Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం | Sakshi Telugu Breaking News Online Telugu News Today 2nd August 2022 | Sakshi
Sakshi News home page

Morning Top 10 News: తెలుగు తాజా వార్తలు 10

Published Tue, Aug 2 2022 10:01 AM | Last Updated on Tue, Aug 2 2022 10:28 AM

Sakshi Telugu Breaking News Online Telugu News Today 2nd August 2022

1. అల్‌ఖైదా చీఫ్ అల్‌ జవహరి హతం... వెల్లడించిన జో బైడెన్‌
అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని  కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపి అతడ్ని హతమార్చింది. అల్‌ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అక్టోబర్‌ 2న ‘సెల్యూట్‌ సీఎం సర్‌’
సచివాలయ ఉద్యోగులు అక్టోబర్‌ 2న ప్రతి సచివాలయం పరిధిలో సెల్యూట్‌ సీఎం సర్‌ కార్యక్రమం నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా పిలుపునిచ్చారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఇతర శాఖల్లోకి వీఆర్వోలు, జీవో జారీ.. భగ్గుమన్న జేఏసీ నేతలు
రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల) శకం ముగిసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న 5,385 మందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఒక్కరోజే రూ.1,383.34 కోట్ల పింఛన్ల పంపిణీ
రాష్ట్రంలో అవ్వాతాతలతోపాటు వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు తదితరులకు ప్రభుత్వం సోమవారం ఒక్క రోజే రూ.1,383.34 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారం.. ఎటూ తేల్చని కాంగ్రెస్ హైకమాండ్‌
మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. ఈ విషయంలో పార్టీపరంగా రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు ఉంటాయంటూ ఊహాగానాలు వెలువడ్డా కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం మరో రెండు, మూడు రోజులపాటు వేచిచూసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. యూపీలో తేలియాడే రామసేతు రాయి! భక్తుల పూజలు
ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్‌ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం జరుగుతోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బెంబేలెత్తించిన విండీస్‌ బౌలర్‌.. టీమిండియా ఓటమి
వరుసగా నాలుగు పరాజయాల తర్వాత వెస్టిండీస్‌ ఎట్టకేలకు బోణీ కొట్టగలిగింది. టీమిండియాతో సోమవారం ఆలస్యంగా జరిగిన రెండో టి20 వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి(59) కన్నుమూశారు. బాబూరాజ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కేరళలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవికరించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే!
ప్రయివేట్‌ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలు, పథకాలలో దాదాపు 13 కోట్లమంది ఇన్వెస్టర్లు ఇరుక్కున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ పార్లమెంటులో వెల్లడించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. అమానవీయ ఘటన: బైక్‌పై తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు!
ఆస్పత్రిలో శవ వాహనం లేకపోవడంతో ప్రైవేట్‌ వాహనదారులకు రూ.5 వేలు చెల్లించుకోలేక తల్లి మృతదేహాన్ని ఓ పేద యువకుడు ఏకంగా 80 కిలోమీటర్లు బైక్‌ మీదనే తీసుకెళ్లాడు! బెడ్‌షీట్లో చుట్టిన తల్లి శవాన్ని 100 రూపాయలతో కొన్న చెక్కపై పెట్టి బైక్‌కు కట్టి, మరొకరిని వెనక కూచోబెట్టి నడుపుకుంటూ వెళ్లాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement