Telugu Top News: ఈవెనింగ్‌ హైలైట్‌ న్యూస్‌ | Top 10 News Expulsion Marri Shasidhar Reddy Congress 19th Nov 2022 | Sakshi
Sakshi News home page

Telugu Top News: ఈవెనింగ్‌ హైలైట్‌ న్యూస్‌

Published Sat, Nov 19 2022 6:01 PM | Last Updated on Sat, Nov 19 2022 6:15 PM

Top 10 News Expulsion Marri Shasidhar Reddy Congress 19th Nov 2022 - Sakshi

1. ‘తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ మీడియాను వాడుకుంటున్నారు’
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసు విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అరుణ్‌ కుమార్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ..
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే: స్పీకర్‌ తమ్మినేని
 చంద్రబాబు అధికారం కోసం ఎంతకయినా దిగజారుతారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ
సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించింది. పార్టీకి క్యాన్సర్‌ సోకిందన్న వ్యాఖ్యలపై టీపీసీసీ చర్యలు తీసుకుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఫాంహౌస్‌ కేసులో బీజేపీ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీఎల్‌ సంతోష్‌ను తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అది మసాజ్ కాదు.. ట్రీట్‌మెంట్‌.. జైలు వీడియోపై ఆప్‌ కౌంటర్‌..
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. పంచెకట్టులో మోదీ.. కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన ప్రధాని
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ-తమిళ సంగమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. అబ్బబ్బే అలాంటిదేం లేదు, క్లారిటీ ఇచ్చిన గౌతమ్‌ అదానీ
అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ తన వ్యాపార కార్యకలాపాల్ని విదేశాల్లో ప్రారంభించే యోచనలో ఉన్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. బిగ్‌బాస్‌: టాప్‌ 10లో నుంచి ఎలిమినేట్‌ అయింది ఎవరంటే? 
ఊహించని ఎలిమినేషన్లతో వరుస ట్విస్టులిచ్చిన బిగ్‌బాస్‌ ఈసారి మాత్రం ఊహించని కంటెస్టెంట్‌నే బయటకు పంపించాడు. ఈవారం ఎవరు బయటకు వెళ్తున్నారో మీకీపాటికే అర్థమై ఉంటుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సిరీస్‌ సొంతం
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. సాగర తీరంలో రయ్‌ రయ్‌..
రేసింగ్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైంది. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో ఈ పోటీలు సాగాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement