దేశంలో స్వలింగ వివాహాలకు (Same sex marriages) చట్టబద్ధత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో అంతర్గత విషయం అని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇది కుటుంబంలో భాగం కావాలనేది మానవ లక్షణంలో ప్రధాన భాగమని, స్వీయ అభివృద్ధికి ఇది ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది.
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తాము ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టంలోని చట్టపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తున్నామని, వాటిని గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రత్యేక వివాహ చట్టం (SMA) సవరణ అంటే దేశాన్ని స్వాతంత్ర్య పూర్వ యుగానికి తీసుకుపోవడమేనని చంద్ర చూడ్ వ్యాఖ్యానించారు. కేవలం పార్లమెంట్ ద్వారానే స్పెషల్ మ్యారేజ్ యాక్టులో మార్పులు చేయాలని సూచించారు. శాసన వ్యవహారాల్లోకి కోర్టు జోక్యం చేసుకోదని సీజే స్పష్టం చేశారు.
ఇద్దరు వ్యక్తుల కలయికను లైంగిక ధోరణి ఆధారంగా పరిమితం చేయలేమన్నారు. క్వీర్ జంటలతో సహా అవివాహిత జంటలు సంయుక్తంగా దత్తత తీసుకోవచ్చని తీర్పునిచ్చారు. భిన్న లింగ (స్త్రీ-పురుష) జంటలు మాత్రమే బిడ్డకు స్థిరత్వాన్ని అందించగలరని కోర్టు వాదించ లేమన్నారు. ఈ బెంచ్‌లో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ తీర్పుతో తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు జస్టిస్ చంద్రచూడ్.
అయితే భారత్‌లో స్వలింగ వివాహాల చట్టబద్ధతకు సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ధృవీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల మారథాన్ విచారణ తర్వాత ఈ పిటిషన్లపై మే 11న తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర ప్రభుత్వం స్వలింగ వివాహ గుర్తింపును వ్యతిరేకిస్తోంది.
అటు ఎల్జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీ కూడా భారత పౌరులేనని, వారికి కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయని, స్వీయ జీవన విధానాన్ని నిర్ణయించుకునే, నిర్ధారించుకునే హక్కు వారికి ఉంటుందని, దాన్ని చట్టబద్ధంగా అంగీకరించాలని, స్వలింగ వివాహాల (Same sex marriages) వల్ల సమాజానికి ఎలాంటి హాని జరగబోదని, స్వలింగ వివాహాలు చేసుకున్న వారిని వేధించడం తగదని, సమాజంలోని అన్ని సామాజిక ప్రయోజనాలను వారికీ కల్పించాలని సేమ్ సెక్స్ మ్యారేజెస్ మద్దతుదారుల వాదన. మరోవైపు స్వలింగ వివాహాలతో భారతదేశ సామాజిక, సాంస్కృతిక జీవనానికి పునాదిలాంటి కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని, భవిష్యత్ తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒక వర్గం వాదిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు దేశాలు దేశవ్యాప్త ఓటింగ్ తర్వాత స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. 10 దేశాలు కోర్టు నిర్ణయాల ద్వారా చట్టబద్ధం చేశాయి. అలాగే ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ది చెందిన దేశాల్లో, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. ఇప్పటివరకు ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించిన చివరి దేశంగా ఎస్టోనియా(2024) నిలిచింది.
కాగా మానవ హక్కుల ప్రచారం వేదిక "ప్రపంచంలోని వివాహ సమానత్వం" డేటాప్రకారం, చెక్ రిపబ్లిక్, జపాన్, ఫిలిప్పీన్స్ , థాయ్‌లాండ్‌లో కూడా వివాహ సమానత్వంపై చర్చలు జరుగుతున్నాయి.
30కిపైగా దేశాల్లో స్వలింగ వివాహం చట్టబద్ధం, ఇదిగో జాబితా
నెదర్లాండ్స్: 2001, బెల్జియం: 2003
2005: కెనడా, స్పెయిన్, దక్షిణాఫ్రికా: 2006
2009: నార్వే, స్వీడన్
2010:ఐస్లాండ్, పోర్చుగల్,అర్జెంటీనా
డెన్మార్క్: 2012,
2013: ఉరుగ్వే, న్యూజిలాండ్: ఫ్రాన్స్, బ్రెజిల్,
2014 ఇంగ్లాండ్ అండ్ వేల్స్, స్కాట్లాండ్
2015 లక్సెంబర్గ్, ఐర్లాండ్,అమెరికా
2016: గ్రీన్‌ల్యాండ్, కొలంబియా
2017 ఫిన్లాండ్,జర్మనీ, మాల్టా, ఆస్ట్రేలియా
2019: ఆస్ట్రియా, తైవాన్, ఈక్వెడార్
2020 ఐర్లాండ్,కోస్టా రికా
2022: స్విట్జర్లాండ్, మెక్సికో, చిలీ, స్లోవేనియా, క్యూబా
2023 అండోరా
2024: ఎస్టోనియా
Comments
Please login to add a commentAdd a comment