Sakshi Telugu Breaking News Today: Online Telugu News On 06th September 2022 - Sakshi
Sakshi News home page

Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Published Tue, Sep 6 2022 10:03 AM | Last Updated on Tue, Sep 6 2022 10:45 AM

Sakshi Telugu Breaking News Online Telugu News Today 06th September 2022

1. దశాబ్దాల స్వప్నం సాకారం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన òనెల్లూరు బ్యారేజీను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఎస్పీ సీహెచ్‌ విజయారావు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Rain Alert: 9న అల్పపీడనం! రాష్ట్రంలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 48 గంటల అనంతరం అంటే ఈ నెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్‌!
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు కాకుండా జనవరిలో జరిగితే పార్టీకి మరింత ప్రయోజనమని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలు ఈ అభిప్రాయంతో ఉన్నట్టు పార్టీవర్గాల సమాచారం.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అప్పుడేమో పెళ్లై పిల్లలు పుట్టాక.. ఇప్పుడేమో అప్లికేషన్‌ పెడ్తేచాలు..
మునుగోడు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరవుతోంది. వివాహమైన ఏడాదికో రెండేళ్లకో, పిల్లలు పుట్టాక వచ్చే కల్యాణలక్ష్మి చెక్కులు.. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటికి సంబంధించిన చకచకా సాగిపోతోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. జింబాబ్వేను వణికిస్తున్న మీజిల్స్ వ్యాధి.. 700 మంది చిన్నారులు మృతి
జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. యాత్రతో రాత మారేనా?
ఎన్నికల్లో వరుస పరాజయాలు.. కీలక నేతల నిష్క్రమణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’కు బుధవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. రోహిత్‌, కోహ్లి కాదు.. వరల్డ్‌ టాప్‌-5 టీ20 ఆటగాళ్లు వీరే!
ఆస్ట్రేలియా వేదికగా జరగన్న టీ20 ప్రపంచకప్‌-2022కు సమయం దగ్గర పడతుండడంతో ఆయా జట్లు తమ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ మెగా ఈవెంట్‌కు ముందు ధ్వైపాక్షిక సిరీస్‌లతో జట్లు బీజీ బీజీగా గడపనునున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. టెలికం కంపెనీలకు ‘సిమ్‌’ పోటు.. ఈ– సిమ్‌ పంచాయితీ!
టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్‌ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్‌ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్‌డౌన్‌లతో సెమీకండక్టర్‌ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను వేధిస్తోంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. బాత్రూంలో ‘హెయిర్స్‌’ లొల్లి.. అతి చేసిన గీతూ!
పక్కా లోకల్ పాటతో నిద్రలేచారు ఇంటి సభ్యులు. అభినయ శ్రీ తన మాస్‌ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇంతలోనే గలాట గీతూ బాత్రూం గొడవ మొదలుపెట్టేసింది. బాత్రూంలో ఎవరివో హెయిర్స్‌ ఉన్నాయని, తలస్నానం చేసినప్పుడు ఎవరి హెయిర్స్‌ వాళ్లే తీసి పడేయాలి, బిగ్‌బాస్‌ తనకు ఈ టాస్క్‌ ఇచ్చినా చేయనని చెప్పుకొచ్చింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. హైదరాబాద్‌ వైద్య విద్యార్థినిపై పుదుచ్చేరిలో లైంగిక దాడి యత్నం
వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడి ప్రయత్నం కేసులో పుదుచ్చేరి పోలీసుతో పాటు అతని స్నేహితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జిప్మర్‌ వైద్య విద్యాలయం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement