
Ind Vs Sa Test Series: భారత్‌తో జరుగుతున్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడి భార్య త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో పితృత్వ సెలవు తీసుకోనున్నాడు. ఈ క్రమంలో టీమిండియాతో జరుగనున్న రెండో, మూడో టెస్టుకు డికాక్ అందుబాటులో ఉండటం లేదు. తొలుత రెండో టెస్టు ఆడాలని భావించిన డికాక్... తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
గర్భవతి అయిన భార్యకు ఎక్కువ సమయం కేటాయించాలని అతడు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో తొలి టెస్టు పూర్తైన వెంటనే జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా డికాక్ వంటి స్టార్ బ్యాటర్ దూరం కావడం ప్రొటిస్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. ఇక అతడి స్థానంలో వికెట్ కీపర్లు కైల్ వెరెన్నె లేదంటే... రియాన్ రికెల్టన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కోహ్లి సేనతో సెంచూరియన్ వేదికగా తొలి టెస్టులో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో డికాక్ 33 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, రహానే, శార్దూల్, షమీ వికెట్లు కూల్చడంలో భాగమయ్యాడు ఈ వికెట్ కీపర్. నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు.
చదవండి: ODI Series Cancelled: కరోనా కలకలం.. వన్డే సిరీస్ రద్దు
Quinton De Kock: ఎంత ఔటైతే మాత్రం ఇంత కోపం అవసరమా డికాక్..
— Addicric (@addicric) December 28, 2021
Comments
Please login to add a commentAdd a comment