Top News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 12th July 2022 | Sakshi
Sakshi News home page

Top News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Tue, Jul 12 2022 9:42 AM | Last Updated on Tue, Jul 12 2022 10:27 AM

Top10 Telugu Latest News Morning Headlines 12th July 2022 - Sakshi

1..బురద జల్లడమే జనవాణి అజెండా
దున్నపోతు ఈనిదంటే.. దూడను గాటన కట్టేయమన్న తరహాలో విపక్ష టీడీపీ, జనసేన, వాటికి కొమ్ముకాసే మీడియా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా రాజకీయ రంగు పులిమి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం వారికి రివాజుగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాజాగా నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమమే ఇందుకు నిదర్శనం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2..అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం
వర్ష బీభత్సం, 16 మంది భక్తుల దుర్మరణాలతో ఈ నెల 8 నుంచి తాత్కాలికంగా ఆగిన అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం తిరిగి మొదలైంది. 12వ బ్యాచ్‌ కింద 4,236 మంది యాత్రికులు దర్శనానికి బయల్దేరారు. వీరంతా మంగళవారం ఉదయానికల్లా గుహకు చేరతారని అధికారులు వెల్లడించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. లంకకు 20న కొత్త అధ్యక్షుడు
కనీవినీ ఎరగని సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స (73) పలాయనం, ప్రధాని రణిల్‌ విక్రమసింఘె (73) రాజీనామా ప్రకటన నేపథ్యంలో అన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కానుండటం తెలిసిందే. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. విదేశీ విద్యా వరం... ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ
రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5..Telangana Rains: వానలు డబుల్‌! సాధారణంతో పోలిస్తే రెట్టింపు వర్షపాతం
మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది
ఇవల విరాట పర్వం చిత్రంతో అలరించిన సాయి పల్లవి తాజాగా ‘గార్గి’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ జూలై 15న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మనుసుని బాగా కదిలించిన కథ ఇది అని పేర్కొంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా ఇదే.. ఆంధ్ర అమ్మాయికి చోటు
ఈ నెల 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్‌ జట్టును ప్రకటించారు. టి20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులుగల భారత జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి సబ్బినేని మేఘనకు కూడా జట్టులో చోటు లభించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వర్‌ అయ్యర్‌ బాధ్యతలు!
నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జూన్‌ 30న పదవీ విరమణ చేసిన అమితాబ్‌ కాంత్‌ స్థానంలో అయ్యర్‌ తాజా బాధ్యతలు చేపట్టారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9..Gita Gopinath: ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన భారతీయురాలు.. తొలి మహిళగా రికార్డు 
‘అర్థం కావాలేగానీ ఆర్థికశాస్త్ర విషయాలు చందమామ కథల కంటే ఎక్కువగా ఆకర్షిస్తాయి’ అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదుగానీ, గీతా గోపీనాథ్‌కు ఆర్థికశాస్త్రం అనేది శ్వాస! సివిల్‌ సర్వీసులలో చేరాలనేది తన మొదటి కల. అయితే ఆర్థికశాస్త్రంపై ఆసక్తి ఆమెను వేరే దారిలోకి తీసుకెళ్లింది. ప్రపంచ ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన చేర్చింది... 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.. గుంటూరులో లోన్‌ యాప్‌ వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
లోన్‌ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్‌ బుల్స్‌, రూపెక్స్‌ యాప్స్‌ నుంచి రూ.20,000 లోన్‌ తీసుకుంది. రూ.20 వేల రుణానికి లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని, లేకుంటే న్యూస్‌ ఫోటోస్‌ పెడతామని కేటుగాళ్లు బెదిరించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement