మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తాజాగా మరో సినిమా యూనిట్‌కు నోటీసులు జారీ చేశారు. తను సంగీతం అందించిన పాటును అనుమతిలేకుండా ఉపయోగించుకున్నారని ఆయన నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన పాటలను ఉపయోగించుకున్న పలు సినిమాలకు సంబంధించిన మేకర్స్‌కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాదిలో మలయాళం నుచి విడుదలైన 'మంజుమ్మల్ బాయ్స్' సూపర్ హిట్ కొట్టింది. తెలుగు,తమిళ్‌లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే 1991లో ఇళయరాజా- కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన గుణ చిత్రంలోని 'కణ్మణి అన్బోడు' పాటను ఈ చిత్రంలో ఉపయోగించారు. అయితే, తమ అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నందుకు మంజుమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు సంగీత స్వరకర్త ఇళయరాజా తరపున న్యాయవాది శరవణన్ నోటీసు పంపారు.
కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందినవని, అలాంటి సమయంలో పాటను ఉపయోగించుకోవడానికి హక్కులు పొందాలంటే.. వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొనబడింది. లేకుంటే కాపీరైట్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. రజనీకాంత్ నటిస్తున్న 'కూలి' చిత్రం టైటిల్ టీజర్‌లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్‌కు కూడా ఇళయరాజా నోటీసు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment