Telugu Top News: ఈవెనింగ్‌ హైలైట్‌ న్యూస్‌ | Top 10 News Nikhil Siddharth Shutdown Divorce Rumours 18th Nov 2022 | Sakshi
Sakshi News home page

Telugu Top News: ఈవెనింగ్‌ హైలైట్‌ న్యూస్‌

Published Fri, Nov 18 2022 6:33 PM | Last Updated on Fri, Nov 18 2022 6:49 PM

Top 10 News Nikhil Siddharth Shutdown Divorce Rumours 18th Nov 2022 - Sakshi

1. మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశాలు
మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. రూ.3,364 కోట్లతో హాస్టళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం?
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన  రాజకీయ భవిష్యత్తు  గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం వర్గాలకు ఆందోళన కలిగించేవి. ఇంతకాలం లేస్తే మనిషిని కానట్లుగా డబాయిస్తూ రాజకీయం చేసేవారు. కానీ ఈసారి ఆయన బేలగా, తాను అసెంబ్లీకి వెళ్లాలంటే టీడీపీని అధికారంలోకి తేవాలని అన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. 'ఇండోర్‌లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆయనను చంపేస్తామని బెదిరింపులు రావడం పార్టీ శ్రేణులకు ఆందోళన కల్గిస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఎంపీ ఇంటిపై దాడి.. తెలంగాణ భవన్‌ ముట్టడికి బీజేపీ నేతల యత్నం
నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు తెలంగాణ భవన్ ముట్టడి చేసేందుకు బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకొని పలువురిని అరెస్ట్‌ చేశారు. ఇక తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమైన క్రమంలో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. పాపం శ్రద్ధా వాకర్‌.. అప్పుడు కూడా అదే టార్చర్‌.. 2020 ఫోటో వైరల్‌
శ్రద్ధా వాకర్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 2020లో తీసిన ఫోటో ఇది. దీనిని చూస్తుంటే అఫ్తాబ్‌ అమిన్‌ పునావాలాతో ఆమె రిలేషన్‌ ఎంత భయంకరంగా ఉందనే దానికి అద్దం పడుతోంది. ఈ ఫోటోలో శ్రద్ధా కళ్లు, ముక్కు, చెంప చుట్టూ  గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మరో షాకింగ్‌ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో!
ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య చేయడానికి కేవలం అయిదు రోజుల క్రితమే వీరిద్దరికి పరిచయం ఏర్పడటం గమనార్హం. వివరాలు.. అబు బాకర్‌ అనే యువకుడు సప్నా అనే యవతితో సహజీనం చేస్తున్నాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్‌.. ఇంకా మెదడు..
బెండకాయ వేపుడు.. బెండకాయ పులుసు.. బెండకాయ 65.. బెండకాయ కూర.. వంటకం ఏదైనా అందులో బెండీ ఉంటే చాలు లొట్టలేసుకుని భోజనం లాగించేస్తారు. కేవలం నోటికి రుచిగా ఉండటం మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది బెండకాయ. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ట్విటర్‌ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్‌ మస్క్‌కు మరో షాక్‌!
ట్విటర్‌ కొత్త బాస్‌, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మరో షాక్‌ తగిలింది. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆరోపిస్తూ  ట్విటర్‌కు చెందిన  దివ్యాంగ ఉద్యోగి ఒకరు కోర్టును ఆశ్రయించారు.  దీంతో  ఈ వ్యవహారంలో కోర్టులో మూడు కేసులు నమోదైనాయి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది'
న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సైమన్‌ డౌల్‌  మాత్రం స్కై స్టేడియం సిబ్బందిని ఎండగట్టాడు. మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సైమన్‌ డౌల్‌ స్టేడియంలో ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఫోటోను షేర్‌ చేస్తూ ట్వీట్‌ చేయడం ఆసక్తి కలిగించింది. ఆ ఫోటోలో ఒక మసి గుడ్డను కుర్చీపై ఉంచాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. విడాకులకు సిద్ధమైన మరో యంగ్‌ హీరో నిఖిల్‌? ఫోటోతో తేల్చేశాడుగా!
టాలీవుడ్‌లో చై-సామ్‌ల విడాకుల విషయం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. తాజాగా మరో యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ భార్య పల్లవితో విడిపోతున్నట్లు కొద్దికాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో భార్య పల్లవితో విడిపోయేందుకు నిఖిల్‌ సిద్ధమయ్యాడని, కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడని రూమర్స్‌ పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు నిఖిల్‌.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement