same sex marriage
-
మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో..
ఓ స్వలింగ జంట మగ బిడ్డకు జన్మనివ్వడమే ఓ మిరాకిల్ అనేకుంటే.. ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడపున మోయడం మరింత విశేషం. ఈఘటన ఐరోపాలో చోటు చేసుకుంది. ఇది ఎలా సాధ్యం అనిపిస్తోంది కదా!. ఫెర్టిలిటి సెంటర్‌ని సంప్రదించి బిడ్డల్ని కనే ప్రయత్నం చేశారనుకున్నా.. ఇద్దరూ గర్భంలో మోయడం ఏంటీ అనే డౌటు వస్తుంది కదా!. గతంలో తొలిసారిగా ఓ స్వలింగ జంట ఇలానే ఒకే బిడ్డను ఇద్దరూ మోసి చరిత్ర సృష్టించారని ఈ స్వలింగ జంట రెండోదని అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఏంటా కథా కమామీషు చూద్దాం!. స్పెయిన్‌లో మజోర్కాలోని పాల్మాలో ఎస్టీఫానియా(30), అజహారా(27) అనే స్వలింగ జంట అక్టోబర్ 30న ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వారిద్దరూ మహిళలే. పిల్లల్ని కనాలని ఆశపడ్డారు. ఇద్దరు మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించాలనుకున్నారు. అందుకోసం ఓ ఫెర్టిలిటి సెంటర్‌ని సంప్రదించారు. ముందుగా ఎస్టీఫానియా మహిళ గర్భంలో స్పెర్మ్‌ని ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందేలా చేశారు. ఐదు రోజుల అనంతరం ఆ పిండాన్ని అజహారా గర్భంలో పెట్టారు. అలా ఇద్దరూ ఒకే బిడ్డను మోసి మాతృత్వపు అనుభూతిని పొందారు. ఇందుకోసం సుమారు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టి మరీ తమ కలను సాకారం చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరూ కేర్ వహిస్తూ తమ అనుబంధం మరింత బలపడింది అనేందుకు చిహ్నంగా ఒకే బిడ్డకు జన్మనిచ్చాం. ఆ ఆలోచన మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటూ ఆనందంగా చెబుతున్నారు ఇరువురు. ఈ వైద్య విధానాన్ని ఇన్వోసెల్గా పిలిచే సంతానోత్పత్తి చికిత్స అంటారు. ఇలా ఇంతకుమునుపు 2018లో టెక్సాస్‌లో ఓ స్వలింగ జంట(ఇద్దరు మహిళలు) ఒకే బిడ్డను మోసి.. ప్రపంచంలోనే తొలి స్వలింగ జంటగా నిలిచారు. సంతానం లేనివాళ్లకే గాక పిల్లల్ని కనడం సాధ్యం కానీ ఇలాంటి స్వలింగ జంటలకు ఈ సరికొత్త వైద్య విధానం ఓ వరం. వైద్యవిధానం సరికొత్త ఆవిష్కరణలతో అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తోందనడానికి ఈ ఘటనే ఓ నిదర్శనం (చదవండి: కోవిడ్ కొత్త వ్యాక్సిన్ ఆ క్యాన్సర్‌ని రానివ్వదు! అధ్యయనంలో వెల్లడి) -
సుప్రీంకోర్టు ఎదుటే నిశ్చితార్థం చేసుకున్న గే కపుల్
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతకు సుప్రీంకోర్టు నో చెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు సమాన హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీన్ని పార్లమెంటే తేల్చాలని పేర్కొంది.అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని, స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించొద్దని తెలిపింది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో స్వలింగ సంపర్కులు నిరాశ చెందారు. అయితే తాము ఇక్కడితో ఆగిపోలేదని.. మళ్లీ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న అనన్య కోటియా వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సోషల్ మీడియాలో అతడు చేసిన పోస్టే ఇందుకు కారణం. తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే స్వలింగ సంపర్కుల జంట సుప్రీం కోర్టు ఎదుట నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేస్తున్న అనన్య కోటియా, అతని భాగస్వామి అయిన న్యాయవాది ఉత్కర్ష్ సక్సేనా నేడు సుప్రీంకోర్టు ఎదుట ఉంగరాలు మార్చుకొని తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఉత్కర్ష్ సక్కేనా మోకాలిపై నిలబడి ఉండి.. అనన్యకు ఉంగరాన్ని తొడిగాడు. ఈ ఫోటోను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య Yesterday hurt. Today, @utkarsh__saxena and I went back to the court that denied our rights, and exchanged rings. So this week wasn't about a legal loss, but our engagement. We'll return to fight another day. pic.twitter.com/ALJFIhgQ5I — Kotia (@AnanyaKotia) October 18, 2023 న్యాయపరంగా ప్రతికూల తీర్పు వచ్చినప్పటికీ.. భవిష్యత్తులో సమాన హక్కులు, గుర్తింపు కోసం తమ పోరాటాన్ని కొనసాగించాలనే సంకల్పంతో నిశ్చితార్థాన్ని జరుపుకున్నట్లు ఈ జంట వెల్లడించింది. ‘సుప్రీంకోర్టు తీర్పు మమ్మల్ని బాధించింది. అయినా నేడు మేము మా హక్కులను నిరాకరించిన అదే కోర్టు ప్రాంగణానికి తిరిగి వచ్చి నేను ఉత్కర్ష్ సక్కేనా ఉంగరాలు మార్చుకున్నాం. ఈ వారం మా వివాహాల చట్టబద్దతపై ఎదురుదెబ్బ తగిలిన విషమం గురించే కాదు మా నిశ్చితార్థం గురించి కూడా.. మరో రోజు పోరాడేందుకు తిరిగి వస్తాం’ అని అనన్య ట్వీట్ చేశారు. కాగా స్వలింగ వివాహాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. మే 11న తన తీర్పును రిజర్వు చేన రాజ్యాంగ ధర్మాసనం.. నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా కొన్ని అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఈ మేరకు 3:2తో మెజారిటీ తీర్పు వెలువరించింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ స్వలింగ సంపర్క జంటలు పిల్లలను దత్తత తీసుకోవచ్చని తెలియజేయగా.. జస్టిస్ కే రవింద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహచ జస్టిస్ హిమా కోహ్లి నిరాకరించారు. అయితే, స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అపోహను వీడాలని ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొంది. అదే సమయంలో, స్వలింగ జంటల సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీతో పాటు సామాజిక తదితర రంగాల నిపుణులకు అందులో చోటుండాలని సూచించింది. -
స్వలింగ వివాహాలు ఏయే దేశాల్లో చట్టబద్ధమో తెలుసా?
దేశంలో స్వలింగ వివాహాలకు (Same sex marriages) చట్టబద్ధత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో అంతర్గత విషయం అని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇది కుటుంబంలో భాగం కావాలనేది మానవ లక్షణంలో ప్రధాన భాగమని, స్వీయ అభివృద్ధికి ఇది ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తాము ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టంలోని చట్టపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తున్నామని, వాటిని గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రత్యేక వివాహ చట్టం (SMA) సవరణ అంటే దేశాన్ని స్వాతంత్ర్య పూర్వ యుగానికి తీసుకుపోవడమేనని చంద్ర చూడ్ వ్యాఖ్యానించారు. కేవలం పార్లమెంట్ ద్వారానే స్పెషల్ మ్యారేజ్ యాక్టులో మార్పులు చేయాలని సూచించారు. శాసన వ్యవహారాల్లోకి కోర్టు జోక్యం చేసుకోదని సీజే స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల కలయికను లైంగిక ధోరణి ఆధారంగా పరిమితం చేయలేమన్నారు. క్వీర్ జంటలతో సహా అవివాహిత జంటలు సంయుక్తంగా దత్తత తీసుకోవచ్చని తీర్పునిచ్చారు. భిన్న లింగ (స్త్రీ-పురుష) జంటలు మాత్రమే బిడ్డకు స్థిరత్వాన్ని అందించగలరని కోర్టు వాదించ లేమన్నారు. ఈ బెంచ్‌లో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ తీర్పుతో తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు జస్టిస్ చంద్రచూడ్. అయితే భారత్‌లో స్వలింగ వివాహాల చట్టబద్ధతకు సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ధృవీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల మారథాన్ విచారణ తర్వాత ఈ పిటిషన్లపై మే 11న తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర ప్రభుత్వం స్వలింగ వివాహ గుర్తింపును వ్యతిరేకిస్తోంది. అటు ఎల్జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీ కూడా భారత పౌరులేనని, వారికి కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయని, స్వీయ జీవన విధానాన్ని నిర్ణయించుకునే, నిర్ధారించుకునే హక్కు వారికి ఉంటుందని, దాన్ని చట్టబద్ధంగా అంగీకరించాలని, స్వలింగ వివాహాల (Same sex marriages) వల్ల సమాజానికి ఎలాంటి హాని జరగబోదని, స్వలింగ వివాహాలు చేసుకున్న వారిని వేధించడం తగదని, సమాజంలోని అన్ని సామాజిక ప్రయోజనాలను వారికీ కల్పించాలని సేమ్ సెక్స్ మ్యారేజెస్ మద్దతుదారుల వాదన. మరోవైపు స్వలింగ వివాహాలతో భారతదేశ సామాజిక, సాంస్కృతిక జీవనానికి పునాదిలాంటి కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని, భవిష్యత్ తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒక వర్గం వాదిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు దేశాలు దేశవ్యాప్త ఓటింగ్ తర్వాత స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. 10 దేశాలు కోర్టు నిర్ణయాల ద్వారా చట్టబద్ధం చేశాయి. అలాగే ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ది చెందిన దేశాల్లో, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. ఇప్పటివరకు ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించిన చివరి దేశంగా ఎస్టోనియా(2024) నిలిచింది. కాగా మానవ హక్కుల ప్రచారం వేదిక "ప్రపంచంలోని వివాహ సమానత్వం" డేటాప్రకారం, చెక్ రిపబ్లిక్, జపాన్, ఫిలిప్పీన్స్ , థాయ్‌లాండ్‌లో కూడా వివాహ సమానత్వంపై చర్చలు జరుగుతున్నాయి. 30కిపైగా దేశాల్లో స్వలింగ వివాహం చట్టబద్ధం, ఇదిగో జాబితా నెదర్లాండ్స్: 2001, బెల్జియం: 2003 2005: కెనడా, స్పెయిన్, దక్షిణాఫ్రికా: 2006 2009: నార్వే, స్వీడన్ 2010:ఐస్లాండ్, పోర్చుగల్,అర్జెంటీనా డెన్మార్క్: 2012, 2013: ఉరుగ్వే, న్యూజిలాండ్: ఫ్రాన్స్, బ్రెజిల్, 2014 ఇంగ్లాండ్ అండ్ వేల్స్, స్కాట్లాండ్ 2015 లక్సెంబర్గ్, ఐర్లాండ్,అమెరికా 2016: గ్రీన్‌ల్యాండ్, కొలంబియా 2017 ఫిన్లాండ్,జర్మనీ, మాల్టా, ఆస్ట్రేలియా 2019: ఆస్ట్రియా, తైవాన్, ఈక్వెడార్ 2020 ఐర్లాండ్,కోస్టా రికా 2022: స్విట్జర్లాండ్, మెక్సికో, చిలీ, స్లోవేనియా, క్యూబా 2023 అండోరా 2024: ఎస్టోనియా -
స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు
ఢిల్లీ: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ వివాహాల చట్టబద్దతపై రెడ్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్.. స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపారు. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేశారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపిన సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 'స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేం. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించం. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదు. కలిసి జీవించడం గుర్తిస్తున్నాం.. కానీ దాన్ని వివాహంగా పరిగణించలేం. స్వలింగ సంపర్కులను దంపతులుగా గుర్తించలేము. స్వలింగ జంటల అభ్యర్ధనల పట్ల సానుభూతి ఉంది కాని అభ్యర్ధనలకు చట్టబద్ధత లేదు. ప్రత్యేక వివాహ చట్టం లో మార్పు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోలేం. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేం. వివాహ వ్యవస్థకు సంబందించిన నిర్ణయాలు పార్లమెంట్ మాత్రమే చేయగలదు.' అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. 'ప్రేమ అనేది మానవత్వ లక్షణం. వివాహ హక్కుల నిర్ధారణకూ ప్రభుత్వం కమిటీ వేయాలి. ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది. అసహజ వ్యక్తుల హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంతాలు వివక్ష చూపకూడదు. అసహజ వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నాం. రేషన్ కార్డ్‌లలో అసహజ జంటలను కుటుంబంగా చేర్చడం, అసహజ జంటలు ఉమ్మడి బ్యాంకు ఖాతా కోసం నామినేట్ చేయడానికి వీలు కల్పించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుంచి వచ్చే హక్కులను కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించాలి.' అని సుప్రీంకోర్టు స్పష్టం తీర్పును వెల్లడించింది. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌లోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్ధం అనొచ్చని సీజేఐ చంద్రచుడ్ అన్నారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సుప్రీంకోరు తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 20 పిటిషన్లపై విచారణ పూర్తైన అనంతరం ధర్మాసనం మేలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కాగా, 2018 సెప్టెంబర్‌లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం శిక్షార్హం కాదని తేల్చింది. పాతకాలపు చట్టాన్ని పక్కనపెట్టి ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే గగ్గోలు పుట్టింది. సాంస్కృతిక విలువలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. తీరా స్వలింగ సంపర్కం తప్పు కాదని కోర్టు చెప్పినా తమకు సామాజిక అంగీకారం లభించడం లేదనీ, తమపై దుర్విచక్షణ సాగుతూనే ఉందనీ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ల (ఎల్జీబీటీక్యూ) వర్గం ఫిర్యాదు చేస్తోంది. స్వలింగ సంపర్కం నేరం కాదనే దశ నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరడం దాకా ఇప్పుడు వచ్చింది. హోమో సెక్సువల్ పెళ్ళిళ్ళను చట్టబద్ధమైనవని గుర్తించాలని కోరుతూ, 2020లోనే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తర్వాత సుప్రీమ్‌కు పిటిషన్లు చేరాయి. కోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. మార్చి 13న సుప్రీంకోర్టులో కేంద్రం తన అఫిడవిట్ దాఖలు చేస్తూ, స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ససేమిరా అంది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని భారత శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్ మాట. ఆ సెక్షన్ కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని అయిదేళ్ళ క్రితం తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదని ప్రభుత్వం వెల్లడించింది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యను సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ వివాహాలకు గుర్తింపు కల్పించకపోవడం వివక్ష కాదని ప్రభుత్వం వాదించింది. ఇదీ చదవండి: ఢిల్లీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో ఆప్! స్వలింగ సంపర్కుల విషయంలో వివిధ దేశాల్లో ఉన్న శిక్షలు/హక్కులు... వాటి వివరాలు.. 1. మరణ శిక్ష 2. జీవితకాల ఖైదు 3. జైలు శిక్ష 4. హక్కులు లేవు 5. చట్టప్రకారం శిక్షలు 6. యూనియన్లకు కలిగి ఉండే హక్కు 7. చట్టప్రకారం వివాహం చేసుకోవచ్చు 8. ఉమ్మడిగా దత్తత తీసుకునే హక్కు -
స్వలింగ సంపర్కులను వదలరు.. చంపేస్తారక్కడ!
స్వలింగ వివాహాల చట్టబద్ధతపై మన దగ్గర సర్వోన్నత న్యాయస్థానంలో రాజ్యాంగ ధర్మాసనం చట్టసభ పరిధిలోని అంశమని, అయితే వాళ్ల హక్కుల పరిరక్షణ బాధ్యత మాత్రం ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. అయితే.. ఇది సహేతుకం కాదని కేంద్రం వద్దంటోంది. స్వేచ్ఛా హక్కులో భాగంగా వివాహ హక్కు కల్పించాలని కొందరు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఆ మధ్య ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్వలింగసంపర్క వ్యతిరేక చట్టాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆసక్తికర చర్చకు దారి తీసింది ఆఫ్రికా దేశం ఉగాండా. తూర్పు ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎల్జీబీటీక్యూ వ్యతిరేక చట్టానికి ఈ ఏడాది మే నెలలో ఆ దేశ అధ్యక్షుడు యోవెరీ ముసెవెని(78) ఆమోద ముద్ర వేశారు.దీంతో.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిన దేశంగా నిలిచింది ఉగాండా. ఆఫ్రికా ఖండం మొత్తంలో 30 దేశాల్లో సేమ్ సెక్స్ రిలేషన్స్ అనేది నేరం. అందుకుగానూ కఠిన శిక్షలే ఉంటాయి. కానీ, ఉగాండా మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. ఏకంగా.. మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. 👉 ఉగాండా చట్టాల ప్రకారం.. స్వలింగ సంపర్కుల బంధం తీవ్ర నేరం. హెచ్ఐవీ/ఎయిడ్స్‌లాంటి ప్రాణాంతక సుఖవ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి, అలాంటి రిలేషన్షిప్లో కొనసాగితే.. తీవ్రంగా పరిగణిస్తారు. జైలు శిక్ష లేదంటే దేశ బహిష్కరణ లాంటి శిక్షలు అమలు చేస్తారు. మరోవైపు అనధికారికంగా.. సంఘం నుంచి సామాజిక బహిష్కరణతో పాటు రాళ్లతో తరిమి తరిమి కొట్టి చంపిన దాఖలాలు, మూక హత్యల ఘటనలూ అక్కడ నమోదు అయ్యాయి. ఉగాండా తాజా చట్టం ప్రకారం.. ఒకే లింగానికి చెంది ఉండి.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ పదే పదే పరస్పర శృంగారంలో పాల్గొనడం, బంధంలో కలిసి జీవించడం, వివాహాలు.. లాంటి నేరాలు చేస్తే వాళ్లకు మరణ శిక్ష విధిస్తారక్కడ. అలాగే హోమో సెక్సువాలిటీని ప్రమోట్ చేసినందుకుగానూ 20 ఏళ్ల జైలు శిక్ష సైతం విధిస్తారు. 👉 గోల్డ్ పెన్‌తో అధ్యక్షుడు యోవెరీ ముసెవెని చట్టం ప్రతులపై సంతకం చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఉగాండా తీసుకున్న ఈ నిర్ణయంపై పలు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 👉 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉగాండా తాజా నిర్ణయాన్ని మానవ హక్కులకు సంబంధించిన విషాదకరమైన ఉల్లంఘనగా అభివర్ణించారు. మానవ హక్కుల ఉల్లంఘనను అమెరికా ఎప్పుడూ తీవ్రంగానే పరిగణిస్తుంది. అందుకు తగ్గట్లే ఆంక్షలు, నిషేధాజ్ఞల దిశగా ఆలోచన చేస్తామని ప్రకటించారాయన. 👉అంతేకాదు సొంత దేశంలో పలు గ్రూపులు కోర్టును ఆశ్రయించాయి కూడా. మరోవైపు ఉగాండా స్ఫూర్తితో కెన్యా, టాంజానియాలు కూడా కఠిన శిక్షలు అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 👉 ఉగాండాలో ఎల్జీబీటీక్యూ వ్యతిరేకచట్టంపై చర్చ ఈనాటిది కాదు. 2014లో ఉగాండా చేసిన ప్రయత్నాలను గమనించిన పాశ్చాత్య దేశాలు సహాయం నిలిపేయడం, ఆంక్షలు విధించడం, భద్రతా సహకారంపై కోతలు విధించడం లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నాయి. 👉 అంతకు ముందు 2009లో.. kill the gays(గేలను చంపేయడం) లాంటి ప్రతిపాదనను తీసుకురాగా.. ప్రపంచ దేశాలు, కీలక సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఒక అడుగు వెనకేసింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే చట్టానికి అధ్యక్షుడి ఆమోద ముద్ర పడేలా చేసుకుంది. -
Same Sex Marriage: రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిటిషన్లపై తుది వాదనలను వినేందుకు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది సుప్రీం కోర్టు. ఏప్రిల్ 18వ తేదీన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సమాజంపై భారీ ప్రభావం చూపుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు రాజ్యాంగ హక్కులు, ప్రత్యేక వివాహ చట్టం, ప్రత్యేక శాసన చట్టాలతో ముడిపడి ఉందని తెలిపింది. ఈ కేసుకి సంబంధించిన వాదనలు సుప్రీం కోర్టు వెబ్సైట్లో లేదా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని ధర్మాసనం తెలిపింది. ఇది సమాజంపై ప్రభావం చూపే కీలక అంశం కాబట్టి దీన్ని పరిగణలోని తీసుకోని సరైన తీర్పు ఇవ్వాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రాజ్యంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం.. ఐగుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ సమస్యను పరిష్కరించడమే సముచితమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇటీవల నలుగురు స్వలింగ సంపర్కులు తమ వివాహాలను గుర్తించడమే గాక తమకు నచ్చి వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కును కల్పించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఐతే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మేరకు ప్రభత్వం తరుఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్వలింగ సంపర్కుల వివాహలను గుర్తిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని అన్నారు. పైగా ఇద్దరు స్త్రీలు లేదా పురుషుల మధ్య జరిగిన వివాహానికి వ్యక్తిగత చట్టాలు లేదంటే రాజ్యంగబద్ధమైన చట్టాల కింద చట్టబద్ధత కల్పించడం గుర్తించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. (చదవండి: పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు.. అదే తేదీన కవిత విచారణ) -
అమెరికాలో స్వలింగ వివాహాలకు ఓకే
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించే ప్రక్రియ ఆరంభమైంది. సంబంధిత బిల్లుకు అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లోని ప్రతినిధుల సభ గురువారం తుది ఆమోదం తెలియజేసింది. బిల్లుకు మద్దతుగా 258 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 169 మంది ఓటు వేశారు. మొత్తం డెమొక్రాట్లతోపాటు 39 మంది ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా మద్దతు తెలిపారు. మిగతా 169 మంది వ్యతిరేకించారు. ‘రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్’ అని పిలుస్తున్న ఈ బిల్లు గత నెలలోనే ఎగువ సభ అయిన సెనేట్‌లో ఆమోదం పొందింది. ఇప్పుడు దిగువ సభ సైతం ఆమోదించడంతో ఇక అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు వెళ్లనుంది. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. స్వలింగ వివాహాల బిల్లుకు ఆధ్యాత్మిక సంస్థలు మద్దతు తెలిపాయి. చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం.. 22 వేల చెట్ల నరికివేతకు హైకోర్టు అనుమతి -
స్వలింగ వివాహం: షాకిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: ఒకే జెండర్ వారి మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తిస్తూ.. చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో దాఖలైన పిటిషన్‌ని కేంద్రం వ్యతిరేకించింది. అతి పెద్ద శాసన చట్రం కేవలం స్త్రీ, పురుషుల మధ్య జరిగే వివాహాలను మాత్రమే గుర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలు కూడా ఇలాంటి వివాహాలనే గుర్తిస్తాయని.. వీటిలో తల దూర్చితే భారీ వినాశనం తప్పదని హెచ్చరించింది. అంతేకాక ‘‘వివాహం అనేది ఓ ప్రైవేట్ కాన్సెప్ట్ కాదని.. స్వంత ప్రజా ప్రాముఖ్యత కలిగిన సామాజికంగా గుర్తింపు పొందిన వ్యవస్థ అని కేంద్రం తెలిపింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 377 యొక్క డిక్రిమినలైజేషన్ ఉన్నప్పటికీ, పిటిషనర్లు స్వలింగ వివాహాన్ని ప్రాథమిక హక్కుగా పొందలేరు’’ అని సెంటర్ అఫిడవిట్లో పేర్కొంది. జెండర్‌తో సంబంధం లేకుండా ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాల్సిందిగా కోరుతూ.. గే, లెస్బియన్ కమ్యూనిటీకి చెందిన నలుగరు ఢిల్లీ హై కోర్టు ను ఆశ్రయించారు. జస్టిస్ రాజీవ్ సహై ఎండ్లా, అమిత్ బన్సాల్ ధర్మాసనం ఈ విజ్ఞప్తిపై కేంద్రం స్పందనని కోరింది. దీనిపై కేంద్రం బదులిస్తూ.. ‘‘భారతీయ సమాజంలో వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను కలిపే ప్రకియ కాదు.. స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని ఏర్పరిచే వ్యవస్థ. కనుక స్వలింగ సంపర్కుల మధ్య జరిగే వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకుంటే ‘‘వ్యక్తిగత చట్టాల సున్నితమైన సమతుల్యత పూర్తి నాశనానికి కారణమవుతుంది’’ అని అభిప్రాయపడింది. భర్త అంటే బయోలాజికల్‌గా పురుషుడు.. భార్య అంటే కేవలం మహిళ మాత్రమే. కనుక ఒకే లింగ వారి మధ్య జరిగే వివాహాలను సమర్థించం అని కేంద్రం తెలిపింది. చదవండి: అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్ ‘నువ్వు నిజమైన అమ్మాయివి కాదు కదా’ -
‘స్వలింగ వివాహాలను అనుమతించలేం’
సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన చట్టాలు, న్యాయవ్యవస్థ, సమాజం, మన విలువలు గుర్తించలేదని, ఇలాంటి వివాహాలను అనుమతించలేమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం (హెచ్ఎంఏ), ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్‌ల ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వ వాదనను వినిపించారు. స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన చట్టాలు, సమాజం, న్యాయవ్యవస్థ గుర్తించవని పేర్కొంటూ ఈ తరహా వివాహాలకు అనుమతిస్తూ పిటిషనర్ కోరిన ఊరటను కల్పించడాన్ని మెహతా వ్యతిరేకించారు. ఈ తరహా వివాహాలను చట్టబద్ధం చేయాలని, ఊరట కల్పించాలని పిటిషనర్ కోరారని ఇందుకు అనుమతిస్తే ఇది పలు చట్ట నిబంధనలకు విరుద్ధమవుతుందని అన్నారు. హిందూ వివాహ చట్టంలో వివాహాల నియంత్రణ, వివాహేతర సంబంధాల నివారణకు పలు నిబంధనలు భార్య, భర్తల గురించి ప్రస్తావిస్తాయని స్వలింగ జంటల్లో ఈ పాత్రలను ఎలా చూస్తారని మెహతా ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా పద్ధతులు మారిపోతున్నాయని, అయితే అవి భారత్‌కు వర్తించవచ్చు..వర్తింపకపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి : చనిపోయేవరకు స్వలింగ సంపర్కులని తెలియదు ఈ కేసులో పిటిషన్ అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. ప్రభావితమయ్యే వారు బాగా చదువుకున్నవారని, వారు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్క చర్యలను సుప్రీంకోర్టు నేరపూరిత స్వభావం నుంచి తొలగించినా స్వలింగ జంటల వివాహాలు ఇప్పటికీ సాధ్యం కావడం లేదని పిటిషన్ వాదించింది. ఇక స్వలింగ వివాహాన్ని రిజిస్టర్ చేసేందుకు నిరాకరణకు గురైన వ్యక్తుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభిజిత్ అయ్యర్ మిత్రాను కోర్టు కోరింది. తదుపరి విచారణను అక్టోవర్ 21కి హైకోర్టు వాయిదా వేసింది. -
ఇష్టపడిన అమ్మాయిలు.. మోసగించి పెళ్లి..
సాక్షి, న్యూఢిల్లీ : ఒకరినొకరు ఇష్టపడిన అమ్మాయిలు కుటుంబాలను మోసగించి వివాహం చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఇద్దరు యువతుల్లో ఒకరు పురుషుడిలా నటించి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయించారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఇద్దరు యువతులకు రెండేళ్లుగా పరిచయం ఉంది. తోటివారే కావడంతో కుటుంబ పెద్దలు కూడా వారు చనువుగా ఉండటంపై నిబంధనలు పెట్టలేదు. ఈ నెల 16న నకిలీ తల్లిదండ్రులను సాక్ష్యులుగా చూపుతూ ఫేక్ ఐడీ కార్డులను సృష్టించిన వారు వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇద్దరు యువతుల్లో ఒకరు కార్తీక్ శుక్లా(వరుడిలా) అనే పేరుతో నకిలీ ఆధార్‌కార్డును సృష్టించారు. వివాహం చేసుకున్న వారిని కుటుంబ పెద్దలు పెద్దమనసుతో ఆశీర్వదించారు. అయితే, శనివారం కార్తీక్ శుక్లా వేషధారణలో ఉన్న యువతి అబ్బాయి కాదని గుర్తించిన వధువు తల్లిదండ్రులు ఆమె ఇంటిపై దాడి చేశారు. దీంతో వధువు మేడ మీది నుంచి కిందికి దూకింది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకోవడంతో వివాదం సద్దమణిగింది. భారత్‌లో స్వలింగ వివాహం చట్టబద్దమేనా? స్వలింగ సంపర్కాన్ని ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) సెక్షన్ 377 సమర్థించడం లేదు. ప్రకృతికి విరుద్ధమైన స్వలింగ సంపర్కం చట్ట రీత్యా నేరంగా భారత్‌లో పరిగణిస్తున్నారు. అయితే, స్వలింగ వివాహంపై ఈ సెక్షన్లో ఎలాంటి సూచనలు చేయలేదు. వ్యక్తిగత విషయాల్లో గోప్యతపై భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు అనంతరం సెక్షన్ 377పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాగా, సోమవారం సెక్షన్ 377 కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకూడదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా స్పందించాలని ఆదేశించింది. -
మహిళను పెళ్లాడిన మహిళ!
జలంధర్: ఓ మహిళను మరో మహిళ పెళ్లాడిన ఘటన పంజాబ్‌లో జరిగింది. ప్రభుత్వ అధికారిని అయిన మంజీత్ కౌర్ సంధూ గత శనివారం 27 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జలంధర్ నగరంలోని ఓ దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లి వేడుకలో సమీప బంధుమిత్రులు పాల్గొన్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న మంజీత్ కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా తన 'భార్య'ను ఇంటికి తెచ్చుకున్నారు. వీరి పెళ్లి జరిగిన కాసేపటికే వివాహం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో స్థానికంగా హల్చల్ చేశాయి. వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో మిశ్రమస్పందన వ్యక్తమవుతున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్వలింగ వివాహాలు నేరం కింద వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. -
బీహార్‌లో పారిపోయి.. అమ్మాయిని పెళ్లాడిన అమ్మడు
బీహార్‌లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు తమ ఇళ్లనుంచి పారిపోయి.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అవును, మీరు చదివింది కరెక్టే. ఇద్దరూ వేర్వేరుగా ఇద్దరు అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం కాదు.. ఇద్దరు అమ్మాయిలే పరస్పరం పెళ్లి చేసుకున్నారు. దీంతో అమ్మాయిలిద్దరిలో ఒకరి తండ్రి, రెండో అమ్మాయి కుటుంబంపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అమ్మాయిలిద్దరూ పెళ్లి చేసుకుని దంపతుల్లా కలిసుంటున్నారు. వీరు రోహ్తస్ జిల్లాలోని ససరాంలో గల ఓ హోటల్లో ఉండగా పోలీసులకు చిక్కారు. వారి మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా పోలీసులు వారి ఆచూకీ కనుక్కోగలిగారు. అమ్మాయిలిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసు అధికారి ఎన్కే రజాక్ తెలిపారు. అమ్మాయిలిద్దరూ ఈనెల నాలుగో తేదీన పారిపోయి, ససరాంలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. వాళ్లిద్దరూ చిన్నతనం నుంచి స్నేహితులు, కలిసి చదువుకున్నారు కూడా.