సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ స్విస్ గ్రాండ్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక 5.5 పాయింట్లతో దినారా (కజకిస్తాన్)తో కలిసి సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా హారికకు తొలి స్థానం, దినారాకు రెండో స్థానం లభించాయి. హారిక 11 మంది గ్రాండ్‌మాస్టర్లతో గేమ్‌లు ఆడింది. రెండు గేముల్లో గెలిచింది. ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడింది. తాజా ప్రదర్శనతో హారిక త్వరలో వెలువడే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment