Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం | Telugu Trending News Breaking News Evening News Roundup 16th Sep 2022 | Sakshi
Sakshi News home page

Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Published Fri, Sep 16 2022 5:52 PM | Last Updated on Fri, Sep 16 2022 6:08 PM

Telugu Trending News Breaking News Evening News Roundup 16th Sep 2022 - Sakshi

1. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్‌
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏమీ లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శుక్రవారం పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అవాక్కయ్యే ఘటన.. ‘జయహో జగదీష్‌రెడ్డి’.. జిల్లా పోలీస్‌ బాస్‌ అత్యుత్సాహం
సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు. వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌.. ‘జయహో జగదీష్‌రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మా ఫ్యామిలీ, కృష్ణంరాజు ఫ్యామిలీ కలిసి ఆ సినిమా చూశాం: రాజ్‌నాథ్‌ సింగ్‌
గోహత్య నిషేదంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు ప్రవేశపెట్టింది కృష్ణంరాజు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. తర్వాత కాలంలో యోగి ఆదిత్యనాథ్‌ కూడా గోహత్య నిషేద బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని కృష్ణంరాజు సంతాపసభలో రాజ్‌నాథ్‌సింగ్‌ గుర్తుచేసుకున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. SCO Summit: చైనా అధ్యక్షుడికి దూరం దూరంగా మోదీ.. నో స్మైల్‌, నో షేక్‌హ్యండ్‌
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌ నగరంలో ఫాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ తదితర నేతలు హాజరయ్యారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ప్రధాని పుట్టినరోజు.. రూ.8.5 లక్షలు గెలుచుకునే లక్కీ ఛాన్స్‌!
అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. ఢిల్లీలో ఓ రెస్టారెంట్‌ యజమాని ప్రధానీ నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా థాలి ఆఫర్‌ ప్రకటించాడు. తన హోటల్‌ని థాలి తింటే..రూ.8.5 లక్షల నగదు గెలుచుకువచ్చని బంపర్‌ ప్రకటించి ప్రధానిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. 45 ఏళ్ల తర్వాత సీడబ్ల్యూసీ పోస్టులకు ఎన్నికలు.. చివరకు కాంగ్రెస్‌కు ఇలాంటి స్థితి!
గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా కాంగ్రెస్‌లో మునుపెన్నడూ లేనంత సంక్షోభ స్థితి కనిపిస్తోంది. గాంధీ కుటుంబం డామినేషన్‌పై వ్యతిరేకత.. అసమర్థ నిర్ణయాల వల్లే ఇవాళ్టి పరిస్థితి నెలకొందని ఆరోపిస్తూ సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బ్లాక్‌ ఫ్రైడే, దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్‌ బాత్‌ 
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. అంతర్జాతీయప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక సూచీసెన్సెక్స్‌ ఏకంగా 1100 పాయింట్లకు పైగా కుప్పకూలింది. వారాంతంలో  దాదాపు రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. న్యూజిలాండ్‌తో సిరీస్‌.. కెప్టెన్‌గా సంజూ శాంసన్‌.. బీసీసీఐ ప్రకటన
న్యూజిలాండ్‌- ఏ జట్టుతో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. చెన్నై వేదికగా జరుగనున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ‘సకల గుణాభిరామ’ మూవీ రివ్యూ
బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయ్యాడు నటుడు విజే సన్నీ. అంతకు ముందే పలు సిరియల్స్‌తో పాటు సినిమాలలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు కానీ.. బిగ్‌బాస్‌ 5లో పాల్గొని విన్నర్‌గా నిలవడంతో సన్నీ పేరు రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసింది. బిగ్‌బాస్‌ షో తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘సకల గుణాభిరామ’. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. కనిపెంచిన తండ్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దేవుడా ఎంత శిక్ష వేసావయ్యా 
ఒక రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. తండ్రిని, భర్తను పోగొట్టుకున్న కుమార్తె ఒక వైపు, భర్తను, అల్లుడిని పోగొట్టుకున్న తల్లి మరొకవైపు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంట తడి పెట్టించాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement