టీమిండియా పరాజయం.. సిరీస్‌ గోవిందా! | South Africa won the series with India while another Test remaining | Sakshi
Sakshi News home page

టీమిండియా పరాజయం.. సిరీస్‌ గోవిందా!

Published Wed, Jan 17 2018 3:52 PM | Last Updated on Wed, Jan 17 2018 4:47 PM

South Africa won the series with India while another Test remaining - Sakshi

సెంచూరియన్‌ : విదేశీగడ్డపై టీమిండియాకు మరోసారి పరాభవం తప్పలేదు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 135 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 287 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకునేక్రమంలో 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తేడాతో సఫారీలు సిరీస్‌ కైవసం చేసుకున్నారు. తద్వారా వరుసగా 10వ సిరీస్‌ గెలిచి రికార్డు నెలకొల్పాలనుకున్న కోహ్లీ సేన కల.. కలగానే మిగిలిపోయింది.

నిప్పులు కక్కిన ఇన్‌గిడి :  35/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదోరోజు ఆట ప్రారంభించిన భారత్‌.. తొలి సెషన్‌లోనే చాపచుట్టేసింది. సౌతాఫ్రికన్‌ యంగ్‌ బౌలర్‌ ఇన్‌గిడి నిప్పులుకక్కేబంతులు విసిరి 6 వికెట్లు నేలకూల్చాడు.  11 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఐదోరోజు బరిలోకిదిగిన పుజారా.. మరో 8 పరుగులు మాత్రమే చేసి రనౌట్‌ అయ్యాడు. పార్థివ్‌ 19, హార్ధిక్‌ 6, అశ్విన్‌ 3 పరుగులుచేశారు. మరో ఎండ్‌లో వికెట్లు నేలరాలుతున్నా.. రోహిత్‌ శర్మ ఒక్కడే కాస్తోకూస్తో ఫర్వాలేదనిపించాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసిన రోహిత్‌.. 8వ వికెట్‌గా పెవిలియన్‌ చేరుకున్నాడు. టెయిలెండర్‌ షమి 28 పరుగులుచేసి ఆకట్టుకున్నాడు. ఇన్‌గిడి 6 వికెట్లకుతోడు రబాడా 3 వికెట్లు నేలకూల్చాడు. ఇరుజట్ల మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా జనవరి 24 నుంచి జరుగనుంది.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 335;
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 307;
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 258
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : విజయ్‌ (బి) రబడ 9; రాహుల్‌ (సి) మహరాజ్‌ (బి) ఇన్‌గిడి 4; పుజారా 19 రనౌట్‌ ; కోహ్లి (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 5; పార్థివ్‌ (సి)మోర్కెల్‌ (బి) రబడ 19 ; రోహిత్‌ శర్మ (సి)డివిల్లీర్స్‌ (బి)రబడా 47 ; హార్దిక్‌ పాండ్యా (సి) డికాక్‌ (బి) ఇన్‌గిడి 6 ; రవిచంద్రన్‌ అశ్విన్‌ (సి) డికాక్‌ (బి) ఇన్‌గిడి 3 ; మహమ్మద్‌ షమి (సి)మోర్కెల్‌ (బి) ఇన్‌గిడి 28 ; ఇషాంత్‌ శర్మ (నాటౌట్‌) 4 ; బుమ్రా (సి) ఫిలాండర్‌ (బి) ఇన్‌గిడి 2. ఎక్స్‌ట్రాలు 5; మొత్తం  (50.2 ఓవర్లలో ఆలౌట్‌) 151.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement