క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో ప్రధాన టోర్నీ ఆరంభానికి ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లు తుది దశకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో అసలు పోరుకు ముందు టీమిండియా తమ చివరి సన్నహాక మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. తిరువనంతపురం వేదికగా మంగళవారం పసికూన నెదర్లాండ్స్‌తో భారత జట్టు తలపడనుంది. కాగా గౌహుతి వేదికగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయిపోయింది.
దీంతో ఇవాళ జరిగే మ్యాచ్‌లో తమ బలాబాలను పరీక్షించుకోవాలని భారత్ భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ సత్తా చాటేందుకు భారత జట్టుకు ఇదొక మంచి అవకాశం. మరోవైపు నెదర్లాండ్స్ కూడా తమ సత్తాచాటాలని వ్యూహాలు రచిస్తోంది.
ఆసీస్‌తో తొలి వార్మప్ మ్యాచ్ రద్దు అయినప్పటికీ.. నెదర్లాండ్స్ మాత్రం తమ బౌలింగ్‌తో అకట్టుకోంది. భారత్‌తో మ్యాచ్‌ను అన్ని రకాలుగా వినియోగించుకోవాలని డచ్ జట్టు భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.
చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్‌లో స్నాక్స్ అమ్మేవాడిని: పాక్ స్టార్ ఆటగాడు
Comments
Please login to add a commentAdd a comment