సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవని టీమిండియా ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రయత్నంలోనే తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసింది. తొలి రోజు నుంచే మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిక్యం చూపించిన టీమిండియా ఏ దశలోనూ సౌతాఫ్రికాకు అవకాశం ఇవ్వలేదు.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ సూపర్ శతకంతో రాణించగా.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్థ శతకం.. రహానే 48 పరుగుల కీలక ఇన్నింగ్స్ వెరసి తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లతో దుమ్మురేపడం.. అతనికి బుమ్రా, సిరాజ్, శార్దూల్ నుంచి సహకారం అందడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు 131 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ తడబడడంతో 174 పరుగులకే కుప్పకూలింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా ఎదుట 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. అయితే సెంచూరియన్ మైదానంలో 200 కంటే ఎక్కువ పరుగులు చేధించిన సందర్భాలు లేవు. దీనిని టీమిండియా చక్కగా వినియోగించుకుంది. భారత పేసర్లు షమీ, బుమ్రా, సిరాజ్‌లు చెలరేగడం.. చివర్లో అశ్విన్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో టీమిండియా ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా సౌతాఫ్రికా గడ్డపై పలు రికార్డులు అందుకుంది.
►సెంచూరియన్ వేదికగా జరిగిన గత 11 టెస్టు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క ఆసియన్ జట్టు విజయం సాధించకపోగా, సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా కొత్త చరిత్ర లిఖించింది. మరొకవైపు సెంచూరియన్‌లో గెలిచిన తొలి ఆసియన్ జట్టుగా టీమిండియా నయా రికార్డు నెలకొల్పింది.
►టీమిండియాకు సౌతాఫ్రికా గడ్డపై ఇది నాలుగో విజయం. 2001-02లో జోహెన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 123 పరుగుల తేడాతో తొలిసారి విజయాన్ని అందుకుంది. ఇక రెండోసారి డర్బన్ వేదికగా 2010-11లో 87 పరుగుల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. ఇక 2017-18లో జోహెన్నెస్‌బర్గ్ వేదికగా 63 పరుగుల తేడాతో ముచ్చటగా మూడో విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా 113 పరుగుల తేడాతో నాలుగో విజయాన్ని అందుకుంది.
►2021లో టీమిండియా(ఆసియా కాకుండా) విదేశీ గడ్డపై నాలుగు విజయాలు సాధించింది. అందులో బ్రిస్బేన్(ఆస్ట్రేలియా), లార్డ్స్, ఓవల్(ఇంగ్లండ్), తాజాగా సెంచూరియన్(సౌతాఫ్రికా) ఉన్నాయి. కాగా టీమిండియా క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 2018లో జోహెన్నెస్‌బర్గ్(సౌతాఫ్రికా), నాటింగ్‌హమ్(ఇంగ్లండ్), అడిలైడ్, మెల్‌బోర్న్(ఆస్ట్రేలియా) ఇదే తరహాలో నాలుగు విజయాలు సాధించింది.
►ఇక సౌతాఫ్రికా సొంతగడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ 200లోపూ ఆలౌట్ కావడం ఇది మూడోసారి. ఇంతకముందు 2001-02లో ఆస్ట్రేలియాపై(159&133) జోహెన్నెస్‌బర్గ్ వేదికగా , 2017-18లో టీమిండియాపై (194&177) జోహెన్నెస్‌బర్గ్ వేదికగా, 2021-22లో టీమిండియాపై సెంచూరియన్ వేదికగా (197&191)
Comments
Please login to add a commentAdd a comment