South Africa vs India, 1st Test- Centurion: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. సహచరులంతా ప్రొటిస్ పేస్ దళానికి బెంబేలెత్తిన వేళ జట్టును ఆదుకునేందుకు తానున్నానంటూ ముందుకు వచ్చి సత్తా చాటాడు. తొలి రోజు ఆట సందర్భంగా అర్ధ శతకం పూర్తి చేసి ఆలౌట్ గండం నుంచి తప్పించిన ఈ కర్ణాటక బ్యాటర్.. సెంచూరియన్ వేదికగా బుధవారం శతకం సాధించాడు.
అప్పుడు 123...
భారత ఇన్నింగ్స్‌లో 65.6వ ఓవర్ వద్ద గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో సిక్సర్‌తో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సెంచూరియన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
టీమిండియా 2021/22 టూర్ సందర్భంగా సెంచూరియన్‌లో 123(260 బంతుల్లో) పరుగులు సాధించిన రాహుల్.. తాజాగా 101(133 బంతులు) చేశాడు. ఇక రాహుల్ అద్భుత సెంచరీ కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేయగలిగింది.
.@klrahul has come out with a positive mindset!
— Star Sports (@StarSportsIndia) December 27, 2023
What are your predictions for the total? 🤔
Tune-in to Day 2 of the #SAvIND 1st Test
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/yDdVCX4TBD
సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా కేఎల్ రాహుల్ సాధించిన ఘనతలు
1. సెంచూరియన్‌లో అత్యధిక శతకాలు బాదిన పర్యాటక జట్టు ఏకైక బ్యాటర్
2. సౌతాఫ్రికా గడ్డ మీద అత్యధిక సెంచరీలు చేసిన ఆసియా బ్యాటర్ల జాబితాలో చోటు(సచిన్ టెండుల్కర్ 5, అజర్ మహ్మూద్, టి సమరవీర, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్-2)
ఇక టెస్టుల్లో రాహుల్‌కు ఇది ఎనిమిదో సెంచరీ. విదేశీ గడ్డపై అత్యుత్తమ శతకం అని చెప్పొచ్చు. ఇక సెంచూరియన్ మ్యాచ్‌లో రాహుల్ నాండ్రీ బర్గర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.
చదవండి: న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ సంచలన విజయం.. కివీస్ గడ్డపై తొలి గెలుపు
Comments
Please login to add a commentAdd a comment