సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (151 బంతుల్లో 115; 13 ఫోర్లు; 2 సిక్స్) సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ ప్రస్తుతం 479 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది.
కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న అలెక్స్ డూలాన్ (154 బంతుల్లో 89; 12 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో షాన్ మార్ష్ (73 బంతుల్లో 44 బ్యాటింగ్; 5 ఫోర్లు; 1 సిక్స్), క్లార్క్ (32 బంతుల్లో 17; 3 ఫోర్లు) ఉన్నారు. అంతకుముందు 140/6 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీ జట్టు 61.1 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌట్ అయ్యింది. డివిలియర్స్ (148 బంతుల్లో 91; 10 ఫోర్లు; 2 సిక్స్) సెంచరీ మిస్ అయ్యాడు. జాన్సన్‌కు ఏడు వికెట్లు దక్కాయి.
భారీ ఆధిక్యంలో ఆసీస్
Published Sat, Feb 15 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement
Advertisement