1. గొటబాయకు ఎయిర్‌పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి.. చివరికి సైనిక విమానంలో..
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్ 32 అనే సైనిక విమానంలో బుధవారం వేకువ జామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. గొటబాయతో పాటు ఆయన సతీమణి, బాడీగార్డులు కలిపి మొత్తం నలుగురు ఈ విమానంలో దేశం దాటారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. అవి మోదీ మార్కు సింహాలు.. క్రూరంగా, కోపంగా కనిపించడం అవసరమా?
పార్లమెంట్ నూతన భవనంపై ప్రధాని మోదీ సోమవారం ఆవిష్కరించిన భారీ జాతీయ చిహ్నం(నాలుగు సింహాల)పై ప్రతిపక్షాలు, చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ చిహ్నాన్ని సైతం మోదీ ప్రభుత్వం వక్రీకరించిందని ఆరోపించారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. YSR Vahana Mitra: మూడేళ్ల కంటే మిన్నగా..
అర్హులైన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది ‘వైఎస్సార్ వాహనమిత్ర’ భరోసా లభించనుంది. 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది రూ.261.51 కోట్ల మేర డ్రైవర్లకు ప్రయోజనం కలగనుంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. వరద వేగాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు?
గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో తగ్గుతున్నా... ధవళేశ్వరంలో పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన లంకల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి.. దిగువకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ముందుగానే అంచనాకు వస్తారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు.. 64 ఏళ్ల రికార్డు బద్దలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు: ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు, రాజ కీయ పక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతుంటే.. ఈ చర్చతో సంబంధం లేకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. బుమ్రా బౌలింగ్.. రోహిత్ బ్యాటింగ్; టీమిండియా ఘన విజయం
ఆకాశం మబ్బులు పట్టి ఉంది, పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది కాబట్టి ఫీల్డింగ్ ఎంచుకున్నానంటూ టాస్ సమయంలో రోహిత్ తమ పేసర్లపై ఉంచిన నమ్మకాన్ని వారు గొప్పగా నిలబెట్టారు. స్వింగ్‌తో చెలరేగిన మన పేసర్ల అద్భుత బౌలింగ్ ముందు ప్రపంచ చాంపియన్ తలవంచింది. లైనప్‌లో ఒక్కో ఆటగాడి పేరు, ఇటీవలి ఫామ్ చూస్తే ఈ టీమ్ కనీసం 350 పరుగులు చేస్తుందేమో అనిపించగా, వంద దాటేందుకు కూడా ఆపసోపాలు పడింది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. సమ్మర్ వార్ కు సై అంటున్న హీరోలు.. బరిలో 7 పెద్ద సినిమాలే!
సినిమాలకు మంచి సీజన్ అంటే సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి... ఈ ఏడాది సమ్మర్ ముగిసింది. ఇక 2023 వేసవి బరిలో నిలిచేందుకు భారీ సినిమాలు రెడీ అవుతున్నాయి. డేట్‌ని ఫిక్స్ చేయకపోయినా వేసవి బరిలో నిలిచేందుకు ముందుగానే కర్చీఫ్ వేసేస్తున్నారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. టాటా ఎలక్ట్రిక్ కారు, ఒకసారి చార్జింగ్ చేస్తే 312కి.మీ ప్రయాణం!
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా నెక్సన్ ఈవీ ప్రైమ్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.14.99–17.5 లక్షల మధ్య ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే కారు 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. 129 పీఎస్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఏసీ మోటార్, 30.2 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు ఉంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్ ఫ్యూజ్‌కు తాకడంతో..
వెలుగులు నింపే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment