తప్పుడు కథనాలతో ఫేస్బుక్కు తంటాలు
తప్పుడు కథనాలతో ఫేస్బుక్కు తంటాలు
Published Tue, Aug 30 2016 1:07 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
న్యూయార్క్ : ప్రపంచపు పాపులర్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ , ట్రెండింగ్ టాపిక్స్ లో తప్పుడు కథనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. తప్పుడు కథనాలనే ఫేస్బుక్ ఎక్కువగా ప్రచారం చేస్తుందని విమర్శలు ఎదుర్కొంటోంది. గత నెల నుంచి ఈ విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.. ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత మెగిన్ కెల్లీకు సంబంధించిన ఓ వార్తాకథనాన్ని ఫేస్ బుక్ తప్పుగా ప్రచారం చేసింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డెమొక్రాటిక్ పార్టీ లీడర్ హిల్లరీ క్లింటన్కు కెల్లీ మద్దతిస్తున్నట్టు వార్తా కథనాన్ని ఫేస్బుక్ ప్రచురించింది. ఆ స్టోరీని ట్రెండింగ్ టాపిక్స్ సైట్లో టాప్లో ఫేస్బుక్ మెయిన్ పేజీలో ప్రచురించింది. నెలకు దాదాపు 1.7 బిలియన్ యూజర్లు ఈ పేజీని వీక్షించారు.. దీంతో ఫేస్బుక్ కచ్చితత్వం లేని స్టోరీలను ప్రసారం చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. స్టోరీ సరియైనదిగా లేదని తొలగించాలంటూ ఫాక్స్ న్యూస్ ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఫేస్బుక్ రివ్యూ టీమ్ స్టోరీలో కచ్చితత్వ లోపాన్ని గుర్తించి వెంటనే స్టోరీని తొలగించింది.
2014లో ప్రవేశపెట్టిన ఈ ట్రెండింగ్ టాపిక్స్ కోసం, ఫేస్ బుక్ ప్రత్యేక టీమ్ పనిచేస్తుంది. అయితే పొలిటికల్ చర్చలు, నమ్మకాలను బట్టి స్టోరీలను ఎంపికచేసి ట్రెండింగ్ టాపిక్స్లో పోస్టు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే బ్రేకింగ్ న్యూస్లను, ఈవెంట్లను ఈ పేజీకి ఎంపికచేస్తారు. అయితే గత నెల మే నుంచి ఫేస్బుక్ ఈ ట్రెండింగ్ టాపిక్స్పై విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సమస్యపై విచారణ కొనసాగించిన ఫేస్బుక్ సైతం తమ పోస్టు చేసే కథనాల్లో తప్పులు దొర్లుతున్నాయని చెప్పింది. అయితే ప్రచారం నిర్వర్తించే ముందు స్టోరీల కచ్చితత్వాన్ని ధృవీకిరస్తున్నారో లేదో మాత్రం కంపెనీ అధికార ప్రతినిధి తెలుపలేదు. పాపులర్ స్టోరీలను, న్యూస్ కచ్చితత్వాన్ని గుర్తించడానికి ఫేస్బుక్ అదనంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement