1. YSRCP Plenary 2022: వన్స్‌మోర్ జగనన్న
‘వన్స్‌మోర్ జగనన్న’ అన్నదే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని మహిళల నినాదం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమం, రక్షణ, సాధికారికతలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన సీఎం వైఎస్ జగన్‌ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మహిళలందరిపై ఉందన్నారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. AP CM YS Jagan: అమర్‌నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి
అమర్‌నాథ్‌లో కుండపోత వాన, అకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. జర పైలం.. రెండ్రోజులు.. జోరు వాన!
నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, దానికి తోడుగా ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వాన పడింది. వాగులు వంకలు ఉప్పొంగాయి.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. గమనించాలి: పోలీస్ ఫోన్ నెంబర్లు మారనున్నాయ్!
ప్రస్తుతం సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ కంటే తక్కువ ధరకు ఎక్కువ సదుపాయాలు ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో పోలీసు విభాగం ఫోన్లు ఎయిర్‌టెల్‌కు మారనున్నాయని కొత్వాల్ సీవీ ఆనంద్ శుక్రవారం పేర్కొన్నారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది
ఉక్రెయిన్ తమ షరతులకు త్వరగా ఒప్పుకోకుంటే మరింత విధ్వంసం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు. తామింకా పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభించనే లేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ఐదు నెలలుగా కొనసాగుతున్న వేళ ఆయన ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. IND vs ENG 2nd T20: సిరీస్ విజయమే లక్ష్యంగా... కోహ్లికి పరీక్ష!
ఆతిథ్య ఇంగ్లండ్‌పై తొలి టి20లో పైచేయి సాధించిన భారత్ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి భారీ తేడాతో నెగ్గిన టీమిండియా అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే ఇంగ్లండ్‌ను మరోసారి దెబ్బ తీయవచ్చు. అయితే అనూహ్య ఓటమి నుంచి కోలుకొని సిరీస్ కాపాడుకునేందుకు బట్లర్ బృందం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. OTT-Web Series: సినిమాతో చెప్పలేని కథలను.. ఓటీటీలో చెప్పేందుకు సై అన్న స్టార్స్
సినిమాని థియేటర్లో చూస్తే ఆ అనుభూతే వేరు అని సినీ ప్రముఖులు అంటుంటారు. ఇది నిజమే. అయితే సినిమాలో చెప్పలేని కొన్ని కథలు ఉంటాయి. అవి ఓటీటీలో చెప్పడానికి కుదురుతాయి. ఇలాంటి కథలకు స్టార్స్ ఓకే చెప్పి, ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. అందరికీ వృద్ధి ఫలాలు అందడమే అసలైన అభివృద్ధి
సమ్మిళిత వృద్ధి (అందరికీ వృద్ధి ఫలాలు చేరేలా) లేకుండా అసలైన వృద్ధి సాధ్యపడదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు ఈ దిశగా తీసుకున్నట్టు చెప్పారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. మధ్యాహ్నం పూట పడుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
మధ్యాహ్నం పూట ఒక గంట పాటు నిద్రించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. అలాగే మధ్యాహ్నం నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని, శరీరం చురుగ్గా ఉండటానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. గుజరాత్‌లో వరుణ విలయం
దక్షిణ గుజరాత్‌లో శుక్రవారం భీకర వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు ఎడతెరిపిలేని వాన కారణంగా జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జామ్‌నగర్, దేవభూమి ద్వారక, జునాగఢ్ జిల్లాలో కుండపోత వాన కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment