Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం | Sakshi Breaking News Trending Topics Evening News Roundup 7th October 2022 | Sakshi
Sakshi News home page

Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Published Fri, Oct 7 2022 6:01 PM | Last Updated on Fri, Oct 7 2022 6:16 PM

Sakshi Breaking News Trending Topics Evening News Roundup 7th October 2022

1. మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమీక్షలో నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్‌మెంట్‌, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సార్‌ అర్బన్ క్లినిక్స్‌, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ తదితర అంశాలపై చర్చించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్‌ రెడ్డి
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో ఈడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు అశ్విత్‌ రెడ్డిని హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి రూ.40లక్షల చెక్కు అందజేసిన సీఎం కేసీఆర్‌
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా  పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్  బీ ఫామ్‌ను ప్రగతి భవన్‌లో శుక్రవారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మా టార్గెట్‌ అదే.. మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలే తమ టార్గెట్‌ అని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఈ దేశానికి గుదిబండ. 2024 తర్వాత కాంగ్రెస్‌ కనుమరుగయ్యే ఛాన్స్‌. ప్రధాని అసమర్థుడు, చేతకాని వారు’’ అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మోదీజీ.. ఆయనంటే మీకు ఎందుకంత భయం?
చైనా జిన్‌జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ఘర్లపై జరుగుతున్న మనవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు ముసాయిదా తీర్మానం వచ్చింది. అయితే దీనిపై చర్చకు జరిగిన ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మానవ హక్కుల పోరాటానికి ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి
మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉక్రెయిన్‌, రష్యాలకు చెందిన రెండు మానవ హక్కుల గ్రూప్‌లతో పాటు బెలారస్‌ మానవ హక్కుల కార్యకర్త అలెస్‌ బైలియాత్స్కీలకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. రష్యన్‌ మానవ హక్కుల సంస్థ మెమోరియల్‌, ఉక్రేనియన్‌ మానవ హక్కుల సంస్థ సెంటర్‌ ఫర్‌ లిబర్టీస్‌, బెలారస్‌ హక్కుల కార్యకర్త అలెస్‌ బైలియాత్స్కీల పేర్లను నోబెల్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేసింది.. బుకింగ్‌.. ఫీచర్లు, ధర వివరాలు
భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు  హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది.  విడా వీ1, వీ1 ప్రొ  అనే రెండు  వేరియంట్లలో దీన్ని  శుక్రవారం లాంచ్‌ చేసింది.  
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..?
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ఈ నెల 18న ముగియనున్న నేపథ్యంలో కొత్తగా ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే అంశంపై చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం విధితమే. చాలామంది ప్రస్తుత కార్యదర్శి జై షా బీసీసీఐ కొత్త బాస్‌ అవుతాడని.. బీసీసీఐ సారధి సౌరవ్‌ గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో నిలుస్తాడని భావించగా.. తాజాగా అధ్యక్ష పదవి రేసులో కొత్త పేరు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.  
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అనుష్కను దారుణంగా ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు, ఎందుకంటే..
బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది. తన కూతురు వామిక ఫొటోలను తీస్తున్న మీడియాపై అనుష్క అసహనం వ్యక్తం చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు!
కొన్ని పదార్థాలు (అలర్జెన్స్‌) మాత్రమే కాకుండా ఒక్కోసారి కొన్ని ఆహారాలూ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అయితే మరికొన్ని ఆహారపదార్థాలు ఆస్తమాను నివారిస్తాయి కూడా. ఆస్తమాను అదుపులో ఉంచుకోడానికి మనకు సరిపడని ఆహారాలకు దూరంగా ఉంటూ, ఆస్తమాను నివారించే వాటిని తీసుకోవడం మంచిది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement