టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు | Today Telugu News Headlines 24th December 2020 | Sakshi
Sakshi News home page

టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Published Thu, Dec 24 2020 8:45 AM | Last Updated on Thu, Dec 24 2020 11:13 AM

Today Telugu News Headlines 24th December 2020 - Sakshi

రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత?
బ్యాంకులను కొల్లగొట్టడంలో చంద్రబాబు అండ్‌ కో గ్యాంగ్‌స్టర్స్‌ని, స్కామ్‌స్టర్స్‌ని మించిపోయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ బుధవారం ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు..


అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు

కొత్త వ్యవసాయ చట్టాల్లో అర్థంపర్థం లేని సవరణల అంశాన్ని ప్రస్తావించడం, తమకు ప్రేమ లేఖలు రాయడం మానుకోవాలని రైతులు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పూర్తి వివరాలు..

దక్షిణాఆఫ్రికాలో కొత్త వేరియంట్‌

దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వైరస్‌ వేరియంట్‌ను గుర్తించారు. దీనివల్లనే అక్కడ కేసుల సంఖ్యతో పాటు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని నిర్ధారించారు. పూర్తి వివరాలు..

పార్టీ ఏర్పాటుతో 24 గంటల్లో అధికారమా? 

ప్రజాకర్షణ లక్ష్యంగా గ్రామసభలకు డీఎంకే బుధవారం శ్రీకారం చుట్టింది. శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నం గ్రామంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ పర్యటించారు. పూర్తి వివరాలు..

మరింత సమర్థవంతంగా సచివాలయాల పనితీరు

గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా, సమర్థవంతంగా పని చేసేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పూర్తి వివరాలు..


పులివెందులలో నేడు అపాచీ ఫుట్‌వేర్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన

వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ప్రముఖ పాదరక్షల తయారీ సంస్థ ఇంటెలిజెంట్‌ సెజ్‌ (అపాచీ) ఏర్పాటు యూనిట్‌కు సీఎం జగన్‌ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాలు..

'దొంగలు..' బాబో!

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సన్నిహితుడైన ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకులను మోసం చేయడంలో నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నాడు. పూర్తి వివరాలు..

పీవీ భారతదేశ చరిత్రలో నిలిచిపోతారు: కేసీఆర్‌

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం పీవీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్‌ ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పించారు. పూర్తి వివరాలు..

కలకలం: పోలీసు అధికారుల ఇళ్లపై డ్రోన్‌ కెమెరా 

జూబ్లీహిల్స్‌ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే కొందరు పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్‌ కెమెరా తిరుగుతుండటం కలకలం రేపింది. పూర్తి వివరాలు..

న్యూజెర్సీలో తెలంగాణ వాసి మృతి

అమెరికాలోని న్యూజెర్సీలో హన్మకొండ భవానీనగర్‌కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కిందపడి చనిపోయాడు. ప్రవీణ్‌కుమార్‌ (37) డిసెంబర్‌ 22న న్యూజెర్సీలోని ఎడిసన్‌ టౌన్‌షిప్‌ నుంచి న్యూయార్క్‌లోని ఆఫీసుకు వెళ్తుండగా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు..

యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ అయినప్పటికీ ఫ్యామిలీ యాంగిల్‌

‘‘ఈ లాక్‌డౌన్‌ ఒక్కసారి ఆగి, నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. మా ఇంటి చుట్టూ ఎన్ని రకాల పక్షులు సందడి చేస్తాయో ఈ లాక్‌డౌన్‌లోనే గమనించాను. పూర్తి వివరాలు..

మెస్సీ ప్రపంచ రికార్డు

ఫుట్‌బాల్‌ క్రీడలో 46 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బార్సిలోనా స్టార్‌ ప్లేయర్, అర్జెంటీనా జట్టు కెప్టెన్‌ లయనెల్‌ మెస్సీ బద్దలు కొట్టాడు. పూర్తి వివరాలు..

డీల్‌ స్ట్రీట్‌లో డాన్‌.. రిలయన్స్‌

కరోనా కల్లోలం ఉన్నా, ఈ ఏడాది డీల్స్‌ జోరుగా జరిగాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, పలు విదేశీ సంస్థలు మన కంపెనీలతో డీల్స్‌ కుదుర్చుకున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. పూర్తి వివరాలు..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement