టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు | Today Telugu News Headlines 23rd December 2020 | Sakshi
Sakshi News home page

టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Published Wed, Dec 23 2020 8:21 AM | Last Updated on Wed, Dec 23 2020 10:38 AM

Today Telugu News Headlines 23rd December 2020 - Sakshi

చైనాకు మ‌రో షాకిచ్చిన అమెరికా
రెండు ఆధిపత్ యరాజ్యాల మధ్య పోరు రోజురోజుకు మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా చైనాకు షాకిచ్చే మ‌రో బిల్లును పాస్ చేసింది. ఆధ్యాత్మిక  గురువు ద‌లైలామా వార‌సుడిని ఎంచుకునే హ‌క్కు టిబెటన్ల‌కే క‌ల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. పూ​ర్తి వివరాలు.

‘హోదా’ రాకపోవడానికి బాబు ప్యాకేజే కారణం 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమని భావించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పూర్తి వివరాలు..

రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా!

సూపర్‌స్టార్‌ రజనీ ఎంట్రీ దగ్గర నుంచి తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ పేరుగా మక్కల్‌ సేవై కర్చీ, పార్టీ గుర్తుగా ఆటో రిక్షాను ఎంపికచేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు..

బ్రిటన్‌లో రికార్డు కేసులు

కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్‌లో కోవిడ్‌–19 కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మహమ్మారి దేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి నమోదు కానంత భారీగా, రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు..

నేడు వైఎస్సార్‌ జిల్లాకు సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి మూడు  రోజుల పాటు వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాలు..


‘పోలవరం’ క్రెడిట్‌ వైఎస్‌దే

పోలవరం ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాలు..

ఏపీ పోలీస్‌.. దేశానికే ఆదర్శం

సమర్థవంతమైన సేవలందిస్తున్న ఏపీ పోలీస్‌ అనేక విషయాల్లో దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తోందని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఏపీఎస్‌పీ బెటాలియన్స్‌లో గత ఏడాది అత్యుత్తమ సేవలందించిన వారికి మంగళవారం అవార్డులను అందజేశారు. పూర్తి వివరాలు..

కరోనా–2 కలకలం

బ్రిటన్‌లో తాజాగా గుర్తించిన కొత్త రకం కరోనా వైరస్‌ భారత్‌లో కూడా అడుగుపెట్టిందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లండన్‌ నుంచి భారత్‌ లోని వివిధ రాష్ట్రాలకు వచ్చిన విమాన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.  పూర్తి వివరాలు..

కొత్త వైరస్ కేసు రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు!

కొత్తరకం కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, రాష్ట్రం లోకి ఇంకా కొత్త వైరస్‌ రాలేదని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పూర్తి వివరాలు..

'కోబ్రా'కి ఇంకా టైముంది

‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ను మళ్లీ స్క్రీన్‌ మీద చూపించడానికి రెడీ అయ్యారు వెంకటేశ్‌ అతని కో బ్రదర్‌ (కోబ్రా) వరుణ్‌ తేజ్‌. కానీ కోబ్రా లేకుండానే సెట్లోకి ఎంటర్‌ అవుతున్నారు వెంకీ.  పూర్తి వివరాలు..

‘క్యూ2’ కిక్‌!

కరోనా కల్లోలం నుంచి భారత కంపెనీలు కోలుకుంటున్నాయి. సెప్టెంబర్ ‌క్వార్టర్‌ (క్యూ2) ఫలితాలు దీనికి స్పష్టమైన సంకేతాలిచ్చాయి. చాలా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించాయి. పూర్తి వివరాలు..

ప్రేయసితో యువ క్రికెటర్‌ పెళ్లి

టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌‌ మంగళవారం ఒక ఇంటివాడయ్యాడు. కొరియోగ్రాఫర్‌ కమ్‌ యూట్యూబ్‌ స్టార్‌ ధనశ్రీ వర్మతో చహల్‌ కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు.  పూర్తి వివరాలు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement