
1. AP Assembly: ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ గట్టి షాక్..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఒడిశా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ బాధ్యతల్లో కోతలు విధించగా తాజాగా ఛత్తీస్‌గఢ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని పూర్తిగా తప్పించారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. గాడి తప్పిన గురుకులం! ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడిన వాస్తవాలు
రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంక్షేమ గురుకులాలు గాడి తప్పాయి. నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సదుపాయాలు సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. పాన్ ఇండియా పార్టీ.. దసరాకు విడుదల!
జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దసరాను ముహూర్తంగా ఎంచుకున్నారు. విజయదశమి రోజున హైదరాబాద్ వేదికగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. Regional Ring Road: రాయగిరి రైతులకు కష్టాల ‘రింగ్’! బతికేదెట్లా?
అది రాయగిరి గ్రామం.. చుట్టూ పొలాలు, చేన్లతో కళకళాడేది.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు, హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉంటుంది. ఆ ప్రధాన రహదారి విస్తరణ కోసం గ్రామంలో కొంతమేర పొలాలు, భూములు పోయాయి.. అభివృద్ధి కోసమేకదా అనుకున్నారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. రాకుమారునిగా వెళ్లి... రాజుగా లండన్‌కు చార్లెస్
రాణి ఎలిజబెత్–2 ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే గురువారం ఉదయం రాకుమారుని హోదాలో లండన్ వీడిన చార్లెస్, ఆమె మరణానంతరం శుక్రవారం బ్రిటన్ రాజు హోదాలో తిరిగి రాజధానిలో అడుగు పెట్టారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. ఆగండి.. ఒక్క క్షణం ఆలోచించండి!
కష్టమనేది లేని రోజంటు లేదు కదా.. కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా’ అన్నారో సినీ కవి. ఇది అక్షర సత్యం. ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదనేది జీవితం నేర్పిన పాఠం.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. ఆస్ట్రేలియా కెప్టెన్ సంచలన నిర్ణయం.. వన్డేలకు గుడ్‌బై
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం విలేకరుల సమావేశంలో ఫించ్ వెల్లండించాడు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. టాలీవుడ్‌లో విషాదం.. ‘మహర్షి’ ఫేం నటుడు గురుస్వామి మృతి
‘మహర్షి’ ఫేం నటుడు, కర్నూలుకు చెందిన మిటికిరి గురుస్వామి (80) శుక్రవారం సాయంత్రం మరణించారు. ఆయనకు 15 రోజుల కిందట బ్రె యిన్ స్ట్రోక్ రాగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చికిత్స పొంది, మూడు రోజుల కిందట కర్నూలు బాలాజీనగర్‌లోని స్వగృహానికి వచ్చారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. డిజిటల్ లెండింగ్ నిబంధనలు..వినియోగ హక్కుల పరిరక్షణ కోసమే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన డిజిటల్ లెండింగ్ నిబంధనలు వినియోగ హక్కుల పరిరక్షణకు అలాగే రెగ్యులేటరీ పరమైన అడ్డంకులను అధిగమించడానికి ఉద్దేశించినవి డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పేర్కొన్నారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment