1. Kadem Project: కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం
కడెం ప్రాజెక్ట్‌కు పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది. వరద నీరు తగ్గడంతో ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి.. నీతి ఆయోగ్ ప్రశంస
నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అట్టడుగు స్థాయి నుంచి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నవరత్నాలను ఏకీకరణ చేసి అమలు చేస్తోందని నీతి ఆయోగ్ పేర్కొంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. వలంటీర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం
నాగార్జున యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలంటీర్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున బుధవారం ఆర్థిక సాయం అందించారు. వలంటీర్ కుటుంబ సభ్యులకు రూ 10 లక్షల చెక్కు అందజేశారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘ఫిట్‌నెస్’ పెనాల్టీ మినహాయింపు.. ఇకనైనా నిర్లక్ష్యం వీడతారా..?
రవాణా వాహన యజమానులకు పెద్ద ఊరట. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుము విధింపు నుంచి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దాదాపు రెండు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. బ్రిటన్ ప్రధాని పీఠం: తొలి రౌండ్ రిషిదే.. గట్టి పోటీ ఇస్తున్న పెన్నీ
బ్రిటన్ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ (42) దూసుకెళ్తున్నారు. బుధవారం తొలి రౌండ్ ముగిసే సరికి ఆయన అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను సాధించారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. పళనిస్వామికి కొత్త తలనొప్పి.. కలకలం రేపిన రహస్య సంభాషణ
మొన్నటి వరకు పన్నీర్‌సెల్వంతో పోరాడిన ఎడపాడి పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుంచి పొన్నయ్యన్‌ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు పొన్నయన్‌తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. భారత్ జోరును ఆపతరమా!
బర్మింగ్‌హామ్ టెస్టు ఫలితం తర్వాత ఇంగ్లండ్ జట్టు ఊహించి ఉండకపోవచ్చు తాము టి20 సిరీస్ కోల్పోతామని...ఊహించకపోవచ్చు తొలి వన్డేలో ఇంత ఘోరంగా ఓడతామని...బుమ్రా స్వింగ్ బౌలింగ్ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని అంచనా వేసి ఉండకపోవచ్చు...కానీ ఇప్పుడు వారికి టీమిండియా అసలు సత్తా ఏమిటో తెలిసొచ్చింది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్..
టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలిగి పోతున్న నటి పూజా హెగ్డే. చిన్న గ్యాప్ దొరికినా విహారయాత్రకు బయలుదేతుంది. తాజాగా మూడు ఖండాలు.. నాలుగు నగరాలు.. ఒక నెల అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది ఈ భామ.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. 2021–2022: 41 నగరాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు!
హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంది. ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో 2021–22లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన రెసిడెక్స్ సూచీ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. రోల్ మోడల్: తొలి ఇండియన్ అమ్మాయిగా చరిత్ర సృష్టించనున్న రిజా
వయసుకు తగ్గట్టుగా మానసికంగా, శారీరకంగా పరిపూర్ణంగా ఎదగని పిల్లల...మాట, నడక, నవ్వు సాధారణ పిల్లలకంటే విభిన్నంగా ఉంటుంది. కొంతమంది అయితే ఒకటీ రెండు మాటలు కూడా స్పష్టంగా పలకడం కూడా కష్టమే. అటువంటిది డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతోన్న రిజా రేజి ఏకంగా ప్రీమియర్ ఫ్యాషన్ షోకు ఎంపికైంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment