డ్రగ్స్‌ కేసులో 'పిశాచి' సినిమా నటి | Actress Prayaga Martin Name In Drug Case Issue | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో 'పిశాచి' సినిమా నటి

Published Tue, Oct 8 2024 12:19 PM | Last Updated on Tue, Oct 8 2024 1:05 PM

Actress Prayaga Martin Name In Drug Case Issue

మాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆరోపణలు వస్తున్న సమయంలో డ్రగ్స్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ ఓం ప్రకాష్ నిర్వహించి ఒక డీజే పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అతనిపై ఇప్పటికే దాదాపు 30 క్రిమినల్ కేసులు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తితో మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన కొందరు నటీనటులు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

అక్టోబర్‌ 5న ఓ పార్టీలో పాల్గొన్న  ఓం ప్రకాష్,  అతని స్నేహితుడు షిహాస్ డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో వారిని విచారించగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటీనటుల  పేర్లు బయటకొచ్చాయి. వారు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సరైన ఆదారాలు కోర్టుకు అందించడంలో పోలీసులు విఫలం కావడంతో   ఓం ప్రకాష్,  అతని స్నేహితుడు షిహాస్‌కు బెయిల్‌ వచ్చింది. కానీ, వారిద్దరితో టచ్‌లో ఉన్న నటీనటులు ఎవరనేది చర్చ జరుగుతుంది.

మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీనాథ్ భాసితో పాటుగా.. పిశాచి చిత్రం ద్వారా ఫేమ్‌ అయిన నటి ప్రయాగ మార్టిన్‌ ఈ డ్రగ్స్‌తో లింక్‌ ఉన్నట్లు మలయాళ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కూడా ఓం ప్రకాశ్‌ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు వారు అతని గదికి కూడా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

సుమారు 20 మందికి పైగా ఓం ప్రకాశ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు లభించిన  CCTV ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారట. కానీ, ఆ వీడియోను పోలీసులు బహిర్గతం చేయలేదు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంలో గుహ లోయలో పడిపోయిన పాత్రలో శ్రీనాథ్‌ భాసి కనిపించారు. నటి ప్రయాగ మార్టిన్‌ 2014లో పిశాచి సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement