1. WHO: ఆ భారత కంపెనీ సిరప్‌లను వాడొద్దు
భారత్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. ఓవర్ స్పీడ్.. కేరళలో ఘోర ప్రమాదం
ఓ డ్రైవర్ నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు బలిగొంది. కేరళలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. పాలక్కడ్ వడక్కన్‌చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. అమ్మవారి విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి.. 8 మంది మృతి, షాకింగ్ వీడియో
విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 8 మంది మృతి చెందారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాల్ నదిలోకి దిగారు.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియా గాంధీ గురువారం ఉదయం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. 75 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ అనారోగ్యంతో చాలాకాలంగా ఆమె పబ్లిక్ ఈవెంట్‌లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. KCR Party: బీఆర్‌ఎస్‌పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేసిన జాతీయపార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జాతీయస్థాయిలో విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. ఏపీ వాసులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. YV Subba Reddy: తిరుపతి అభివృద్ధికి మరో కీలక అడుగు
తిరుపతి శ్రీనివాససేతు రెండో దశ ఫ్లైఓవర్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.684కోట్లతో శ్రీనివాససేతు నిర్మాణంను చేపట్టినట్లు తెలిపారు. త్వరితగతిన మూడో దశ ఫ్లైఓవర్ పనులను కూడా పూర్తి చేసి జనవరి నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. సిరాజ్‌కు కలిసిరాని మూడో టీ20.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్.. కెప్టెన్ రోహిత్ సీరియస్
దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరిగిన మూడో టీ20తో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఏదీ కలిసిరాలేదు. ఎన్నో అంచనాల మధ్య జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్ తన స్థాయి మేర రాణించలేదు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతను వికట్లేమీ లేకుండా ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్
బిగ్‌బాస్ ఫైమాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్ నిద్ర లేపాల్సి ఉంటుంది. ఇక ఆమె టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్న టైంలో వసంతి, మెరీనాలు దెయ్యం గెటప్‌లు వేసి ప్రాంక్ చేస్తారు.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. మూన్ లైటింగ్ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన!
ఒకే సమయంలో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన విప్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment