1. ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రికి వన్ జన్‌పథ్‌లో బస చేసి, 7వ తేదీ (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. రివర్స్ ప్లాన్‌తో గేర్ మార్చిన కేసీఆర్.. మునుగోడుపై అదిరిపోయే వ్యూహం!
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిపై ముందే అప్రమత్తమైన కాంగ్రెస్ శుక్రవారం ఆ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించి శంఖారావం పూరించింది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. 24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్.. రూ.10 వేల తక్షణ సాయం, వీల్ ఛైర్ అందజేత
వచ్చే నెల నుంచి బాలుడు వికలాంగ పింఛన్ అందుకునేలా గురువారం మంజూరు పత్రం అందజేసినప్పటికీ, సీఎం ఆదేశాలతో 24 గంటలు తిరక్కుండానే శుక్రవారం పింఛన్ సొమ్ము అందజేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం సచివాలయంలో నక్కా ధర్మతేజకు ఎంపీడీఓ జె.రాంబాబు, సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యంలు పింఛన్ అందజేశారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. రేవంత్ ‘హస్త’వాసి బాగోలేదు.. తెరపైకి సంచలనలతో సీనియర్లు క్యూ!
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కల్లోలం రేపుతున్నాయి. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. అక్కడ 52 ఏళ్లుగా ఎగరని జాతీయ జెండా.. మోదీ జీ మీరైనా చెప్పండి ప్లీజ్!
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు జాతీయ జెండాను కొరియర్‌లో పంపారు ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మార్కం. ఖాదీతో తయారు చేసిన ఆ త్రివర్ణ పతాకాన్ని మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎగురవేయాలని కోరారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. కరోనా ఎంత పనిచేసింది.. ప్రతీ 8 మందిలో వారికి ఈ లక్షణాలు!
కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిపై ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందట. శ్వాసకోస సమస్యలు, నీరస, రుచి, వాసన తెలియకపోవడం వంటి వ్యాధి లక్షణాల్లో కనీసం ఒక్కటైనా వారిని చాలాకాలం బాధిస్తున్నట్టు లాన్సెట్ జర్నల్ శుక్రవారం విడుదల చేసిన తాజా సర్వే పేర్కొంది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. రాతపూర్వకంగా కూడా తలాక్ చెల్లదు.. తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు
నోటి మాటగా మూడుసార్లు తలాక్ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్‌నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని, వివాహం రద్దుకాదని హైకోర్టు తేల్చి చెప్పింది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. నాలుగో టి20.. గెలిస్తే సిరీస్ వశం
అమెరికా గడ్డపై సిరీస్ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నేడు వెస్టిండీస్‌తో నాలుగో టి20లో తలపడనుంది. నేడు, రేపు వరుసగా జరిగే రెండు మ్యాచ్‌ల్లో భారత్ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం చాలు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. రిస్క్‌గా మారిన రీమేక్స్.. ఇష్టం లేకున్నా మళ్లీ మళ్లీ!
టాలీవుడ్ అంటేనే రీమేక్స్ అడ్డా. వేరే ఇండస్ట్రీస్‌లో సూపర్ హిట్టైన సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. ప్రస్తుతం చిరు మాలీవుడ్ బ్లాక్ బస్టర్ లూసీఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. మూఢ విశ్వాసం: ఆడపిల్ల దున్నితే అరిష్టమట! మహమ్మారి కమ్ముకుంటుందట!
రెండు రోజుల క్రితం జార్ఖండ్‌లో ఈ వింత జరిగింది. తన పొలంలో దున్నడానికి కొత్తగా కొనుక్కున్న ట్రాక్టర్‌తో బయలుదేరిన 22 ఏళ్ల యువతి మంజును గ్రామస్తులు ఆపేశారు. ఆడపిల్ల పొలం దున్నడం అరిష్టమన్నారు. మహమ్మారి కమ్ముకుంటుందన్నారు. జరిమానా వేస్తామన్నారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment