా కసరత్తులు మెదలు పెట్టింది. దీనికోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్‌లను పరీక్షించి మిశ్రమ ఫలితాలను పొందింది. దీంతో నాలుగో స్థానంలో ఎవరిని పంపాలనే విషయం జట్టు మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రాణించి విజయంలో తనవంతు పాత్ర పోషించిన రహానేను అనూహ్యంగా తొలి వన్డేలో నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు పంపి మంచి ఫలితాన్ని పొందింది. ఈ తరుణంలో నేడు(ఆదివారం) రెండో వన్డే సందర్భంగా రహానే మీడియాతో మాట్లాడారు. నాలుగోస్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్దమయ్యానని, ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడం విభిన్నమైనప్పటికి నా ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో బాగా తెలుసని రహానే అభిప్రాయపడ్డాడు. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడం వల్ల ఎంతో పరణతి చెందానని చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో రాణించడంపై స్పందిస్తూ.. చివరి టెస్ట్ విజయం ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని, అదే ఊపుతో విజయం సాధించామన్నాడు. బౌలర్లు అద్భుతంగా రాణించారని, తన బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించానని ఈ ముంబైకర్ చెప్పుకొచ్చాడు. ఏ జట్టుపైనైనా ఆడటానికి ఆస్వాదిస్తానని, కానీ దక్షిణాఫ్రికాపై అయితే మరింత ఇష్టపడతానన్నాడు. వారిని తక్కువ అంచనా వేయడం లేదని, పేస్ బౌలింగ్‌ను సవాల్‌గా స్వీకరిస్తున్నట్లు రహానే తెలిపాడు. జట్టు మెనేజ్మెంట్ ఆదేశాల మేరకు ఏ స్థానంలో ఆడటానికైనా సిద్దమేనని, గెలుపులో ముఖ్య పాత్ర పోషించడమే తన కర్తవ్యమని రహానే వ్యాఖ్యానించాడు. -
అదే కథ... అదే వ్యథ
ఏదో అద్భుతం జరిగిపోతుందని ఎవరూ ఊహించలేదు. కానీ కొంత ప్రయత్నం, పోరాటానికి మాత్రం ఆస్కారం ఉందని అనిపించింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం, బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవారు ఇంకా ఉండటంతో ఏదో మూల ఆశ! కానీ భారత్ అలాంటి ఆలోచనలకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మన ఆట ముగిసేందుకు మరో 27.2 ఓవర్లు మాత్రమే సరిపోయాయి. మొదటి టెస్టు ఆడుతున్న ఇన్‌గిడి, రబడ ధాటికి బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో విదేశీ గడ్డపై మరో పరాజయం టీమిండియా ఖాతాలో చేరగా... సిరీస్ సఫారీ చేతికి చిక్కింది. బ్యాటింగ్‌లో పట్టుదల, నిర్దాక్షిణ్యమైన బౌలింగ్, అంతకంటే అద్భుతమైన ఫీల్డింగ్ వెరసి దక్షిణాఫ్రికాకు సెంచూరియన్‌లో విజయాన్ని అందించాయి. మరోవైపు బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా విఫలమైన కోహ్లి సేన ఏమాత్రం పోటీనివ్వకుండా తలవంచింది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఒక్కడే 153 పరుగులు చేస్తే... రెండో ఇన్నింగ్స్‌లో జట్టు మొత్తం కలిసి చేసింది 151 మాత్రమే. సిరీస్ గెలవాలన్న కల ఎలాగూ పోయింది. ఇక మిగిలింది వాండరర్స్ మైదానంలో పరువు నిలబెట్టుకోవడమే. సెంచూరియన్: దక్షిణాఫ్రికా జట్టు రెండేళ్ల క్రితం భారత గడ్డపై ఎదురైన పరాజయానికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. వరుసగా రెండు టెస్టుల్లో టీమిండియాను చిత్తు చేసి సిరీస్ సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 135 పరుగుల భారీ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (74 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిగా పోరాడటం మినహా మిగతావాళ్లంతా విఫలమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లుంగీ ఇన్‌గిడి 6 వికెట్లు పడగొట్టగా, రబడకు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో గెలుచుకుంది. చివరిదైన మూడో టెస్టు ఈ నెల 24 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది. వరుస కట్టి... ఓవర్‌నైట్ స్కోరు 35/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 116 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామానికి ముందే భారత్ పోరాటం ముగిసింది. ఐదో రోజు లుంగీ ఇన్‌గిడి నాలుగు వికెట్లతో భారత్ పని పట్టాడు. మరో రెండు వికెట్లు రబడ ఖాతాలో చేరగా, పుజారా (19) స్వయంకృతాపరాధంతో మ్యాచ్‌లో రెండోసారి రనౌటయ్యాడు. బుధవారం నాలుగో ఓవర్ తొలి బంతిని పార్థివ్ గల్లీ వైపు ఆడాడు. దానిని ఆపేందుకు ఇన్‌గిడి, డివిలియర్స్ ఇద్దరూ పరుగెత్తారు. అప్పటికే రెండు పరుగులు పూర్తి చేసిన పుజారా ఏబీని తక్కువగా అంచనా వేస్తూ మూడో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే డివిలియర్స్ విసిరిన త్రో కచ్చితత్వంతో కీపర్ వద్దకు రావడం, డి కాక్ వికెట్లు పడగొట్టడం వెంటనే జరిగిపోయాయి. కొద్ది సేపటికే తప్పుడు పుల్ షాట్ ఆడిన పార్థివ్ (19) ఫైన్ లెగ్‌లో మోర్కెల్ చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆదుకుంటారనుకున్న పాండ్యా (6), అశ్విన్ (3)లను ఇన్‌గిడి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపించడంతో భారత్ అప్పటికే ఆశలు కోల్పోయింది. ఈ దశలో రోహిత్, షమీ (24 బంతుల్లో 28; 5 ఫోర్లు) ధాటిగా ఆడి ఎనిమిదో వికెట్‌కు 61 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. అయితే ఇది ఎంతో సేపు సాగలేదు. రబడ బౌలింగ్‌లో రోహిత్ హుక్ చేయగా, ఫైన్ లెగ్‌లో డివిలియర్స్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఆ వెంటనే షమీ పని పట్టి ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఇన్‌గిడి... తన తర్వాతి ఓవర్లో బుమ్రా (2)ను అవుట్ చేసి భారత్ ఆట ముగించాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 335; భారత్ తొలి ఇన్నింగ్స్ 307; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 258; భారత్ రెండో ఇన్నింగ్స్: మురళీ విజయ్ (బి) రబడ 9; లోకేశ్ రాహుల్ (సి) మహరాజ్ (బి) ఇన్‌గిడి 4; చతేశ్వర్ పుజారా (రనౌట్) 19; విరాట్ కోహ్లి (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 5; పార్థివ్ పటేల్ (సి) మోర్కెల్ (బి) రబడ 19; రోహిత్ శర్మ (సి) డివిలియర్స్ (బి) రబడ 47; హార్దిక్ పాండ్యా (సి) డి కాక్ (బి) ఇన్‌గిడి 6; అశ్విన్ (సి) డి కాక్ (బి) ఇన్‌గిడి 3; షమీ (సి) మోర్కెల్ (బి) ఇన్‌గిడి 28; ఇషాంత్ శర్మ (నాటౌట్) 4; జస్ప్రీత్ బుమ్రా (సి) ఫిలాండర్ (బి) ఇన్‌గిడి 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50.2 ఓవర్లలో ఆలౌట్) 151. వికెట్ల పతనం: 1–11; 2–16; 3–26; 4–49; 5–65; 6–83; 7–87; 8–141; 9–145; 10–151. బౌలింగ్: ఫిలాండర్ 10–3–25–0; రబడ 14–3–47–3; ఇన్‌గిడి 12.2–3–39–6; మోర్కెల్ 8–3–10–0; మహరాజ్ 6–1–26–0. 1 కోహ్లి కెప్టెన్సీలో భారత్ తొలిసారి సిరీస్ కోల్పోయింది. 2015లో శ్రీలంకతో సిరీస్ నుంచి మొదలు పెడితే వరుసగా 9 సిరీస్‌లు నెగ్గిన తర్వాత భారత్‌కు ఎదురైన పరాజయం ఇది. అయితే 2010 నుంచి ఉపఖండం బయట (వెస్టిండీస్‌ను మినహాయిస్తే) ఎనిమిది సిరీస్‌లు ఆడిన టీమిండియా ఒక్కటి కూడా గెలవలేకపోయింది. 7 ఓడగా... 1 డ్రా చేసుకుంది. 1 రెండు ఇన్నింగ్స్‌లలోనూ రనౌట్ అయిన మొదటి భారత బ్యాట్స్‌మన్ పుజారా. 7 తొలి టెస్టులోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఏడో దక్షిణాఫ్రికా ఆటగాడు ఇన్‌గిడి. స్లో ఓవర్‌రేట్ కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్‌పై మ్యాచ్ ఫీజులో 40 శాతం... జట్టులోని మిగతా సభ్యులకు ఐసీసీ 20 శాతం జరిమానా విధించింది. -
అరంగేట్రం అదుర్స్.. భారత్ పతనాన్ని శాసించాడు!
సెంచూరియన్ : దక్షిణాఫ్రికా గడ్డ మీద ఆతిథ్య జట్టుపై టీమిండియాకు టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించడంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. నేడు జరిగిన రెండో టెస్టులో టీమిండియాను ఓడించిన ప్రొటీస్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే సెంచూరియన్ టెస్టులోనే అరంగేట్రం చేసిన సౌతాఫ్రికా యువ సంచలనం, పేసర్ లుంగిసాని ఎంగిడి టీమిండియా పతనాన్ని శాసించాడు. ఆడుతున్నది తొలి టెస్టు.. అందులోనూ టెస్టుల్లో నెంబర్ వన్ టీమ్ భారత్‌తో ఆట అంటే అంత తేలిక కాదు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే వికెట్ తీసినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అందుకు ఈ యువ పేసర్ గణాంకాలే (6/39) నిదర్శనంగా నిలిచాయి. తద్వారా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు ఎంగిడి. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఎంగిడి తొలిటెస్టులోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే భారత్ జట్టుపై ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. 21 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించడం గమనార్హం. 1996లో భారత్‌తో జరిగిన కోల్‌కతా టెస్టులో సఫారీ అరంగేట్ర బౌలర్ లాన్స్ క్లూసెనర్ తొలి వికెట్ల ఇన్నింగ్స్ (8/64)తో రాణించాడు. కీలకమైన ప్రత్యర్థి జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనే ఈ అరంగేట్ర బౌలర్లు రాణించి తమ జట్టుకు విజయాన్ని అందించారు. పార్థీవ్ పటేల్ వికెట్‌తో ఎంగిడి తన తొలి టెస్టు వికెట్ సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యాతో పాటు అశ్విన్, షమీ, బూమ్రా వికెట్లు తీసి భారత్ ఓటమిని శాసించాడు. ఈ 24న ప్రారంభంకానున్న నామమాత్రమైన మూడో టెస్టులోనూ యువ సంచలనం ఎంగిడి తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. -
సిరీస్ ఓటమిపై స్పందించిన కెప్టెన్ కోహ్లీ
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో వచ్చిన ఫలితమే సెంచూరియన్ టెస్టులోనూ పునరావృతమైంది. 287 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 151 పరుగులకే ఆలౌట్ కావడంతో మరో టెస్ట్‌మిగిలుండగానే టీమిండియా 0-2 తేడాతో సఫారీలకు సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. సిరీస్ ఓటమి అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. టాస్కు ముందు చూసిన పిచ్, ప్రస్తుతం ఉన్న వికెట్‌కు చాలా వ్యత్యాసముందని జట్టు ఆటగాళ్లకు హెచ్చరించాను. వికెట్ చాలా ఫ్లాట్‌గా ఉంది. పరుగులు తీయడం తేలిక అని భావించాను. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా తొలుత త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో పరిస్థితి అర్థమైంది. కానీ మా బ్యాటింగ్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించలేకపోయాం అన్నాడు కోహ్లీ. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో చేసిన సెంచరీపై కోహ్లీ మాట్లాడుతూ.. ‘సెంచరీ చేసినా ఏం లాభం జట్టు ఓడిపోయింది కదా. జట్టు గెలుపు కోసం చేసిన 30 లేక 50 పరుగులైనా నాకు ఆనందాన్నిస్తాయి. జట్టు గెలవని సందర్భంలో నా వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోను. మైదానంలో కాలుపెట్టానంటే దేశం కోసం పూర్తిస్థాయిలో రాణించేందుకు శ్రమిస్తాను. బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ బ్యాట్స్‌మెన్ వైఫల్యాలతో సిరీస్ చేజార్చుకున్నాం. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించడం వల్లే విజయం వారి సొంతమైంది. సఫారీలు టీమిండియా కంటే మెరుగ్గా ఆడారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో వారి నైపుణ్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని’ పేర్కొన్నాడు. నామమాత్రమైన మూడో టెస్ట్ మ్యాచ్ జొహన్నెస్‌బర్గ్ వేదికగా జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. -
టీమిండియా పరాజయం..
-
టీమిండియా పరాజయం.. సిరీస్ గోవిందా!
సెంచూరియన్ : విదేశీగడ్డపై టీమిండియాకు మరోసారి పరాభవం తప్పలేదు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ 135 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 287 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకునేక్రమంలో 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తేడాతో సఫారీలు సిరీస్ కైవసం చేసుకున్నారు. తద్వారా వరుసగా 10వ సిరీస్ గెలిచి రికార్డు నెలకొల్పాలనుకున్న కోహ్లీ సేన కల.. కలగానే మిగిలిపోయింది. నిప్పులు కక్కిన ఇన్‌గిడి : 35/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదోరోజు ఆట ప్రారంభించిన భారత్.. తొలి సెషన్లోనే చాపచుట్టేసింది. సౌతాఫ్రికన్ యంగ్ బౌలర్ ఇన్‌గిడి నిప్పులుకక్కేబంతులు విసిరి 6 వికెట్లు నేలకూల్చాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఐదోరోజు బరిలోకిదిగిన పుజారా.. మరో 8 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. పార్థివ్ 19, హార్ధిక్ 6, అశ్విన్ 3 పరుగులుచేశారు. మరో ఎండ్‌లో వికెట్లు నేలరాలుతున్నా.. రోహిత్ శర్మ ఒక్కడే కాస్తోకూస్తో ఫర్వాలేదనిపించాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసిన రోహిత్.. 8వ వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. టెయిలెండర్ షమి 28 పరుగులుచేసి ఆకట్టుకున్నాడు. ఇన్‌గిడి 6 వికెట్లకుతోడు రబాడా 3 వికెట్లు నేలకూల్చాడు. ఇరుజట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జొహన్నెస్‌బర్గ్ వేదికగా జనవరి 24 నుంచి జరుగనుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 335; భారత్ తొలి ఇన్నింగ్స్ 307; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 258 భారత్ రెండో ఇన్నింగ్స్ : విజయ్ (బి) రబడ 9; రాహుల్ (సి) మహరాజ్ (బి) ఇన్‌గిడి 4; పుజారా 19 రనౌట్ ; కోహ్లి (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 5; పార్థివ్ (సి)మోర్కెల్ (బి) రబడ 19 ; రోహిత్ శర్మ (సి)డివిల్లీర్స్ (బి)రబడా 47 ; హార్దిక్ పాండ్యా (సి) డికాక్ (బి) ఇన్‌గిడి 6 ; రవిచంద్రన్ అశ్విన్ (సి) డికాక్ (బి) ఇన్‌గిడి 3 ; మహమ్మద్ షమి (సి)మోర్కెల్ (బి) ఇన్‌గిడి 28 ; ఇషాంత్ శర్మ (నాటౌట్) 4 ; బుమ్రా (సి) ఫిలాండర్ (బి) ఇన్‌గిడి 2. ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50.2 ఓవర్లలో ఆలౌట్) 151. -
స్టెయిన్ ధమాకా
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సెంచూరియన్: తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా తీయని పేసర్ డేల్ స్టెయిన్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు. కేవలం 34 పరుగులకే ఆరు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాకు భారీ విజయాన్ని అందించాడు. శనివారం సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 42.3 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. దీంతో సఫారీలకు ఇన్నింగ్స్ 220 పరుగుల విజయం దక్కింది. ఈ జట్టుకిది టెస్టుల్లో రెండో భారీ విజయం. 76/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన విండీస్‌కు తొలి సెషన్ నుంచే స్టెయిన్ దెబ్బ తగిలింది. కేవలం 44 పరుగులు మాత్రమే జత చేసి చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. ఇందులో ఆరింటిని స్టెయిన్ (8.2 ఓవర్లలో) ఒక్కడే తీయడం విశేషం. కీమర్ రోచ్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఆమ్లా నిలిచాడు. రెండో టెస్టు 26 నుంచి పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతుంది. -
డివిలియర్స్, ఆమ్లా సెంచరీలు
దక్షిణాఫ్రికా 340/3 సెంచూరియన్: వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి రోజు భారీ స్కోరు నమోదు చేసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 91 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (211 బంతుల్లో 141 బ్యాటింగ్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), హషీమ్ ఆమ్లా (242 బంతుల్లో 133 బ్యాటింగ్; 17 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడం విశేషం. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 283 పరుగులు జోడించారు. టెస్టుల్లో డివిలియర్స్‌కు ఇది 20వ సెంచరీ కాగా, ఆమ్లాకు 23వది. విండీస్ బౌలర్లు ఆరంభంలో రాణించడంతో దక్షిణాఫ్రికా 57 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. పీటర్సన్ (27), ఎల్గర్ (28), డు ప్లెసిస్ (0) ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత డివిలియర్స్, ఆమ్లా కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. రోచ్ 2 వికెట్లు పడగొట్టగా, కాట్రెల్‌కు ఒక వికెట్ దక్కింది. -
తొలి టెస్ట్ ఆసీస్‌దే
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 281 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 288/3తో నాలుగో రోజు ఆటను మొదలు పెట్టిన ఆస్ట్రేలియా.. మార్ష్(44) వికెట్‌ను చేజార్చుకున్న వెంటనే 290 పరుగుల దగ్గర రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 191 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ఆస్ట్రేలియా 482 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. డివిలియర్స్(48), ఆమ్లా (35), ఫిలాండర్ (26 నాటౌట్) ప్రతిఘటించినా.. మిచెల్ జాన్సన్ (5/59), హ్యారిస్ (2/35), సిడిల్ (2/55) దెబ్బకు దక్షిణాఫ్రికా 200 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో సఫారీ జట్టు టెస్ట్ సిరీస్‌లో 0-1తో వెనకబడిపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఈ నెల 20 నుంచి 24 వరకు పోర్ట్ ఎలిజబెత్‌లో జరగనుంది. మిచెల్ జాన్సన్ కెరీర్ బెస్ట్... తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను హడలెత్తించిన మిచెల్ జాన్సన్(7/68).. రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగిపోయాడు. తొలుత ఓపెనర్లు పీటర్సన్ (1), స్మిత్ (4)లను వెనక్కి పంపిన జాన్సన్.. ఆ తర్వాత డివిలియర్స్, డుమిని(10), మెక్లారెన్ (6)లను అవుట్ చేశాడు. మొత్తానికి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట్ రికార్డు చేశాడు. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ జాన్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
భారీ ఆధిక్యంలో ఆసీస్
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (151 బంతుల్లో 115; 13 ఫోర్లు; 2 సిక్స్) సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ ప్రస్తుతం 479 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న అలెక్స్ డూలాన్ (154 బంతుల్లో 89; 12 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో షాన్ మార్ష్ (73 బంతుల్లో 44 బ్యాటింగ్; 5 ఫోర్లు; 1 సిక్స్), క్లార్క్ (32 బంతుల్లో 17; 3 ఫోర్లు) ఉన్నారు. అంతకుముందు 140/6 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీ జట్టు 61.1 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌట్ అయ్యింది. డివిలియర్స్ (148 బంతుల్లో 91; 10 ఫోర్లు; 2 సిక్స్) సెంచరీ మిస్ అయ్యాడు. జాన్సన్‌కు ఏడు వికెట్లు దక్కాయి. -
కోహ్లికి కోపమొచ్చింది!
సెంచూరియన్: తరచూ వివాదాలతో సహవాసం చేసే విరాట్ మరోసారి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. వివరాల్లోకెళితే...అద్భుతమైన ఫామ్‌తో, రికార్డులతో దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన కోహ్లి తొలి రెండు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. కీపర్, స్లిప్స్‌లో క్యాచ్‌లు ఇచ్చి సునాయాస పద్ధతిలో నిష్ర్కమించాడు. వాండరర్స్‌లో జరిగిన తొలి వన్డేలో భీకరమైన స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో ఒక బంతి వేగంగా దూసుకొచ్చింది. పుల్ షాట్ ఆడే క్రమంలో అది పక్కటెముకలకు బలంగా తాకడంతో విరాట్ విలవిల్లాడిపోయాడు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. బుధవారం మూడో వన్డే సందర్భంగా మ్యాచ్ ప్రసారకర్త ‘సూపర్ స్పోర్ట్స్’ ఈ విజువల్స్‌ను పదేపదే ప్రసారం చేసింది. ‘కోహ్లి మెత్తబడ్డాడా...’అంటూ వ్యాఖ్యను కూడా జోడించింది. అంతటితో ఆగిపోకుండా సదరు మ్యాచ్‌లో అవుటైన తర్వాత కోహ్లి డ్రెస్సింగ్ రూమ్‌లో ఐస్ ప్యాక్‌తో చికిత్స చేయించుకోవడం, పుల్ షాట్‌ను ప్రాక్టీస్ చేయడం స్లో మోషన్లో మళ్లీ మళ్లీ చూపించింది. ఇది కోహ్లికి తీవ్ర ఆగ్రహం తెప్పించడంతో జట్టు సభ్యులతో చర్చించాడు. దాంతో కోచ్ డంకన్ ఫ్లెచర్ నేతృత్వంలో టీమ్ మేనేజ్మెంట్... ప్రసారకర్త సూపర్ స్పోర్ట్స్ డెరైక్టర్‌ను నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కే పిలిపించి వివరణ కోరింది. దానిని అనుచిత చర్యగా పేర్కొంటూ ఇకపై ‘క్రికెట్‌కే కట్టుబడాలని’ సలహా ఇచ్చింది. అందులో తప్పేమీ లేదంటూ చెప్పబోయిన అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు కాదు! సూపర్ స్పోర్ట్ డెరైక్టర్‌ను భారత టీమ్ మేనేజ్మెంట్ హెచ్చరించినట్లు వచ్చిన వార్తలను జట్టు ఖండించింది. ‘సూపర్ స్పోర్ట్ ప్రతినిధిని కలిసిన మాట వాస్తవమే. అయితే అది కోహ్లి క్లిప్ గురించి కాదు. మరో విషయం చర్చించడానికే. అది ఏమిటనేది మాత్రం చెప్పలేను’ అని జట్టు మీడియా మేనేజర్ ఆర్ఎన్ బాబా వివరణ ఇచ్చారు. -
‘వర్షం’తో ముగింపు
-
‘వర్షం’తో ముగింపు
తొలి రెండు వన్డేల్లో ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి బెదిరిన భారత బ్యాట్స్‌మెన్‌కు ఈసారి ఆ అవసరం రాలేదు. టెస్టు సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేద్దామనుకున్న టీమిండియాకు ఆ అదృష్టమూ దక్కలేదు. భారీ వర్షం కారణంగా మూడో వన్డే... ధోనిసేన బ్యాటింగ్‌కు దిగకుండానే రద్దయింది. ప్రత్యర్థి ఇన్నింగ్స్ ఆసాంతం దరికిరాని వాన, మనకు మాత్రం అడ్డుగా నిలిచింది. సెంచరీల హోరుతో పరుగుల వర్షం కురిపించిన దక్షిణాఫ్రికా మరోసారి మన బౌలర్ల బలహీనతను బయట పెట్టింది. సెంచూరియన్: సిరీస్‌లో ఒక్క వన్డే అయినా నెగ్గి పరువు నిలబెట్టుకుందామనుకున్న భారత్ ఆశలు తీరలేదు. ఇక్కడి సూపర్ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో బుధవారం జరిగిన మూడో వన్డే భారీ వర్షం కారణంగా రద్దయింది. దక్షిణాఫ్రికా పూర్తి ఇన్నింగ్స్‌ను 50 ఓవర్ల పాటు ఆడగా...భారత్‌కు మాత్రం బ్యాటింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ విరామంలో ప్రారంభమైన వాన నిరంతరాయంగా దాదాపు రెండున్నర గంటల పాటు కురిసింది. దాంతో మరో దారి లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా తొలి రెండు వన్డేలు నెగ్గిన దక్షిణాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది. మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. క్వాంటన్ డి కాక్ (120 బంతుల్లో 101; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా మూడో సెంచరీ సాధించగా, కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (101 బంతుల్లో 109; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకంతో చెలరేగాడు. చివర్లో మిల్లర్ (34 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. చాలా కాలం తర్వాత చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ఇషాంత్ శర్మ (4/40) ఆకట్టుకున్నాడు. షమీకు 3 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 18 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది. ఇషాంత్‌కు 4 వికెట్లు... టాస్ గెలిచిన డివిలియర్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ జట్టులో మూడు మార్పులు చేయగా, భారత జట్టులో రహానే స్థానంలో మళ్లీ యువరాజ్ వచ్చాడు. గత రెండు వన్డేల తరహాలో ఈ సారి దక్షిణాఫ్రికా ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లు మొదటినుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆమ్లా (13), డి కాక్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. షమీ తన మొదటి ఓవర్లోనే ఆమ్లాను అవుట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. మరో వైపు చాలా కాలం తర్వాత ఇషాంత్ శర్మ కూడా చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. డేవిడ్స్ (1), డుమిని (0) స్లిప్స్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. కీలక భాగస్వామ్యం... 28/3 స్కోరుతో దక్షిణాఫ్రికా ఇబ్బందికర స్థితిలో నిలిచింది. అయితే ఈ సమయంలో డి కాక్, డివిలియర్స్ కలిసి సమన్వయంతో ఆడారు. చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. భారత ఫీల్డర్ల వైఫల్యం కూడా డి కాక్కు కలిసొచ్చింది. ఉమేశ్ బౌలింగ్‌లో 13 పరుగుల వద్ద షార్ట్ ఫైన్ లెగ్‌లో రహానే, అశ్విన్ బౌలింగ్‌లో 17 పరుగుల వద్ద మిడాన్‌లో యువరాజ్ అతను ఇచ్చిన క్యాచ్‌లు వదిలేశారు. కోహ్లి బౌలింగ్‌లో 2 సిక్స్‌లతో దూసుకుపోయిన కాక్...ఈ క్రమంలో 116 బంతుల్లో వరుసగా మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి డివిలియర్స్ జోరు పెంచాడు. ఎట్టకేలకు డి కాక్‌ను ఇషాంత్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. అయితే డివిలియర్స్ తగ్గలేదు. అశ్విన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన అతను 96 బంతుల్లోనే కెరీర్లో 16వ సెంచరీని అందుకున్నాడు. డివిలియర్స్‌తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు త్వరగానే వెనుదిరిగినా...మిల్లర్ తన ధాటిని కొనసాగించడంతో దక్షిణాఫ్రికా స్కోరు 300 పరుగులు దాటింది. ఈ ఏడాది భారత్ పదో సారి 300కు పైగా పరుగులు ఇచ్చి రికార్డు నెలకొల్పడం విశేషం. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) యువరాజ్ (బి) షమీ 13; డి కాక్ (బి) ఇషాంత్ 101; డేవిడ్స్ (సి) రైనా (బి) ఇషాంత్ 1; డుమిని (సి) రైనా (బి) ఇషాంత్ 0; డివిలియర్స్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 109; మిల్లర్ (నాటౌట్) 56; మెక్లారెన్ (సి) ఉమేశ్ (బి) ఇషాంత్ 6; పార్నెల్ (సి) రోహిత్ (బి) షమీ 9; ఫిలాండర్ (బి) షమీ 0; సోట్సోబ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 2, వైడ్ 3) 5; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 301. వికెట్ల పతనం: 1-22; 2-28; 3-28; 4-199; 5-252; 6-269; 7-291; 8-298. బౌలింగ్: ఇషాంత్ 10-1-40-4; ఉమేశ్ 9-0-57-1; షమీ 10-0-69-3; అశ్విన్ 9-0-63-0; జడేజా 6-0-32-0; రైనా 3-0-16-0; కోహ్లి 3-0-22-0. 16 ఇషాంత్ వన్డేల్లో వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 16వ బౌలర్ ఇషాంత్. -
బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, స్కోరు: 53/3
సెంచూరియన్: భారత్ దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు అమ్లా 16బంతుల్లో 3 ఫోర్లు తో 13 పరుగులకే చతికిలపడ్డాడు. కెప్టెన్ కాక్ 39 బంతుల్లో 4 ఫోర్లుతో 26 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నాడు. మిగతా ఆటగాళ్లు డెవిడ్స్ 1, డుమినీ ఏమి పరుగులు చేయకుండానే పెవిలీయన్ బాట పట్టాడు. ఆ తరువాత వచ్చిన విల్లీయర్స్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేయగలిగింది. భారత్ బౌలర్లు శర్మ 2 వికెట్లు తీసుకోగా, మహ్మద్ షమీ ఒక వికెట్ తీసుకున్నాడు. -
పరువు కోసం...
సా. గం. 5.00 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జోరుమీదున్న భారత కుర్రాళ్లు ఊహించినట్లుగానే బౌన్సీ వికెట్లపై బోల్తా కొట్టారు. పచ్చిక పిచ్‌లపై దూసుకొచ్చే బుల్లెట్ బంతులను ఎదుర్కోలేక ఘోరంగా విఫలమయ్యారు. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయారు. కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలిస్తే ప్రపంచ నంబర్‌వన్ జట్టుకు పరువు దక్కుతుంది. టెస్టు సిరీస్‌కు ముందు కాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సెంచూరియన్: వరుసగా రెండు వన్డేల్లో పరాజయం పాలైన భారత్ జట్టు... కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఆత్మ విశ్వాసం కూడగట్టుకుంటుందా? ఇకనైనా బౌన్సీ వికెట్లపై సఫారీ బౌలర్ల జోరును అడ్డుకుంటుందా? వన్డే సిరీస్‌ను కోల్పోయినా... టెస్టుల్లోనైనా కనీస పోటీని ఇస్తుందా? ప్రస్తుతం భారత అభిమానుల్లో నెలకొన్న ప్రశ్నలు ఇవి. ఈ నేపథ్యంలో నేడు సెంచూరియన్‌లో జరగబోయే ఆఖరి వన్డేలో (డే నైట్) భారత్... దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పోయిన పరువును కాస్త అయినా నిలుపుకోవాలని టీమిండియా భావిస్తుండగా... సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని సఫారీ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. పచ్చిక, బౌన్సీ వికెట్లపై దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కోలేక చతికిలపడ్డ భారత యువ బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని మర్చిపోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా ధోనిసేన గెలిచి తీరాలి. కుర్రాళ్లు నిలుస్తారా? తొలి వన్డేలో బౌలర్లు విఫలం కావడంతో భారత్ భారీ లక్ష్యాన్ని (359) ఛేదించాల్సి వచ్చింది. కానీ కీలక సమయంలో బ్యాట్స్‌మెన్ సైతం విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. అయితే రెండో వన్డేల్లో బౌలర్లు ఓ మేరకు రాణించినా.. బ్యాట్స్‌మెన్ మాత్రం ఒత్తిడిని జయించలేక పాత కథనే పునరావృతం చేశారు. 281 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో మూడో వన్డేలో వీళ్లు ఏ మేరకు కుదురుకుంటారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రెండు మ్యాచ్‌ల్లోనూ స్టెయిన్ ఓపెనింగ్ స్పెల్‌తో భారత్‌ను ఘోరంగా దెబ్బతీశాడు. ఫలితంగా ధావన్, రోహిత్ శుభారంభానివ్వలేకపోయారు. అటు ఫస్ట్‌డౌన్‌లో కోహ్లి కూడా విఫలం కావడం టీమ్ మేనేజ్మెంట్ను ఆందోళనలో పడేసింది. రైనా, యువరాజ్, ఆల్‌రౌండర్‌గా జడేజా ఏమాత్రం ప్రభావం చూపకపోతున్నారు. చివర్లో ధాటిగా ఆడే ధోనికి అండగా నిలిచేవారు లేకపోవడం కూడా భారత్‌కు ప్రతికూలాంశంగా మారింది. రహానేకు అవకాశం వచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో రాయుడుకు డిమాండ్ పెరుగుతోంది. ఇక బౌలింగ్ విభాగానికొస్తే పేసర్లలో షమీ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నా ఆకట్టుకుంటున్నాడు. వాండర్సర్, కింగ్స్మీడ్లో తన మార్కును చూపెడుతూ ఆరు వికెట్లు తీశాడు. కాబట్టి మూడో వన్డేలో కూడా అతనిపైనే కెప్టెన్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఇషాంత్, ఉమేశ్ వికెట్లు తీయకపోయినా కనీసం పరుగులనూ కట్టడి చేయలేకపోతున్నారు. ప్రధాన స్పిన్నర్‌గా అశ్విన్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో జట్టులో మార్పులు ఉంటాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా... ధోని మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కలిస్, స్టెయిన్‌లకు విశ్రాంతి? మరోవైపు దక్షిణాఫ్రికా అన్ని రంగాల్లో సమష్టిగా రాణిస్తోంది. ఓపెనర్లు డికాక్, ఆమ్లా పరుగుల వరద పారిస్తున్నారు. ఈ జోడిని విడదీసేందుకు ధోని చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతుండటంతో భారత బౌలర్ల ఆత్మ విశ్వాసం దెబ్బతింటోంది. మిడిలార్డర్లో డివిలియర్స్, డుమిని వేగంగా ఆడుతుండగా, కలిస్, మిల్లర్లు రాణిస్తుండటంతో ప్రొటీస్ భారీ స్కోరు చేస్తోంది. బౌలింగ్‌లో స్టెయిన్ మెరుపు బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పుతున్నాడు. సొట్‌సోబ్, ఫిలాండర్, మోర్కెల్, మెక్లారెన్ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. జట్టులో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉండటంతో డివియర్స్ భిన్నమైన ప్రణాళికలతో భారత్‌ను కట్టడి చేస్తున్నాడు. టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని మూడో వన్డేలో కలిస్, స్టెయిన్‌కు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఒకవేళ స్టెయిన్ ఆడకపోతే భారత బ్యాట్స్‌మెన్‌కు కాస్త ఊరట దొరకొచ్చు. జట్లు (అంచనా): భారత్: ధోని, ధావన్, రోహిత్, కోహ్లి, యువరాజ్ / రహానే, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్/మోహిత్, షమీ. దక్షిణాఫ్రికా: డివియర్స్, ఆమ్లా, డికాక్, హెన్రీ డేవిడ్, డుమిని, మిల్లర్, మెక్లారెన్, పార్నెల్, తాహిర్, స్టెయిన్ / మోర్కెల్, ఫిలాండర్/ సొట్‌సోబ్. ‘దక్షిణాఫ్రికాలో పరిస్థితులు మా ఓటమికి కారణం కాదు. భారీ భాగస్వామ్యాలు నమోదు చేయలేక రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం. రెండో వన్డే వేదిక డర్బన్‌లో పరిస్థితులు దాదాపుగా భారత్ తరహాలోనే ఉన్నా అర్థం చేసుకోలేకపోయాం. ఆఖరి వన్డేలో గెలుస్తామనే నమ్మకం ఉంది. టెస్టుల గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు.’ - రోహిత్ (భారత్) ‘మూడో వన్డేలో కూడా మా జోరును కొనసాగిస్తాం. కీలకమైన టెస్టులకు ముందు వన్డే సిరీస్ గెలవడంతో మానసికంగా పైచేయి సాధించాం. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు భారత్ తొందరగా అలవాటు పడలేకపోయింది. - మెక్లారెన్ (దక్షిణాఫ్రికా) మంగళవారం మొత్తం వర్షం కురిసింది. బుధవారం కూడా జల్లులు పడే అవకాశాలున్నాయి. కాబట్టి మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశాలున్నాయి.