PC: Twitter
Ind vs Sa 1st Test: Indian Players Lunch Menu On Day 2 Photo Goes Viral: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో రోజు టీమిండియా బ్యాటర్ల మెరుపులు చూడాలని భావించిన అభిమానులకు నిరాశ మిగిలిన సంగతి తెలిసిందే. లంచ్ బ్రేక్ తర్వాత అయినా మ్యాచ్ మొదలవుతుందని ఎదురుచూసిన వాళ్ల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఈ క్రమంలో వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే సోమవారం నాటి ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో టీవీల ముందు కూర్చున్న వీరాభిమానులకు భంగపాటు తప్పలేదు.
ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో కామెంట్లు చేశారు . ‘‘ప్చ్.. మనోళ్లు మంచిగా ఆడుతున్నారని వరుణుడు పగపట్టాడేమో! పదే పదే ఆటంకం కలిగించాడు. రాహుల్ క్లాసిక్ ఇన్నింగ్స్ కొనసాగుతుందా లేదా చూడాలంటే.. మరుసటి రోజు దాకా వెయిట్ చేయాల్సిందే’’అంటూ ఉసూరుమన్నారు. ఇదిలా ఉంటే.. మఫద్దాల్ వోహ్రా అనే వ్యక్తి.. ఓ ఆసక్తికర పోస్టుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. రెండో రోజు టీమిండియా లంచ్ మెనూకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.
ఇక ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆట వర్షార్పణమైందని మేము బాధపడుతుంటే.. నీ గోల ఏంటయ్యా. వాళ్లేం తిన్నారు... ఎలా తిన్నారు.. ఇదంతా అవసరమా’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ టీమిండియా ఆటగాళ్ల మెనూలో ఉన్న ఆహారపదార్థాలు ఏమిటంటే.. చెట్టినాడ్ చికెన్, బ్రకోలీ సూప్, వెజిటబుల్ కడాయి, పనీర్ టిక్కా తదితరాలు.
కాగా తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ క్లాసిక్ సెంచరీతో ఆకట్టుకోగా.. రహానే అర్ధ సెంచరీకి చేరువగా ఉన్నాడు. మంగళవారం కూడా వర్షం పడినట్లయితే... మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
చదవండి: KL Rahul: భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!
Day 2 Lunch menu for team India. pic.twitter.com/lXFuVTd1oT
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2021
Unfortunately, due to the large volume of rain today at Centurion, play has been called off for the day. #SAvIND pic.twitter.com/NQ5Jbc8MlJ
— BCCI (@BCCI) December 27, 2021
Comments
Please login to add a commentAdd a comment