Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌ | Morning Top 10 News 25th November 2022 | Sakshi
Sakshi News home page

Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

Published Fri, Nov 25 2022 9:45 AM | Last Updated on Fri, Nov 25 2022 10:30 AM

Morning Top 10 News 25th November 2022 - Sakshi

1. ఏపీ రైతులకు గుడ్‌ న్యూస్‌.. 28న అకౌంట్లలో నగదు జమ
2022 ఖరీఫ్‌ సీజన్‌లో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఆ సీజన్‌ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ‘పండంటి’ రాష్ట్రం.. దేశంలోనే ఏపీ అగ్రగామి
ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే అన్నదాత అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. పండ్ల తోటలు తగ్గిపోతున్న తరుణంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులను ఉత్సాహపరుస్తున్నాయి.
👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. ఆ లాకర్స్‌లో ఏమున్నాయి?
తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, భాగస్వాములపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనంగా మారింది.
​​​​​​​👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి
అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో తీవ్ర నష్టం కలుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు.
​​​​​​​👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. యువతరం.. ఎవరి పక్షం...!
ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా అందరి దృష్టి యువతపైనే. ప్రధాని మోదీకి యువతలో క్రేజ్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పులో కాస్త మార్పు కనిపించింది. ఈ సారి యువ ఓటర్ల మదిలో ఏముందో తెలుసుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. 
​​​​​​​👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. పక్షులు చూపిన ‘బుల్లెట్‌’ మార్గం.. నిజమే.. ఆ కథేంటంటే
జపాన్‌ అంటేనే టెక్నాలజీకి మారుపేరు.. సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకూ మూలం. గంటకు నాలుగైదు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్‌ రైళ్లు ఆ దేశానికి ప్రత్యేకం. 
​​​​​​​👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఓటీటీలకు షాక్‌: సీవోఏఐ కొత్త ప్రతిపాదన 
ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ) కమ్యూనికేషన్స్‌ సేవలు అందించే సంస్థలకు కూడా లైసెన్సింగ్‌ విధానం, తేలికపాటి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ ఉండాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. 
​​​​​​​👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ‘తోడేలు’ మూవీ రివ్యూ
తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్‌ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్‌కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్‌ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్‌ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
​​​​​​​👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
పోర్చ్‌గల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఐదు వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు.
​​​​​​​👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

​​​​​​​

10. కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్‌.మురవణి నాలుగవ మైలు రాయి వద్ద గురువారం చోటుచేసుకుంది.
​​​​​​​👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement