'మంజుమ్మెల్ బాయ్స్'లో ఆ సీన్‌ కోసం ఓరియో బిస్కెట్స్‌: డైరెక్టర్‌ Oreo Biscuits Use In Manjummel Boys Climax | Sakshi
Sakshi News home page

'మంజుమ్మెల్ బాయ్స్'లో ఆ సీన్‌ కోసం ఓరియో బిస్కెట్స్‌: డైరెక్టర్‌

Published Fri, May 24 2024 9:59 AM

Oreo Biscuits Use In Manjummel Boys Climax

మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. 2006లో తమిళనాడు కొడైకెనాల్‌లోని గుణ కేవ్స్‌లో కేరళ యువకుడు పడిపోవడం జరిగింది. ఆ నిజజీవిత ఘటన ఆధారంగా మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని చిదంబరం తెరకెక్కించాడు. సౌత్‌ ఇండియాలో బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది.

ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న క్లైమాక్స్ సన్నివేశాన్ని అసలు ఎలా చిత్రీకరించారో తాజాగా ఆ చిత్ర డైరెక్టర్‌  చిదంబరం రివీల్‌ చేశాడు. ఈ సినిమాలో సుభాష్ పాత్రలో నటించిన శ్రీనాథ్ భాసి గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పాడు.  ఆ గుహలో పడిపోయిన సుభాష్ నెత్తుటి మడుగులో ఉన్నట్లుగా చూపించారు. ఆయనకు గాయాలు అయినట్లుగా చూపించడానికి ఓరియో బిస్కెట్లను మేకర్స్ ఉపయోగించారని చిదంబరం వెల్లడించాడు. ఓరియో బిస్కెట్లలో ఉండే క్రీమ్‌తో సుభాస్‌కు మేకప్‌ వేశామన్నారు. అతనికి అయినటువంటి గాయాలను చూపించేందుకు తాము ఈ టెక్నిక్‌ ఉపయోగించామని ఆయన తెలిపాడు. 

అయితే, ఈ క్రెడిట్ అంతా మేకప్ మ్యాన్ రోనెక్స్ జేవియర్‌కు చెందుతుందని చెప్పాడు. అయితే, ఈ మేకప్‌ వల్ల సుభాస్‌ ( శ్రీనాథ్ భాసి) చాలా ఇబ్బంది పడ్డాడు. బిస్కెట్‌ క్రీమ్‌ వాసనకు ఆయన చుట్టూ చీమలు కూడా చేరిపోయాయి. ఈ సీన్‌ తీస్తున్నప్పుడు ఆ చీమలు కూడా అతన్ని కుట్టడం ప్రారంభించాయి. అయినా కూడా శ్రీనాథ్‌ భాసి చాలా చక్కడా చేశాడని దర్శకుడు చిదంబరం గుర్తుచేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement