'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా రికార్డ్ కలెక్షన్లతో సూపర్ హిట్ అందుకుంది. రూ. 200 కోట్లు కలెక్షన్స్ రాబట్టి మలయాళ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలోని ఒక పాట వివాదం తెచ్చిపెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా పంపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాటను కమల్ నటించిన 90ల నాటి 'గుణ' చిత్రం నుంచి వాడారంటూ ఆ నోటీసుల్లో ఇళయరాజా పేర్కొన్నారు.
ఈ నోటీసులకు 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర నిర్మాత షాన్ ఆంటోనీ స్పందించారు. సరైన అనుమతి పొందిన తర్వాతే పాటను ఉపయోగించామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సాంగ్‌కు సంబంధించ కాపీరైట్ కలిగిన రెండు మ్యూజిక్ కంపెనీలను సంప్రదించి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పాటను వాడామని స్పష్టత ఇచ్చారు.
ఈ వివాదంలో ఇళయరాజా రూ.2 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారని, సమస్యను పరిష్కరించేందుకు 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాత రూ.60 లక్షలు ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై ఇళయరాజా తరపు న్యాయవాది శరవణన్‌ను సంప్రదించగా, ఆయన ఈ సమాచారాన్ని ఖండించారు. నిర్మాత వైపు నుంచి ఇళయరాజాకు ఎలాంటి డబ్బులు అందలేదని ఆయన చెప్పారు. అనంతరం తాము నోటీసు పంపామని తెలిపారు.
ఈ విషయమై మంజుమల్ బాయ్స్ యూనిట్ కూగా రియాక్ట్ అయింది. సంగీత దర్శకుడు ఇళయరాజాకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. మా సినిమాలో ఉపయోగించిన 'కణ్మణి అన్బోడు వాలంతన్' పాటకు మ్యూజిక్ మాస్టర్ ఆడియో నుంచి పొందామని వారు వివరించారు. అదేవిధంగా శ్రీదేవి మ్యూజిక్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి తెలుగు పాటను పొందినట్లు తెలిపారు. మరి ఇప్పటి వరకు ఇళయరాజాకి తాము ఎలాంటి పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment