
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా సఫారీ జట్టుకు 103 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో జో డెన్లీ (50), స్టోక్స్ (35), రూట్ (29) మాత్రమే కొద్దిగా ప్రతిఘటించగలిగారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వెర్నాల్ ఫిలాండర్ 4 వికెట్లతో చెలరేగగా, రబడకు 3 వికెట్లు దక్కాయి. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్ తమ బౌలర్ల ప్రతిభతో ప్రత్యర్థిని కట్టడి చేయగలిగింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 72 పరుగులు చేసింది. అండర్సన్ మరో సారి తొలి ఓవర్లోనే మార్క్‌రమ్ (2)ను అవుట్ చేయగా, ఎల్గర్ (22), హమ్జా (4), డు ప్లెసిస్ (20) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం వాన్‌డర్ డసెన్ (17), నోర్జే (4) క్రీజ్‌లో ఉండగా...ఓవరాల్‌గా ఆతిథ్య జట్టు 175 పరుగులు ముందంజలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment