2020లో సౌత్ ఇండియా నెంబర్‌వన్‌ స్టార్‌ అతడే..! | Top Ten 2020 Twitter Trending South Indian Super Stars | Sakshi
Sakshi News home page

2020లో దక్షిణ భారతదేశ సూపర్‌స్టార్స్‌ వీరే..!

Dec 14 2020 2:01 PM | Updated on Dec 14 2020 7:47 PM

Top Ten 2020 Twitter Trending South Indian Super Stars - Sakshi

ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. తమకు నచ్చిన వారిగురించి సోషల్‌ మీడియాలో చర్చించడం, హ్యాష్‌టాగ్‌లతో పోస్టులు చేయడం నెటిజన్లకు అలవాటుగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ఏ హీరోలు, హీరోయిన్ల గురించి ట్విటర్‌లో అత్యధికంగా చర్చ జరిగింది. ఎవరి పేరుతో ఎక్కువ ట్వీట్స్‌ చేశారు అనేది ట్విటర్‌ అధికారికంగా వెల్లడించింది. 'మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది..! 2020లో ఎక్కువగా ట్వీట్‌ చేయబడిన దక్షిణ భారత సూపర్‌స్టార్స్‌ వీరే' అంటూ టాప్‌-10 జాబితాను ట్విటర్‌ ఇండియా షేర్‌ చేసింది.

ఆ జాబితాలో టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నెంబర్‌వన్‌ స్థానాన్ని ఆక్రమించుకోగా.. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ 3వ స్థానం, ఎన్టీఆర్‌ 4, సూర్య 5వ స్థానాన్ని దక్కించుకున్నారు. దక్షిణాది హీరోయిన్‌ల విషయానికొస్తే.. మహానటి కీర్తి సురేష్‌ నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకుంది. తర్వాత స్థానాలను కాజల్‌, సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే దక్కించుకోవడం విశేషం.  చదవండి: (ట్విటర్‌ ట్రెండింగ్‌.. విక్రమ్‌ సినిమాకు 21 ఏళ్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement