Top 10 Telugu Latest News: Morning Headlines Today 4th May 2022, Check Inside - Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published Wed, May 4 2022 10:00 AM | Last Updated on Wed, May 4 2022 10:43 AM

Top 10 Telugu Latest News Morning Headlines Today 4th May 2022 - Sakshi

ట్విటర్‌ విషయంలో ట్విస్ట్‌ ఇచ్చిన మస్క్‌

ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు. ట్విటర్‌ యూజర్లకు స్వేచ్ఛ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండబోవంటూనే బాంబు పేల్చాడు. 

👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

28ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. సీఎం యోగి భావోద్వేగం

ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌.. తన వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పటివరకైతే చూసింది లేదు. అలాంటి వ్యక్తి..  సుమారు 28 ఏళ్ల తర్వాత సొంతూర్లో అడుగుపెట్టి తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు.

👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

తెలంగాణలో ఈదురు గాలులతో వర్ష బీభత్సం
తెలంగాణ​లోని పలు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలుల వర్షం బీభత్సం సృష్టించింది. కాగా, అల్పపీడన ద్రోణి కారణంగా మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

కోవోవాక్స్‌ వ్యాక్సిన్‌ టీకా ధర భారీగా తగ్గింపు
కోవోవాక్స్‌ వ్యాక్సిన్‌ టీకా ఒక్కోడోసు ధరను సీరమ్‌ సంస్థ భారీగా తగ్గించింది. 12–17ఏళ్ల పిల్లలకు ప్రైవేట్‌ సెంటర్లలో ఇచ్చేందుకు సోమవారం కోవిన్‌ పోర్టల్‌లో ఈ టీకాను చేర్చిన సంగతి తెలిసిందే.

 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


బాలికతో పరీక్ష రాయించిన ‘దిశ’ యాప్‌
పదో తరగతి పరీక్షలు రాయనీయకుండా నిర్బంధించిన తండ్రిపై ఓ బాలిక దిశ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బాలికను పరీక్ష కేంద్రంలో హాజరుపర్చారు.

 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

జీవితానికి సరిపడేంత ఎంజాయ్‌ చేశాను.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
కాలేజ్‌లో చదువుతున్నప్పుడు అమ్మాయిలను చూడాలంటే నాకు భయం.. ఎప్పుడైనా ఓరకంటితో చూసేవాణ్ణి. కానీ ఇవాళ నేనలా కాదు. అందమైన అమ్మాయిలను జీవితానికి సరిపడేంత దగ్గరగా చూశాను.. ఇది సక్సెస్‌ కాకపోతే ఇంకేంటి..

👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మహిళల టి20 చాలెంజ్‌ క్రికెట్‌ టోర్నీ వేదిక మార్పు
మహిళల టి20 చాలెంజ్‌ క్రికెట్‌ టోర్నీ వేదిక మారింది. మూడు జట్లతో కూడిన ఈ టోర్నీ లక్నోలో కాకుండా పుణేలో ఈనెల 23 నుంచి 28 వరకు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. కరోనా కారణంగా గత ఏడాది ఈ టోర్నీని నిర్వహించలేదు.

 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


ఐపీఎల్‌లో రికార్డు.. భారత బౌలర్‌కు చుక్కలు చూపించిన లివింగ్‌స్టోన్‌
ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డును పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఈ సీజన్‌లోనే భారీ సిక్సర్ బాదాడు. భారత సీనియర్‌ బౌలర్‌కు చుక్కలు చూపించాడు. 

 👉:పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట

కృష్ణా జలాల్లో వాటాపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నీటిపారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 6న జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కోరడంపై నిపుణులు నివ్వెరపోతున్నారు. 

 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


ముగిసిన డెడ్‌లైన్‌.. ముంబైలో హైఅలర్ట్‌
ఆజాన్‌ వర్సెస్‌ హనుమాన్‌ చాలీసా  రాజకీయం.. బెదిరింపులతో ముంబై మహానగరం అప్రమత్తమైంది. రాజ్‌ థాక్రే విధించిన డెడ్‌ లైన్‌ పూర్తి కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.  దీంతో నగరంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

  👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement