
1.జయహో జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీదే అధికారం..
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. సార్వత్రిక ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తవుతున్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ హవా ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2.అక్కడో మాట.. ఇక్కడో మాట.. అచ్చెన్న దొంగాట!
పాతపట్నంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఎవరు ఎవర్ని ప్రోత్సహిస్తున్నారో, ఎవరు ఎవర్ని వాడుకుంటారో, అగ్ర నేతల మధ్య ఏ నేత బలి పశువు అవుతారో అంతు చిక్కని విధంగా తయారైంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3.వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి
భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ (75)పై శుక్రవారం అమెరికాలో హత్యాయత్నం జరిగింది. న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆయన సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5.పడగ విప్పిన కరువు, జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్.. 500 ఏళ్ల విపత్తు!
బ్రిటన్‌లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్‌లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్‌లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్‌లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్
మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7.ఎకానమీ.. శుభ సంకేతాలు!
అంతర్జాతీయ, దేశీయ సవాళ్ల నేపథ్యంలోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. పలు రంగాలకు సంబంధించి శుక్రవారం వెలువడిన అధికారిక రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతుల గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. లైగర్ నుంచి ముచ్చటగా మూడో సాంగ్ కోకా 2.0 రిలీజ్
ఈ చిత్రంలోని ‘కోకా 2.0..’ అనే పాటని శుక్రవారం విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను గీతా మాధురి, రామ్ మిరియాల పాడారు. ఈ పాటలో పూరి జగన్నాథ్ కూడా కనిపిస్తారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9.టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..
మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని నిర్ధారించారు. జింబాబ్వే సిరీస్‌కు, ఆసియా కప్‌కు మధ్య తక్కువ వ్యవధి ఉండటమే అందుకు కారణం. ‘టీమిండియాకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వేకు వెళతారు.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10.పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య.. తులసిచెట్టుకు పూజ
తనకు పెళ్లి చేయడం లేదన్న కోపంతో తండ్రిని, చిన్నాన్నను హతమార్చాడో యువకుడు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment