Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు | Latest Telugu News Online Telugu Breaking News 26th October 2022 | Sakshi
Sakshi News home page

Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు

Published Wed, Oct 26 2022 10:03 AM | Last Updated on Wed, Oct 26 2022 10:11 AM

Latest Telugu News Online Telugu Breaking News 26th October 2022 - Sakshi

1. రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లకే ప్రధాని.. చరిత్రలో ఒకేఒక్కడు రిషి..!
కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్‌ను గాడినపెట్టే బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్‌కు మొదట్నుంచి ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టు ఉంది. చిన్నతనంలో తల్లి పనిచేసే ఫార్మసీ షాప్‌లో పని చేసినప్పుడే వాటి జమా ఖర్చులన్నీ చూసేవారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.ప్రధాని పదవి పూలపాన్పు కాదు.. రిషికి ముందుంది ముళ్లబాటే..!
అపజయం ఎదురైన చోటే విజయాన్ని అందుకొని బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌కు  ఆ పదవి పూలపాన్పు కాదు. ముందున్నది అంతా ముళ్లబాటే. బ్రెగ్జిట్, కోవిడ్‌–19 సంక్షోభం, , రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆర్థికంగా కుదేలైపోయిన బ్రిటన్‌ను దారిలోని తీసుకురావాల్సిన అతి పెద్ద సవాల్‌ ఆయన ఎదురుగా ఉంది. 

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. 27న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్‌
సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్‌(800 మెగావాట్లు)ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం
మొదట ఓ పిటిషన్‌ వేసి, ఆ విషయాన్ని దాచి పెట్టి... అదే అంశంపై మరో పిటిషన్‌ దాఖలు చేసిన విశాఖ వాసి పి.రంగారావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘చేనేతపై జీఎస్టీ కోరింది కేటీఆరే.. దీనికేం చెప్తరు ట్విట్టర్‌ టిల్లు?’
చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధానికి మంత్రి కేటీఆర్‌ పోస్ట్‌ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని పేర్కొన్నారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. డీఏవీ స్కూల్‌ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు 
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డీఏవీ స్కూల్‌ నిర్వహణలో మరో  ఉల్లంఘన వెలుగు చూసింది. పాఠశాలకు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖాధికారుల పరిశీలనలో వెల్లడైంది. సఫిల్‌గూడ బ్రాంచి  పేరుతో ఆరు, ఏడు తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు  అధికారులు గుర్తించారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.Deepmala Pandey: స్పెషల్‌ టీచర్‌
స్పెషల్లీ ఛాలెంజ్డ్‌ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్‌ స్కూల్స్‌ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్‌ చేస్తుంటారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఓటీటీలకూ భారీ షాక్‌.. ఇకపై అలా కుదరదండి!
కమ్యూనికేషన్‌ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్‌ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్‌–ది–టాప్‌) కమ్యూనికేషన్‌ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి?.. కానీ ఐసీసీ మాత్రం అంతే!
సిడ్నీలో నెట్‌ సెషన్‌ సందర్భంగా తమకు సరైన భోజనం లభించలేదంటూ టీమిండియా ఆటగాళ్లలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రాక్టీస్‌ ముగించుకుని హోటల్‌కు వెళ్లిన తర్వాతే వారు లంచ్‌ చేసినట్లు తెలుస్తోంది. 

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. భార్య వైపు చూస్తున్నాడని తుపాకీతో వచ్చి కాల్పులు.. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా..
తన భార్య వైపు చూస్తున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ దళితుడు, అతడి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోగా అతడి ఇద్దరు సోదరులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దామోహ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement