
1. ‘నీట్–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
నీట్–అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్‌కు చెందిన తనిష్క టాప్ ర్యాంకు దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ మూడో ర్యాంకు సాధించారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. నాడు – నేడు స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’ స్కూళ్లు
విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా తాజాగా కేంద్ర ప్రభుత్వానికీ స్ఫూర్తిదాయకమైంది. నాడు – నేడు తరహాలో అన్ని సదుపాయాలతో ‘పీఎం శ్రీ’ పేరిట కొత్తగా స్కూళ్లను ప్రారంభించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలున్నాయని తెలిపింది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. NEET Result 2022: జాతీయ స్థాయి ర్యాంకు లక్ష వచ్చినా తెలంగాణలో సీటు.. నీట్ నిపుణుల విశ్లేషణ ఇదే
వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అందులో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. Nims Hospital: ‘నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్సా?’
నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌కు ఛాతీ నొప్పి రావడంతో అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్న వార్త వినడానికే విచిత్రంగా ఉందని ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేశ్ అభిప్రాయపడ్డారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. రూ.27,360 కోట్లతో ‘పీఎం–శ్రీ’
ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం–శ్రీ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం–శ్రీ యోజన, పీఎం గతిశక్తికి సంబంధించిన రైల్వే ల్యాండ్ పాలసీ సవరణకు ఆమోదం తెలిపారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు
బ్రెజిల్‌లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏముందంటారా? చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!!
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. పాకిస్తాన్ ఫైనల్‌కు.. టీమిండియా ఇంటికి
భారత్ అభిమానుల్లో ఆశలు రేపేలా ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్‌లో చివరకు పాకిస్తానే వికెట్ తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. దీంతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాక్, శ్రీలంక జట్లు ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు రెండేసి విజయాలు సాధించగా, ఆడిన రెండూ ఓడిన భారత్, అఫ్గానిస్తాన్ ఆసియా కప్ టి20 టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ విడుదల, ధర ఎంతంటే!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ గురించి ఫీచర్లు, వాటి ధరల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. డైరెక్టర్‌తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈషా రెబ్బా?
టాలీవుడ్ బ్యూటీ, తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్తుల నెట్టింట చర్చనీయాంశమవుతున్నాయి. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది ఈషా.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment