Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం | Telugu Trending News Breaking News Evening News Roundup 17th Sep 2022 | Sakshi
Sakshi News home page

Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Published Sat, Sep 17 2022 5:41 PM | Last Updated on Sat, Sep 17 2022 6:18 PM

Telugu Trending News Breaking News Evening News Roundup 17th Sep 2022 - Sakshi

1. గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన
హైదరాబాద్‌ నడిబొడ్డున ఆదివాసీ, బంజారా భవన్‌లను ప్రారంభించడం చాలా  సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు.  గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం రెండు భవన్‌లూ వేదికలు కావాలని తెలిపారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. AP: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ
ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 679 ఎంఈఓ-2 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.  రాజధానిగా అమరావతి ఉండాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు.. తెలంగాణ కాంగ్రెస్‌ సీన్‌ నుంచి అవుట్‌..
హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న కేంద్రహోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిస్థితిపై ఆరా తీశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు, ఆ స్క్రీన్‌ షాట్స్‌ తీసి పెట్టుకున్నా’
స్టార్‌ కిడ్‌ అయిన దుల్కర్‌ సల్మాన్‌ సైతం ట్రోల్స్‌ బారిన పడ్డాడట. తనని వ్యక్తిగతం టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో విమర్శించారని, వాటికి సంబంధించిన స్క్రిన్‌షాట్స్‌ కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. సీతారామంతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న దుల్కర్‌ తాజాగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘చుప్‌: రివేంజ్‌ ఆఫ్‌ ది ఆర్టిస్ట్‌’.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. రెడీగా ఉండండి.. ‘త్వరలో హైస్పీడ్‌ 5జీ ఇంటర్నెట్‌ సేవలు’
రాష్ట్రానికి హైస్పీడ్‌ 5జీ ఇంటర్నెట్‌ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. పూరీ పర్యటన పురస్కరించుకుని ఆయన ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Steamed Food- Health Benefits: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే!
దాదాపు ఒక ఇరవై ఏళ్ల కిందటి వరకు జ్వరమొచ్చి తగ్గిన వాళ్లకి పొట్లకాయ, బీరకాయ, దొండకాయ, కాకరకాయ లాంటి కూరలు పథ్యం పెట్టేవాళ్లు పెద్దవాళ్లు. అదేవిధంగా నీరసంగా ఉన్న వాళ్లకి ఆవిరి కుడుముల లాంటివి పెట్టేవాళ్లు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. కొత్త రూల్‌ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ.. ఇన్నింగ్స్‌ మధ్యలో ఆటగాడిని మార్చేయవచ్చు
భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్‌లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో (అక్టోబర్‌) ప్రారంభంకానున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ నుంచి 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' అనే నయా రూల్‌ను అమల్లోకి తేనుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి..
హత్య కేసుల్లో నేరస్తులను కనిపెట్టడానికి ఫోరెన్సిక్‌ బృదం ఇ‍చ్చే రిపోర్టు అత్యత కీలకమైనది. కొన్ని నేరాల్లో మృతదేహాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో దొరకడంతో బాధితుల తోపాటు నిందితులను గుర్తించడం  కూడా కష్టమవుతోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మీడియా ఆకాశానికెత్తింది. ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ఎస్‌సీఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని సూచించడంపై ప్రశంసలతో ముంచెత్తింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement