Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం | Sakshi Telugu Breaking News Online Telugu News Today 12th August 2022 | Sakshi
Sakshi News home page

Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Published Fri, Aug 12 2022 10:00 AM | Last Updated on Fri, Aug 12 2022 10:28 AM

Sakshi Telugu Breaking News Online Telugu News Today 12th August 2022

1. సీఎం వైఎస్‌ జగన్‌ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల
ఉద్యోగంలో చేరిన దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎంపీడీవోలకు పదోన్నతులు లభించాయి. 12 మంది జెడ్పీ డిప్యూటీ సీఈవోలుగా, మరో 225 మంది డీఎల్‌డీవో స్థాయి హోదాలో ఒకేసారి 237 మంది ఎంపీడీవోలు గురువారం పదోన్నతుల పత్రాలను స్వీకరించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా!
పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది జూలై రెండో వారంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. టీఆర్‌ఎస్‌లో రోజుకో జిల్లాలో అసమ్మతి రాజకీయం.. ఇప్పుడు వికారాబాద్‌ పంచాయితీ!
టీఆర్‌ఎస్‌లో రోజుకో జిల్లాకు సంబంధించిన అసమ్మతి రాజకీయం ప్రగతిభవన్‌కు చేరుకుంటోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గ నేతలు బుధవారం ప్రగతిభవన్‌ మెట్లెక్కారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఇంజనీరింగ్‌లో సీట్లపై ఉత్కంఠ! పదివేలు దాటినా సీఎస్సీ పక్కా
తెలంగాణ ఎంసెట్‌ రాసిన 1.56 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఇంజనీరింగ్‌లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో.. ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో సీటు దొరుకుతుంది? కోరుకున్న బ్రాంచ్‌లో సీటు రావాలంటే ఎంత ర్యాంకు రావాలి?
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. యంగిస్తాన్‌!
నరాల బిగువు, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించే మేధో సంపత్తితో కూడిన యువ శక్తి భారత దేశ సొంతం. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత యువ జనాభా మన దగ్గరుంది. మన దేశ సగటు వయసు కేవలం 28 ఏళ్లు! 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అనుక్షణం ఆచరిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదిగిన మిమ్మల్ని సదా అనుసరిస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ శ్లాఘించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. మరో సంస్థను అమ్మకానికి పెడుతోన్న కేంద్రం!
మెటల్‌ రంగ దిగ్గజం హిందుస్తాన్‌ జింక్‌లో ప్రభుత్వానికిగల వాటా విక్రయ నిర్వహణను చేపట్టేందుకు మర్చంట్‌ బ్యాంకర్‌ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. 6 ఏళ్ల తర్వాత భారత్‌తో సిరీస్‌.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్‌ దూరం!
స్వదేశంలో టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే క్రికెట్‌ బోర్డు గురువారం  ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌కు కూడా జింబాబ్వే రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ గాయం  కారణంగా దూరమయ్యాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. విషాదం.. గుండెపోటుతో ప్రముఖ సింగర్‌ కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్‌, నేషనల్‌ అవార్డు విన్నర్‌ శివమొగ సుబ్బన్న(83) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. అన్నా.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే..
 ‘అన్నా.. నువు నన్ను వదిలి వెళ్లిపోయావు.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే.. ఈ రోజే రాఖీ కొని తీసుకువచ్చాను.. ఒక్కగానొక్క అన్నవు.. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోతే ఎలా.. అన్నా..’ అంటూ మృతుడి సోదరి ఉపాసన రోదించిన తీరు కంటతడి పెట్టిచ్చింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement