1. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
రాష్ట్రంలోని మరిన్ని ఆలయాల్లో స్వామివార్లకు నిత్య నైవేద్యాలు జరగనున్నాయి. ఆలయాల అభివృద్ధి, నిత్యం ధూప, దీప, నైవేద్యాలకు ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి మరో 2091 ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. నడిబజారులో నిలబెడతాం.. బీజేపీపై మంత్రి కేటీఆర్ నిప్పులు
ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ, పనికిమాలిన, ప్రచార కండూతి తప్ప మరో ధ్యాసలేని వ్యక్తి అంటూ మోదీపై విరుచుకుపడ్డారు.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. నేనేం సోనియా రిమోట్‌ను కాను
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాత పార్టీకి డమ్మీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే ఉండబోతారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆయన దీటైన సమాధానమిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం అహ్మదాబాద్‌లో ఖర్గే మాట్లాడారు.‘ నేనేం సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్‌ను కాదు.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. ఆ సత్తా భారత్ సొంతం
ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే..
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్ పారిశ్రామిక, లాజిస్టిక్ పార్క్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతూ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందుతున్న విశాఖపట్నం కేంద్రంగా లాజిస్టిక్ రంగం అభివృద్ధికి కీలకమైన అడుగులు పడుతున్నాయి. పారిశ్రామికాభివృద్ధితో పాటు ఎగుమతి, దిగుమతులు సులభతరం చేసేలా 110 ఎకరాల విస్తీర్ణంలో మరో ఇండ్రస్టియల్ లాజిస్టిక్
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి
వెదుకుతున్నది దొరికితే కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అలాంటిది పారేద్దామనుకున్న టికెట్‌కు రూ.కోట్లు దక్కితే... ఆనందానికి అవధులుండవు. ఈ యూఎస్ మహిళ విషయంలో అది నిజమైంది. రోపర్‌కు చెందిన 60 ఏళ్ల జాక్వలిన్ లేహ్ ఓ స్టోర్ నుంచి ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ టికెట్ హాట్‘5’ను ఐదు డాలర్లకు కొన్నది.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది.. తర్వాతే..
రాజకీయ నాయకులు, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దింపి, మోసం చేసిన మాయలాడిని ఖండగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందిత మహిళ న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. అయితే పోలీసులు ఈ విషయమై అధికారికంగా సమాచారం జారీ చేయలేదు. ఆమె వద్ద 2 పెన్‌డ్రైవ్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. Nayanathara: నయన్ అంత పెద్ద షాక్ ఇస్తుందా!
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి నయనతార. ఈమె గురించి నిత్యం ఏదో ఒక వార్త ప్రచారం అవుతునే ఉంటుంది. ఎక్కడో కేరళలో పుట్టి కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి కథానాయికగా గుర్తింపు పొంది నంబర్ వన్ స్థానానికి చేరుకోవడమే కాకుండా లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం'
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది టి20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రజా వెల్లడించాడు. షాహిన్ అఫ్రిది అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడని పేర్కొన్నాడు.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. 'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ
బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, ఫ్యూచర్ కన్జూమర్ తాజాగా విఫలమయ్యాయి.సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కాఫీ డే వెల్లడించింది.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment