మార్నింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌ | Morning Top 10 Telugu News Latest Updates Telugu Online News 17th July 2022 | Sakshi
Sakshi News home page

Morning Top 10 News: మార్నింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌

Jul 17 2022 9:59 AM | Updated on Jul 17 2022 10:18 AM

Morning Top 10 Telugu News Latest Updates Telugu Online News 17th July 2022 - Sakshi

టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆడియో కలకలం రేపుతోంది. ఆ ఆడియోలో అచ్చెన్న మరొకరి సంభాషణ గూడు పుఠానీలా ఉంది. సంతమ్మాళి మండలం కోటపాడు–కొత్తూరు గ్రామ వాసి మృతి వెనుక కుట్రే ఏదో దాగి ఉంద ని తెలుస్తోంది. 

1. పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్‌ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..?
నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం.. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదో అంశంపై వేడి వేడిగా చర్చ జరుగుతోంది. ప్రఖ్యాత సోషలిస్టు నేత రామ్‌ మనోహర్‌ లోహియా ఆగ్రహంతో.. ‘ప్రధాని నెహ్రూ మొఘల్‌ చక్రవర్తుల కోర్టుల్లో చప్రాసీలుగా పనిచేసిన వంశం నుంచి వచ్చినవాడు..’ అని మాట తూలారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Atchannaidu: అచ్చెన్నాయుడు ఆడియో కలకలం
టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆడియో కలకలం రేపుతోంది. ఆ ఆడియోలో అచ్చెన్న మరొకరి సంభాషణ గూడు పుఠానీలా ఉంది. సంతమ్మాళి మండలం కోటపాడు–కొత్తూరు గ్రామ వాసి మృతి వెనుక కుట్రే ఏదో దాగి ఉంద ని తెలుస్తోంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Godavari Floods 2022: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం
భద్రాచలం నుంచి వస్తున్న వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండడంతో గోదారమ్మ అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భీతిగొలిపేలా విశ్వరూపం ప్రదర్శిస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పెట్టుబడుల వాస్తవరూపంలో ఏపీ నంబర్‌ 1
రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఘనంగా లష్కర్‌ బోనాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున  4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. MLA Seethakka: సీతక్కకు తప్పిన ప్రమాదం
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకు శనివారం ఆమె ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి జంపన్నవాగు మీదుగా పడవలో వెళ్లారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ENG vs IND: విజయంతో ముగించేందుకు...
ఇంగ్లండ్‌ గడ్డపై భారత జట్టు పర్యటన చివరి అంకానికి చేరింది. గత ఏడాది అర్ధాంతరంగా ఆగిన టెస్టు సిరీస్‌ను ఈ నెలారంభంలో ఓటమితో ముగించిన టీమిండియా ఆపై టి20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. 'ఇదేం పద్ధతయ్యా.. ఎలాన్‌ మస్క్‌ కొత్త రగడ'
ఎలాన్‌ మస్క్‌.. మైక్రో బ్లాగింగ్‌ దిగ్గజం ట్విట్టర్‌ల మధ్య కొనుగోలు వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మస్క్‌ను ట్విట్టర్‌ తరుపు లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్‌ ఎలా పొందారని మస్క్‌ను ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Shabaash Mithu: సండే సినిమా ఉమన్‌ ఇన్‌ బ్లూ
‘మెన్‌ ఇన్‌ బ్లూ’ అంటే భారత క్రికెట్‌ జట్టు. అంటే మగ జట్టు. క్రికెట్‌ మగవారి ఆట. క్రికెట్‌ కీర్తి మగవారిది. క్రికెట్‌ గ్రౌండ్‌ మగవారిది. కాని ఈ ఆటను మార్చే అమ్మాయి వచ్చింది. ‘మెన్‌ ఇన్‌ బ్లూ’ స్థానంలో ‘ఉమెన్‌ ఇన్‌ బ్లూ’ అనిపించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఐటీ రాజధానిలో హైటెక్‌ మయసభ..!
ఇరవై అంతస్తుల భవనం...వేల మంది ఉద్యోగులు.. వందల సంఖ్యలో కార్లు! నేలపై.. భూగర్భంలోనూ పార్కింగ్‌! హైటెక్‌ యుగంలో ఏ ఐటీ ఆఫీసును తీసుకున్నా ఇలాగే ఉంటుంది! ఇలాంటి ఆఫీసులో మిత్రుడిని కలిసేందుకు వెళ్లారనుకోండి... పార్కింగ్‌ స్థలం వెతుక్కునేందుకు పదిహేను నిమిషాలు.. సెక్యూరిటీ వ్యవహారాల పూర్తికి ఇంకొన్ని నిమిషాలు.. రిసెప్షన్‌లోనో.. క్యాంటీన్‌లోనో పడిగాపులు..ఇదీ తంతు! వందేళ్ల రాబర్ట్‌ బాష్‌ కంపెనీలో మాత్రం దీనికి భిన్నం!
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement