టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై రాహుల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్.. సఫారీ పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఓ వైపు దక్షిణాఫ్రికా బౌలర్లు బౌన్సర్ల వర్షం కురిపిస్తునప్పటికీ రాహుల్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ 105 బంతుల్లో 70 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. భారత్ స్కోర్ 200 పరుగుల మార్క్ దాటడంలో రాహుల్‌ది కీలక పాత్ర. సౌతాఫ్రికాపై రాహుల్‌కు ఇది 2వ హాఫ్ సెంచరీ. ఓవరాల్‌గా 14వ ఆర్ధ సెంచరీ కావడం గమానార్హం. ఈ ఇన్నింగ్స్ మాత్రం రాహుల్‌కు తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతడి ఇన్నింగ్స్‌లో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వర్షం అంతరాయం..
ఈ తొలి రోజు మూడో సెషన్‌లో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మొదటి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో పాటు వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(70), మహ్మద్ సిరాజ్ ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు.
చదవండి: IND vs SA 1st Test: టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్
A fifty to remember in the Test career. 🔥
— Johns. (@CricCrazyJohns) December 26, 2023
- Take a bow, KL Rahul. pic.twitter.com/P9pCEa7Dqm
Comments
Please login to add a commentAdd a comment